28, జులై 2010, బుధవారం

సమస్య పూరణం - 50

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
పాపాత్ముండైన నరుఁడు స్వర్గముఁ జేరెన్.

15 కామెంట్‌లు:

  1. నీ పాద కమల మయ్యది.
    గోపాలా! నాదు వేణు గోప శతకమే.
    ప్రాపించగ; పఠియించిన
    పాపాత్ముండైన నరుఁడు స్వర్గముఁ జేరెన్.
    (శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము నా చేత వ్రాయఁ బడినది)

    రిప్లయితొలగించండి
  2. రామకృష్ణారావు గారూ,
    ఎంత చక్కని పద్యాన్ని చెప్పారు. అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు. మీ వేణుగోప శతకంలో కొన్ని పద్యాలను మీ ఆంధ్రామృతం బ్లాగులో చదివాను. చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  3. మీ సమస్యాపూరణలు 50 సంఖ్యకు చేరినందులకు అభినందనలు! మీ ఈ శీర్షిక బ్లాగ్లోకంలో పద్యప్రియులను అలరిస్తోంది.

    రిప్లయితొలగించండి
  4. లోపాన్విత మృదులాంత్రము
    ప్రాపించిరి నరకమందు పనితగ్గుటకై.
    పాపాల లెక్క దప్పెను.
    పాపాత్ముండైన నరుఁడు స్వర్గముఁ జేరెన్

    రిప్లయితొలగించండి
  5. చిత్రగుప్తుడికి పని ఎక్కువైందని,యముడే, ఒక కంప్యూటర్ , ఒక సాఫ్ట్ వేర్ ప్యాకేజీ కొనిబెడితే అందులో అన్నీ తప్పులేట ( Bugs)

    పాపమ్మంచును యముడే
    కూపీలాగు పి.సి చిత్రగుప్తునికిడగా
    లోపాలుండుట దానన్
    పాపాత్ముండైన నరుఁడు స్వర్గముఁ జేరెన్.

    రిప్లయితొలగించండి
  6. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
    ధన్యవాదాలు.

    రవి గారూ,
    చమత్కారంగా సమస్యను పూరించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. పాపాలెన్నో చేసిన
    భూపాలుడు లేశమంత పుణ్యము చేసెన్
    ఆ ఫలమును అనుభవించ
    పాపాత్ముండైన నరుఁడు స్వర్గముఁ జేరెన్.

    రిప్లయితొలగించండి
  8. గత పూరణ తప్పు తప్పు తప్పు. మార్చాను, పరిశీలించండి.

    పాపాలెన్నో చేసిన
    భూపాలుడు లేశమంత పుణ్యము చేసెన్
    ఆ ఫలమును పొందుటకై
    పాపాత్ముండైన నరుఁడు స్వర్గముఁ జేరెన్.

    రిప్లయితొలగించండి
  9. ఈపాటికె నరకములో
    పాపులతో నిండిపోగ,పాపారాయన్
    పాపికి చోటే దొరకక
    పాపాత్ముండైన నరుఁడు స్వర్గముఁ జేరెన్.

    రిప్లయితొలగించండి
  10. అజ్ఞాత గారు, నేను ఒకే రకం పూరణనిచ్చాము. దానికి ఇంకాస్త మెరుగు.

    లోపాన్విత సాఫ్ట్వేరును
    స్థాపించిరి యముని కొలువుఁ శ్రమఁ దీర్చుటకై
    పాపాల లెక్క దప్పెను.
    పాపాత్ముండైన నరుఁడు స్వర్గముఁ జేరెన్.

    రిప్లయితొలగించండి
  11. అజ్ఞాత గారూ,
    చదువరి గారూ,
    నచికేత్ గారూ,
    రవి గారూ,
    అందరి పూరణలు మనోల్లాసాన్ని కలిగించాయి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. నా పూరణలు -
    (1)
    ఏ పుణ్యములను జేయకఁ
    బాపఁపు కృత్యములఁ జేసి పతితుండై పో
    యే పట్టున హరిఁ దలఁచిన
    పాపాత్ముండైన నరుఁడు స్వర్గముఁ జేరెన్.
    (2)
    తాపముఁ గనె నరకమ్మున
    పాపాత్ముండైన నరుఁడు; స్వర్గముఁ జేరెన్
    పాప విదూరుండై యె
    న్నో పుణ్యఁపుఁ బనులు సేయు నుతగుణఖనియే.

    రిప్లయితొలగించండి
  13. చూపగ కృష్ణుడు దారిని
    కోపము నెరుగని ఘటికుడు కుందుచు మనమున్
    తాపముతో బొంకు నుడువ
    పాపాత్ముండైన నరుఁడు స్వర్గముఁ జేరెన్

    రిప్లయితొలగించండి
  14. మీ బ్లాగులో ఎంతో మంది ఔత్సాహిక కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు. నన్ను చేర్చు కో మనవి.
    ATVS.SATYANARAYANA(ఆదిభట్ల సత్యనారాయణ)
    9441089667.
    ATVs.satyanarayana @gmail.com

    రిప్లయితొలగించండి
  15. సమస్యా పూరణ
    సమస్య:
    గర్భములోనున్న బిడ్డ గ్రక్కున తుమ్మెన్


    నిర్భర ముగనా కేమని

    నిర్భయ ముగవానతడిసె నేమని చెప్పన్

    గర్భవ తియగుట చేతను

    గర్భము లోనున్న బిడ్డ గ్రక్కున తుమ్మెన్

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి