నా పూరణలు - (1) మందిరమ్ముఁ జేరి మధుర గానమ్ముతో మాల దాసరి హరి మహిమఁ దెలిపె వేయి పేరులున్న వేల్పును గొల్చి యా పేరు లేని వాఁడు పేర్మిఁ గనెను. (2) సర్వ నామములకు సర్వ రూపములకు తావల మయినట్టి దైవ మితఁడె ఎట్టి రూపమునకు పట్టక, నే యొక్క పేరు లేని వాఁడు పేర్మిఁ గనెను.
తమ్ముడు ! శంకరయ్య గారు చెప్పినట్టు నిజంగా నా పూరణ నీ మెప్పు పొందడం నా అదృష్టం .వచ్చి రాని రాతలు నేను రాసినా మీరందరు సమర్ధించి నన్నింత గా ప్రోత్స హిస్తున్నందుకు మీ అందరికి నాకృతజ్ఞతలు సరస్వతీ పుత్రులైన పండితుల మధ్య నా పేరు నా పూర్వ జన్మ సుకృతం. అందరికి ధన్య వాదములు.
అందరికీ వందనములు ! అందరి పూరణలూ అలరించు చున్నవి ! 01) _____________________________________
పేరు లేక యున్న ! - పేకాడు వాడైన ! పెద్ద వాడు గాని ! - పిన్న గాని ! పెళ్ళి జరుగు వేళ - పెండ్లి కుమారుడు పేరు లేనివాఁడు - పేర్మిఁ గనెను ! _____________________________________
ఫాక్షనిజము సల్పి పలు నేరముల జేసి
రిప్లయితొలగించండిపదవి వచ్చినంత ఫ్రాడు జేసి
తాను జచ్చినంత తనయుడు అరుదెంచి
పేరు లేనివాఁడు పేర్మిఁ గనెను.
ఊరు పేరుఁ గల్గి ఉత్సహించినవార
రిప్లయితొలగించండిలేరి భువిని? కాన రారు. నిజము.
ఊరు పేరు లేని ధీరుండు దైవమే.
పేరు లేని వాఁడు పేర్మిఁ గనెను.
హరి దోర్నాల గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. ఉత్తమమైన పూరణ నందించారు.
పుట్టుకదియు వింత పుడమి జనులకెల్ల
రిప్లయితొలగించండితనువు యొకటె గాని, తలలు రెండు.
వింత వార్తలందు విశ్వ మంత దెలిసి
పేరు లేని వాఁడు పేర్మిఁ గనెను
కాటి వాసి వాఁడు గరళఁపు మేతరి
రిప్లయితొలగించండిఉరగ ధారి పరఁగి ఉమను గూడె.
ఒట్టి బూదిఁ దప్ప ఒడనొక్క కాసుల
పేరు లేనివాఁడు పేర్మిఁ గనెను.
మీ అందరి పూరణలు చాలా బాగున్నాయ్.
రిప్లయితొలగించండి"పేరు" పేరు చెప్పి పేర్మినందిరి మీరు
రవియు హరియు మరియు రామకృష్ణు.
శివుడు పేరు గాంచె చిన్న పద్యమందు
ఫాక్షనిజముయైన ఫాక్టుయైన."
మా చెల్లెలికి రవిగారి పూరణ బాగానచ్చింది. వారి భావాలు లోతుగా ఉంటాయని చెప్పమంది.
మరో మాట.. మీ పేరు అంటే చాలా ఇష్టం.
సుమిత్ర గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలు
రవి గారూ,
రిప్లయితొలగించండి"కాసుల పేరు లేనివాడా?" బాగు ... బాగు. అభినందనలు.
నా పూరణలు -
రిప్లయితొలగించండి(1)
మందిరమ్ముఁ జేరి మధుర గానమ్ముతో
మాల దాసరి హరి మహిమఁ దెలిపె
వేయి పేరులున్న వేల్పును గొల్చి యా
పేరు లేని వాఁడు పేర్మిఁ గనెను.
(2)
సర్వ నామములకు సర్వ రూపములకు
తావల మయినట్టి దైవ మితఁడె
ఎట్టి రూపమునకు పట్టక, నే యొక్క
పేరు లేని వాఁడు పేర్మిఁ గనెను.
తండ్రి పేరు జెప్పి తనయుండు వెడలంగ
రిప్లయితొలగించండిబలిమి లేదు గాని కలిమి గలదు
పైస లున్న చాలు పరమాత్మ దిగిరాడ ?
పేరు లేని వాడు పేర్మి గనెను
శంకరయ్య గారు, ఆముక్తమాల్యద ఉదంతంతో మీ పూరణ, రెండవ పూరణ కూడా అద్భుతంగా ఉన్నాయి
రిప్లయితొలగించండివాః! మన రాజేశ్వరక్క పూరణ అద్భుతం. అభినందనలమ్మా!సుమిత్ర చమత్కారం బాగు బాగు.మిగిలిన ప్రసిద్ధ కవుల పూరణలు వేర్ చెప్పనేల? అందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండిపేరు ఊరు లేని భిక్షకుండొక్కడు
రిప్లయితొలగించండిగేటు ముందు కొచ్చి కేక వేసె
అన్నపూర్ణ తల్లి అన్నంబు నిడగానె
పేరు లేని వాడు పేర్మి గనెను
చిత్రమైన చలన చిత్రమష్టాచెమ్మ
రిప్లయితొలగించండిఇష్ట సఖిని పొంద కష్టమైన
పేరు మార్చు కొనెను ప్రేమ తోడ, మహేషు
పేరు లేనివాఁడు పేర్మిఁ గనెను!!
నేదునూరి రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చింతా రామకృష్ణారావు గారి ప్రశంసలు పొందిందంటే నిజంగా మీరు ధన్యులు. పూరణ చాలా బాగుంది. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండి"శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మీ పూరణ బాగుంది. అభినందనలు. మీ "కిటికీ" చూసాను. బాగుంది.
జిగిరు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండి"అష్టాచెమ్మా" చిత్రాన్ని ప్రస్తావిస్తూ మీరు చేసిన పూరణ అద్భుతం. ధన్యవాదాలు.
చింతా రామకృష్ణా రావు గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రశంసలు, ఆశీస్సులతో కవుల ఉత్సాహం ద్విగుణీకృతమౌతుంది. మీరిలాగే ఎప్పటి కప్పుడు పూరణల గుణదోషాలను విశ్లేషిస్తూ ప్రోత్సహించ వలసిందిగా మనవి.
ఊకదంపుడనుచు ఊసుపోకనె వ్రాయు
రిప్లయితొలగించండినరుడొకండిచటనె నయముగాను
పద్దెమిష్టమగుత పెద్దల ఎరుకొంది
పేరు లేని వాడె పేర్మి గనెను
తమ్ముడు ! శంకరయ్య గారు చెప్పినట్టు నిజంగా నా పూరణ నీ మెప్పు పొందడం నా అదృష్టం .వచ్చి రాని రాతలు నేను రాసినా మీరందరు సమర్ధించి నన్నింత గా ప్రోత్స హిస్తున్నందుకు మీ అందరికి నాకృతజ్ఞతలు సరస్వతీ పుత్రులైన పండితుల మధ్య నా పేరు నా పూర్వ జన్మ సుకృతం. అందరికి ధన్య వాదములు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_____________________________________
పేరు లేక యున్న ! - పేకాడు వాడైన !
పెద్ద వాడు గాని ! - పిన్న గాని !
పెళ్ళి జరుగు వేళ - పెండ్లి కుమారుడు
పేరు లేనివాఁడు - పేర్మిఁ గనెను !
_____________________________________