22, జులై 2010, గురువారం

సమస్యా పూరణం - 45

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్యను రవి గారు పంపారు. అది ఇది ....
పంది యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్.
వారాంతపు సమస్యా పూరణం - 1
రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.
24-07-2010 వరకు పూరణలు "వారాంతపు సమస్యా పూరణం - 1"లొ పోస్ట్ చేయండి.

17 కామెంట్‌లు:

  1. సుందరి సుకుమారత్వము
    నందము గని పతియె మెచ్చి యామెను పొగడెన్.
    సుందరి పొంగగ; తన వల
    పంది యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్.

    రిప్లయితొలగించండి
  2. చింతా రామకృష్ణారావు గారూ,
    "వలపందించిన" మీ పూరణ అద్భుతం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. నందికివలెగుడినం;దొక
    మందుడు టీవీ కతుకుగ, మరుశరములనే
    సంధించగసతి,పెను ఊ
    పంది...

    రిప్లయితొలగించండి
  4. ఉన్న ఒక్క పదం చింతా వారు వాడేసారు " అదె వలపందించి " ఇంక ఏపదం వాడినా దానికి సాటి రాదు

    రిప్లయితొలగించండి
  5. కుందనఁపు బొమ్మ సుమకర
    మందిన సుందర వదనుఁడు మంగళ రాత్రిన్
    పొందు మరులెసఁగ వధుఁ కొ
    ప్పంది యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్

    సుందర పతి శోభనమున
    చిందిలి పాటునఁ పొలతుఁక చేయందింపన్
    కందువ తాఁ మదనుఁడి రూ
    పంది యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్

    రిప్లయితొలగించండి
  6. సందుల గొందుల యందున
    మందుకు బానిసగ మారి మత్తుగ దొర్లెన్
    పందిని పడతిగ తలఁచెను
    పంది యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్!!

    రిప్లయితొలగించండి
  7. కందెను చెక్కిలి చెలియకు
    సందిట బందీని చేసి సరసము లాడన్
    చిందిన రాగపు కన్నుల చూ
    పంది యధర సుధల గ్రోలి పరవశుడయ్యెన్ !

    రిప్లయితొలగించండి
  8. పూరణము,
    సందర సూకరి పంకిల
    మందున పొర్లుట వరాహు డారసి మదనా
    ర్తిం దుమికెనుఁ దమితో నా
    పంది యధర సుధల గ్రోలి పరవశుడయ్యెన్

    కారణము,
    కందపు సరిపాదమునన్
    పందిని కూర్చుండనిడిన ప్రక్కకుఁ పడవే
    యం దగదని యెంచితి న
    ప్పందియె యధర సుధల గ్రోలు పద్యమె వ్రాస్తిన్

    రిప్లయితొలగించండి
  9. అజ్ఞాత గారూ,
    రవి గారూ,
    జిగురు సత్యనారాయణ గారూ,
    నేదునూరి రాజేశ్వరి గారూ,
    గిరి గారూ,
    అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. గత 4 రోజులుగా జ్వరం. ఎక్కువ సేపు సిస్టం ముందు కూర్చోలేక పోతున్నాను. అందువల్ల మీ వ్యాఖ్యలకు వెంట వెంటనే స్పందించలేక పోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  10. అయ్యొ అంత జ్వరం గా ఉన్నప్పుడు ఎందుకు శ్రమ తీసుకుంటున్నారు ? రెడు రోజులు విశ్రాంతి తీసుకుని పూరణలు ఇవ్వ వచ్చును కదా ?ఆరోగ్యం జాగ్రతగా చూసు కోవాలి కదా? ఆరోగ్యం తర్వాతె ఇవన్ని మంచి మందు వేసుకుని తొందరగ కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తు

    రిప్లయితొలగించండి
  11. మీరు విశ్రాంతి తీసుకొమ్మని అర్థిస్తున్నాను. బాగా కోలుకున్న తర్వాత రండి.

    రిప్లయితొలగించండి
  12. రాజేశ్వరి గారూ,
    రవి గారూ,
    నా ఆరోగ్యం విషయంలో స్పందిచినదుకు ధన్యవాదాలు. డాక్టర్ గారిని కలిసి మందులు వాడుతున్నాను. ఇప్పుడు ఫరవాలేదు. ఏమిటో ... బ్లాగు నిర్వహణ, ఇతరుల బ్లాగులు చూడడం, వ్యాఖ్యలు పంపడం ఒక వ్యసనంగా మారింది. కాకపోతే ఎక్కువసేపు సిస్టం ముందు కూర్చుంటే మెడ, వెన్నెముక బాధ పెడుతున్నాయి. మొన్న 17 జులై కి 60 సంవత్సరాలు నిండాయి. వేరే వ్యాపకాలు లేక ఇంట్లో కూర్చోవడమే. అందుకే ఓపిక తెచ్చుకొని సిస్టం ముందు వీలైనప్పుడల్లా కూర్చుంటున్నాను. మీ అభిమానానికి మరోసారి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  13. మీ ఆరోగ్యం బాగులేదని ఈరోజే తెలిసింది. ఇప్పుడు కోలుకొన్నారని ఆశిస్తాను. దయచేసి తగినంత విశ్రాంతి తీసుకోండి.

    రిప్లయితొలగించండి
  14. పందికి సముచిత గౌరవ
    మందించెడి తలపుఁ గోరి మన్మథు దృష్టిన్
    వందితమొప్పవ రాహుని
    యందునుఁ ద్రిప్పిరి గిరివర! హాస్యము చిందన్!

    రిప్లయితొలగించండి
  15. పందిని పడితే బంటగు!
    కందము కడితేనె కవియు!! కందమ్ముననే
    పందిని పట్టెన్, సతి మె
    ప్పంది యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్.

    రిప్లయితొలగించండి
  16. అందిన ప్రియ నెచ్చెలియే
    అందించెను ప్రియుని జేరి యధరము నపుడున్
    కందిన మోమున ' క్లోజ
    ప్పంది ' ; యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్.

    రిప్లయితొలగించండి
  17. అందరిలో కూడదనుచు
    సుందరి తడికల వెనుకను చూపుచు ప్రియునిన్
    తొందరగా రమ్మను పిలు
    పంది యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్

    రిప్లయితొలగించండి