జిగురు సత్యనారాయణ గారూ, నన్ను మీరు క్షమించాలి. మీ పూరణ నాకు మెయిల్ లో కనిపించలేదు. అది నేరుగా మాడరేషన్ లోకి వెళ్ళింది. మీరన్నట్లు టెక్నికల్ ప్రాబ్లమే. వెతికితే దొరికింది. మీ పూరణ బాగుంది. అచ్చ తెలుగు పద్యం చదివిన అనుభూతి కలిగింది. ధన్యవాదాలు. మీ పూరణ కనిపించక హరి దోర్నాల ఒక్కరే పంపించారని బావించి పద్యం వ్రాసాను. మరో మారు క్షంతవ్యుణ్ణి. "మరల తెరలేచె రణమునకు మనుజలరయ" అన్న పాదంలో గణదోషం ఉంది. రణమునకు అన్న చోట "కు" ఎక్కువయింది. దానిని ఇలా సవరిస్తే సరిపోతుంది. "మరల తెరలేచె రణమున కరయ జనులు" ... ఏమంటారు?
శంకరయ్యగారు, అందరి పూరణలు బాగున్నాయి. సమాయాభావం వల్ల నేను పూరించలేకపోతున్నాను. మరొక విషయం. నేను 'గొడుగు కలిగి కూడ తడిసినాడు' సమస్య పూరించి 8వ తారీఖు పంపానండి. కనిపించలేదు.
శంకరయ్య గారు, సవరణకు ధన్యవాదాలండి. మొదట "మరల తెరలేచె రణముకు మనుజలరయ" అనే వ్రాసుకున్న. పద్యము Fair చేసెటప్పుడు అదనముగ "న" వచ్చింది. కాని మీ సవరణ నేను వ్రాసుకున్న దాని కంటే బాగుంది.
అరచేతిని స్వర్గములట
రిప్లయితొలగించండితెర లేపిరి అనృతములకు, తిట్లాటలకున్
చెర బట్టినారు జాతిని
మరతురు పోలింగు లైన మరుసటి రోజే
హరి దోర్నాల గారూ,
రిప్లయితొలగించండినేను ఊహించనంత గొప్పగా దత్తపదిని సాధించారు. చాలా బాగుంది. హృదయపూర్వక ధన్యవాదాలు.
హరి దోర్నాల: పద్యం చాలా బాగుందండి.
రిప్లయితొలగించండిహరి గారు,
రిప్లయితొలగించండిపద్యము చాలా బాగా వచ్చింది.
కంది శంకరయ్య గారు, చదువరి గారు, జిగురు సత్య నారాయణ గారు
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
అరఁగులమర వాతెఱ విప్పె చెరచెరగను
రిప్లయితొలగించండిమరల తెరలేచె రణమునకు మనుజలరయ
మరణపునరణి చెరలాడి తెరలు చుండె
అరమరలు దీర్ప చెచ్చెర తెరలి రమ్ము!!
అరఁగు = వేదిక;
అమర = ఒప్పునట్లు;
వాతెఱ = పెదవి;
చెరచెర = వెంటనే
మనుజలరయ = మనుజులు + అరయ = ప్రజలు చూస్తుండగా
మరణపునరణి = మరణము + అరణి = మరణము అనే అగ్నిని పుట్టించేది.
చెరలాడి = సంచరిస్తూ
తెరలు చుండె = తెర్లు చుండె = ఉడికిపోతుంది
అరమరలు = సందేహాలు
చెచ్చెర = శ్రీఘ్రనుగా
తెరలి రమ్ము = బలుదేరి రమ్ము.
Typos
రిప్లయితొలగించండిచెచ్చెర = శీఘ్రముగా
తెరలి రమ్ము = బయలుదేరి రమ్ము.
హరి దోర్నాల యొకండె దత్తపది నత్యంత ప్రశంసార్హతన్
రిప్లయితొలగించండిపరిపూర్తిం గనఁ జూచె భావముల సంపత్ స్ఫూర్తితో మేలనన్
స్మరియింతున్ కవిలోకమున్ ఘన సమస్యాపూరణం బుత్సుకన్
త్వరగాఁ బంపెడి వార లేలనొ ప్రతిస్పందించ రయ్యో? హరీ!
శంకరయ్య గారు,
రిప్లయితొలగించండినేను పంపిన పూరణ కనపడటము లేదు. అది మీకు అంద లేదా? ఎమైనా Technical Issues ఉన్నయేమో!!
అరచేతను స్వర్గము కలదని
రిప్లయితొలగించండిచెరబట్టుకు బడుగు మనుజుల చేకొని పోవన్
తెరపడదు కుటిలము నకెన్నడు
మర్మము లెరిగిన నియతలు మాంత్రికులేగా
నమస్కారములు. పొరబడితే ఏముంది ? మామూలేగా ? [ అందుకె ముందుగా ]ధన్య వాదములు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేదునూరి రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండిభావం బాగున్నా పద్యంలో గణదోషా లున్నాయి. నాల్గవ పాదంలో ప్రాస తప్పింది. ఏమయితే నేం? అభినందనలు. సవరించిన పద్యం ఇది ....
అరచేత స్వర్గ ముందని
చెరబట్టుకు బడుగు జనులఁ జేకొని పోవన్
తెర పడదు కుటిలమున కర
మర లెఱుఁగు నియంతలు గన మాంత్రికులేగా!
నా పూరణ -
రిప్లయితొలగించండిఅరచుచు, వోటడుగుచు క
త్తెర పడని నినాదరవము దిమ్మదిరుగఁ జె
చ్చెర నోటు, మద్య మొసఁగుచు
మరల మరల నావృతమయి మరపించునులే!
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండినన్ను మీరు క్షమించాలి. మీ పూరణ నాకు మెయిల్ లో కనిపించలేదు. అది నేరుగా మాడరేషన్ లోకి వెళ్ళింది. మీరన్నట్లు టెక్నికల్ ప్రాబ్లమే. వెతికితే దొరికింది.
మీ పూరణ బాగుంది. అచ్చ తెలుగు పద్యం చదివిన అనుభూతి కలిగింది. ధన్యవాదాలు. మీ పూరణ కనిపించక హరి దోర్నాల ఒక్కరే పంపించారని బావించి పద్యం వ్రాసాను. మరో మారు క్షంతవ్యుణ్ణి.
"మరల తెరలేచె రణమునకు మనుజలరయ" అన్న పాదంలో గణదోషం ఉంది. రణమునకు అన్న చోట "కు" ఎక్కువయింది. దానిని ఇలా సవరిస్తే సరిపోతుంది. "మరల తెరలేచె రణమున కరయ జనులు" ... ఏమంటారు?
సత్యనారాయణ గారి పద్యం ఏ ఛందస్సండి? నాకు అలాంటి యమకంలోే పద్యం అల్లాలనిపించింది, భాష, భావం కుదరడం లేదు.
రిప్లయితొలగించండిరవి గారూ,
రిప్లయితొలగించండిఅది "తేటగీతి" కదండీ. మీరు సరిగా గమనించినట్టు లేదు.
శంకరయ్యగారు,
రిప్లయితొలగించండిఅందరి పూరణలు బాగున్నాయి. సమాయాభావం వల్ల నేను పూరించలేకపోతున్నాను.
మరొక విషయం. నేను 'గొడుగు కలిగి కూడ తడిసినాడు' సమస్య పూరించి 8వ తారీఖు పంపానండి. కనిపించలేదు.
శంకరయ్య గారు,
రిప్లయితొలగించండిసవరణకు ధన్యవాదాలండి. మొదట "మరల తెరలేచె రణముకు మనుజలరయ" అనే వ్రాసుకున్న. పద్యము Fair చేసెటప్పుడు అదనముగ "న" వచ్చింది. కాని మీ సవరణ నేను వ్రాసుకున్న దాని కంటే బాగుంది.
అరమర యేలరా? మదిని హాయిగ నన్గని కావ నీశ్వరా!
రిప్లయితొలగించండిచెరచెర రాగదే కృపను? శ్రీకర సత్పద సేవఁ జేతునం
తె; రహి వహింతునయ్య!నిను తిన్నగ చేరుచు.దుష్టునైన నన్
మరలిచి; కావుమయ్య! శుభమార్గ ప్రదీపక! వేణు గోపకా!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
నేటి రాజకీయ నాయకులు :
01)
_____________________________________
అరయగ నందరు నొకటే
తెర మరుగున సంపదలను - తిందురు గానీ
చెర విడిపింపరు దీనుల
మరల మరల నెన్నికగుచు - మాయల మాటల్ !
_____________________________________
చెర = దారిద్ర్యపు చెర
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిచాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండి