5, జులై 2010, సోమవారం

సమస్యా పూరణం - 30

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
రౌడీలే పాలకు లగు రాజ్య మిదయ్యెన్.

23 కామెంట్‌లు:

  1. బడులందు చదువైనను
    గుడులందున దైవాపూజ గుణ హీనమయెన్
    కడు దైన్యము నేటి స్థితి
    రౌడీలే పాలకు లగు రాజ్య మిదయ్యెన్

    రిప్లయితొలగించండి
  2. సుమిత్ర గారూ,
    మంచి పూరణ. అయితే మూడు గణదోషా లున్నాయి. వాటిని సవరించాను.
    బడులందు చదువు లైనను
    గుడులందున దైవపూజ గుణహీనమయెన్
    కడు దైన్యము నేటి స్థితియె
    రౌడీలే ......

    రిప్లయితొలగించండి
  3. గుడిసెల బ్రతుకుల నీడ్చెడు
    బడుగులు పైసకు మొహములు వాయగ నకటా
    విడుదురు వోటుల నోటుకు
    రౌడీలే పాలకు లగు రాజ్య మిదయ్యెన్.

    రిప్లయితొలగించండి
  4. హరి దోర్నాల గారూ,
    బాగుందండీ మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. వాడిగ తొడలను గొట్టెడి
    లీడరు, తలలు నరుకుమను లీడరు, చూడన్
    దాడులు చెయ్యగ పలికెడి
    రౌడీలే పాలకు లగు రాజ్య మిదయ్యెన్!!

    రిప్లయితొలగించండి
  6. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ చాల బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. హరి గారు, సుమిత్ర గారు,
    ప్రాస నియమము ఉన్న పద్యాలలో పూర్వాక్షరము గురువైతే అన్ని పాదాలలో అదే విధముగా ఉండాలనేది నియమము.

    రిప్లయితొలగించండి
  8. గిరి గారూ,
    నిజమే సుమా! ఈ విషయం నా దృష్టికి రాలేదెందుకో.

    రిప్లయితొలగించండి
  9. ఱేడుల విధాన సభలో
    వాడిగ బూతులుఁ బలుకుచు వైరుల్ మైకుల్
    దాడిగ విరచుచుఁ యరచెడి
    రౌడీలే పాలకులగు రాజ్యమిదయ్యెన్

    రిప్లయితొలగించండి
  10. రవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. నా పూరణ -
    వీడెను నీతి, నిజాయితి
    మూడెను కీడు గణతంత్రమునకుఁ గనంగన్
    నేడు ధనమదోన్మత్తులు
    రౌడీలే పాలకు లగు రజ్య మిదయ్యెన్.

    రిప్లయితొలగించండి
  12. సీడు కెపిటల్ యుఫైండిన్
    సాడు పొలిటికల్ మిలియు హెసాల్వేస్బీన్దిస్
    బాడు మని ఫరాల్డీడ్సో,
    రౌడీలే పాలకు లగు రాజ్యమిదయ్యెన్

    seed capital you find in
    sad political milieu has always been this
    bad money for all deeds so
    రౌడీలే పాలకులగు రాజ్యమిదయ్యెన్

    రిప్లయితొలగించండి
  13. కేడీలూ గూండాలూ
    రౌడీలే పాలకులగు రాజ్య మిదయ్యెన్
    చూడండీ తోడేళ్ళను
    లేడండీ నీచుడింక లీడరు కంటెన్

    కేడీలూ గూండాలూ
    రౌడీలే పాలకులగు రాజ్య మిదయ్యెన్
    ఈడూ ఆడని చూడక
    ఏడిగ ఏటాడవలెను ఎన్‍కౌంటరులో

    రిప్లయితొలగించండి
  14. చదువరి గారి పూరణలు -
    కేడీలూ గూండాలూ
    రౌడీలే పాలకులగు రాజ్య మిదయ్యెన్
    చూడండీ తోడేళ్ళను
    లేడండీ నీచుడింక లీడరు కంటెన్

    కేడీలూ గూండాలూ
    రౌడీలే పాలకులగు రాజ్య మిదయ్యెన్
    ఈడూ ఆడని చూడక
    ఏడిగ ఏటాడవలెను ఎన్‍కౌంటరులో

    రిప్లయితొలగించండి
  15. హరి దోర్నాల గారి వ్యాఖ్య -
    గిరి గారు
    సూచనకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    _____________________________________

    గోడే వినరెవ్వరిదీ
    కీడే జేయన్ దలచెడి - కీచకులోయీ !
    కూడీ జనులన్ దోచెడి
    రౌడీలే పాలకు లగు - రాజ్య మిదయ్యెన్ !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  17. వసంత కిశోర్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ‘ఎవ్వరిదీ’ వ్యావహారికి రూపం కదా. ‘గోడెవ్వరిదియు వినకను / గోడు విన దెవరి దైనను’ అందాం.

    రిప్లయితొలగించండి
  18. చూడగ లంచపు గొండులు
    గూడుపుఠాణిలును మెండు క్రూరపు హత్యల్
    మోడీ చెప్పెను మమతకు:
    "రౌడీలే పాలకు లగు రాజ్య మిదయ్యెన్"

    రిప్లయితొలగించండి


  19. శుభోదయం

    చాన్నాళ్ళుగా మా లక్కు, పేట రౌడీ మాలికాధ్యక్షుండు బ్లాగ్దేశంలో సైలెంటు అబ్సర్వర్ గా మారి పోయేరు వారికిదే అంకితం :)


    బోడీ పూబోడీ బ్లా
    గ్లాడీ వినవమ్మ మాలికాధ్యక్షుండే
    రౌడీ! మా లక్పేటన్
    రౌడీలే పాలకు లగు రాజ్య మిదయ్యెన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి