18, జులై 2010, ఆదివారం

దత్త పది - 5

కవి మిత్రులారా!
ఈ రోజు దత్తపది ఇస్తున్నాను. క్రింది పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో "నేటి సినిమాలు" విషయంగా పద్యం వ్రాయండి.
పెన్, గన్, డన్, రన్.

13 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. హరి దోర్నాల గారూ,
    పద్యం బాగుంది. నేను నేటి సినిమాల గురించి రాయమంటే మీరు నేటి రాజకీయాల గురించి రాసారు. అయినా అభినందనలు.
    అన్నట్టు మీరు ఏదో బ్లాగులో "శంకరాభరణం" మాలికలో రావడం లేదని వ్యాఖ్యానించారు. కాని నా న్లాగు మాలికలో వస్తున్నది.

    రిప్లయితొలగించండి
  3. హిట్టు సినిమాలనుచు తొడన్ గొట్టు వారు
    డ్రస్సు పిసినారిగన్ వేయు మిస్సులుండి
    హద్దు మీరన్ చలన చిత్ర హంగులన్ని
    కలసి చూపెన్ నరకమును తెలిసికొనుము!!

    రిప్లయితొలగించండి
  4. పెన్నెఱి వేణి పోయె; పలు వింతగ నేనిట సిద్ధమే యనన్
    గన్నును గీటు చుండెఁ వర కాంతలు నాయిక వేషమందు; చూ
    డన్నును సిగ్గు కోల్పడి చెడామడ ప్రేలెడు. వింతగా నధీ
    రన్నయ హీనఁ జేసెఁ గద! రమ్య వివర్జిత మైన చిత్రముల్.

    రిప్లయితొలగించండి
  5. శంకరయ్య గారు,

    దత్త పది చూసి పూర్తిగా చదవ కుండానే రాశాను. అందుకే దాన్ని ఉపసంహరించాను.

    ఒకటి రెండు సార్లు మాలికలో మన బ్లాగు కనపడక పోయే సరికి 'మాలిక'లో కనపడక పోయే సరికి రావడం లేదేమో అనుకున్నాను. మన్నించ గలరు.

    ఇక నా పద్యం.

    చూపెన్ పడతుల సొంపులు
    ఆపయి వయలెన్సు నింపి ఔరా యనగన్
    చూపెను దుబాయి లండన్
    సూపరు హిట్ చిత్రము కయి సుతుడే కోరన్

    రిప్లయితొలగించండి
  6. జిగురు సత్యనారాయణ గారూ,
    ఇప్పటి దాకా మీరు పంపిన పూరణలలో ఇది ఉత్తమోత్తమంగా నేను భావిస్తున్నాను. అభినందనలు.

    చింతా రామకృష్ణారావు గారూ,
    నా బ్లాగులో వృత్తాలు లేని లోటును మీరు పూరిస్తున్నారు. పూరణ అత్యద్భుతం. ధన్యవాదాలు.

    హరిదోర్నాల గారూ,
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు. మొదటిది ఎందుకు తొలగించారు?

    రిప్లయితొలగించండి
  7. నా పూరణ -
    హీరోయిన్ తను వూపెన్
    జీరోయె కథాబలంబు చీదర పెరుగన్
    హీరో కడు పోరాడన్
    ఘోరము లయ్యె సినిమాలు గూబలె యదురన్.

    రిప్లయితొలగించండి
  8. చేటుగ మారెన్ సృజనకు
    నీటుగ ఫారిన్ ఫిలిముల నీడన్ వెలగన్!
    మాటను చంపెన్ -తెలుగే
    బీటలు వారన్, విలువలు విలవిల లాడన్

    రిప్లయితొలగించండి
  9. చదువరి గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. పూరణలు అన్నీ బావున్నాయి. "గూబలె యదురన్" - ఇది మరీ బావుంది.

    శంకరయ్య గారు, పెద్దవారు మీరు. పిన్నలకు పేరుపేరునా సంతర్పణలెందుకండి? కొత్తగా వ్రాసే ఔత్సాహికులకు, పొఱబాట్లు జరిగినప్పుడు, మరీ అందమైన పద్యం ఎవరైనా వ్రాసినప్పుడు మాత్రం సూచిస్తే చాలు గదా.

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ____________________________________
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
    నాయకుడే రన్‌జుగ నట
    నాయిక తోడన్ చెడుగుడు - నాట్యమ్మాడన్
    మాయము గద పెన్‌విలువలు
    హేయముగా జేయు పనుల! - హీనము గన్‌టే !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  12. వసంత కిశోర్ గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి