దాచి పెట్టిన సొమ్మును దోచుకొనఁగ వత్తురో దొంగలని, వాడు పగలు రాత్రి నిదుర మాని కాపుగనుండి నీరసించె కలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము!!
ధనము కలిగిన మనసుకు తృప్తి లేదుకొంత యుండిన మరియింత కోర నగునుతనను మించిన కలుగును తామసంబుకలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము.
కలిమి యున్నంత కాలమ్ము కపట ప్రేమ చెలిమి చేయంగ వత్తురు చెరువు నిండ బలిమి లేనట్టి తరుణమ్ము బదులు రాక కలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము
జిగురు సత్యనారాయణ గారూ,హరి దోర్నాల గారూ,ఇద్దరి పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
నేదునూరి రాజేశ్వరి గారూ,పూరణ బాగుంది. అభినందనలు. మొదటి పాదంలో "కపటప్రేమ" అన్నప్పుడు సమాసగతమై ఉన్నందున ట గురువు అవుతుంది. దానిని "కపటమైన" అని సవరిస్తే సరిపోతుంది.
మదిని నిండినట్టి మమత మాయజేసిపంచ నిచ్చగించని ప్రేమ పరిమళమ్ముతనకె వలయుననెడి స్వార్థ తపన యున్నకలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము
సుమిత్ర గారూ,బాగుంది మీ పూరణ. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి !01)_____________________________________కన్నుమిన్నును గానని - కావరమునుకన్నవారిని దూషించు - కఱుకు తనముకలిమితోడనె పెరుగును ! - కరుణ వీడు !కంటకం బగు మిత్రుల - గలసి యుండకలి వశమున ! యీనాటి - కాల మహిమ !కలిమి యెడబాసి నప్పుడే - కలుగు సుఖము !కళ్ళ కమ్మిన పొరలవి - కరుగు నిజము !_____________________________________
వసంత కిశోర్ గారూ,జీవనసత్యాలను వెలిబుచ్చారు మీ పూరణలో. బాగుంది. అభినందనలు.
దాచి పెట్టిన సొమ్మును దోచుకొనఁగ
రిప్లయితొలగించండివత్తురో దొంగలని, వాడు పగలు రాత్రి
నిదుర మాని కాపుగనుండి నీరసించె
కలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము!!
ధనము కలిగిన మనసుకు తృప్తి లేదు
రిప్లయితొలగించండికొంత యుండిన మరియింత కోర నగును
తనను మించిన కలుగును తామసంబు
కలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము.
కలిమి యున్నంత కాలమ్ము కపట ప్రేమ
రిప్లయితొలగించండిచెలిమి చేయంగ వత్తురు చెరువు నిండ
బలిమి లేనట్టి తరుణమ్ము బదులు రాక
కలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిహరి దోర్నాల గారూ,
ఇద్దరి పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
నేదునూరి రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండిపూరణ బాగుంది. అభినందనలు. మొదటి పాదంలో "కపటప్రేమ" అన్నప్పుడు సమాసగతమై ఉన్నందున ట గురువు అవుతుంది. దానిని "కపటమైన" అని సవరిస్తే సరిపోతుంది.
మదిని నిండినట్టి మమత మాయజేసి
రిప్లయితొలగించండిపంచ నిచ్చగించని ప్రేమ పరిమళమ్ము
తనకె వలయుననెడి స్వార్థ తపన యున్న
కలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము
సుమిత్ర గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_____________________________________
కన్నుమిన్నును గానని - కావరమును
కన్నవారిని దూషించు - కఱుకు తనము
కలిమితోడనె పెరుగును ! - కరుణ వీడు !
కంటకం బగు మిత్రుల - గలసి యుండ
కలి వశమున ! యీనాటి - కాల మహిమ !
కలిమి యెడబాసి నప్పుడే - కలుగు సుఖము !
కళ్ళ కమ్మిన పొరలవి - కరుగు నిజము !
_____________________________________
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిజీవనసత్యాలను వెలిబుచ్చారు మీ పూరణలో. బాగుంది. అభినందనలు.