11, జులై 2010, ఆదివారం

సమస్యా పూరణం - 35

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
కుంటివాఁడెక్కె తిరుమల కొండ పైకి.

11 కామెంట్‌లు:

 1. నా పూరణ నాకు నచ్చలేదండి. కనీసం ప్రయత్నం చేద్దాము, పద్యాలల్లడం అలవాటు తప్పదని ప్రయత్నిస్తున్నాను.

  నిద్రబోవుటె నోముగ నిల్చువాడు
  గద్దెనెక్కుటదేమిర గరుడగమన?
  దేవగౌడ ప్రధానియా? దేవదేవ!
  కుంటివాడెక్కి తిరుమల కొండపైకి

  రిప్లయితొలగించండి
 2. కంటఁజూడ దైవమ్మును కలియుగమున
  ఒంటిగ వెడల లేనట్టి కుంటి వాఁడు
  వెంట రాగ బంధు జనము వేడ్కఁగల్గ
  కుంటివాఁడెక్కె తిరుమల కొండ పైకి!!

  రిప్లయితొలగించండి
 3. కుంటివాఁడెక్కె తిరుమల కొండ పైకి
  యన్న సంశయం బదియేల అన్నలార
  ఘనుడు లిక్కరు బారనే గద్దె నెక్కి
  ధర్మకర్తగా జగతికి దాపు రించ

  రిప్లయితొలగించండి
 4. మ్రొక్కుదీర్ప కొండ నడక నెక్క నెంచి
  తిరియు చెలికాని తిరుపతి తరలిఁ దెచ్చి
  చోద్యమొఱుగ నయ్యంధుని భుజమునెక్కి
  కుంటి వాడెక్కె తిరుమల కొండపైకి

  తిరియు అంటే భిక్షాటన చేయు నని అర్థము

  రిప్లయితొలగించండి
 5. బండ రాయని తెలిసియు బదులు రాక
  గుండె నిండుగ నిలిపెను గంపె డాశ
  మండు టెండను నడచుట మరచి పోయి
  కుంటి వాడెక్కె తిరుమల కొండ పైకి

  రిప్లయితొలగించండి
 6. తెఱువరి యొకఁడు అలిపిరి చెంత నుండి
  నడకచే కొండ నెక్కఁగ దారిని యొక
  కొండి గుచ్చుట చేతను కొంత దవ్వు
  కుంటి, వాడెక్కె తిరుమల కొండ పైకి.

  రిప్లయితొలగించండి
 7. ఎంత వాడైన గానిండు, తిరుమలేశు
  దయను పొందిన చాలును, దశయు మారు.
  దర్శనమ్మును పొందెడు తపన తోడ
  కుంటి వాడెక్కె తిరుమల కొండ పైకి.

  రిప్లయితొలగించండి
 8. ఒంటరగువాడు కనరాదు కంట చూపు
  జంట లేమికి ఆకలి మంటనార్ప
  కుంటివాడెక్కె తిరుమల కొండపైకి
  వెడలు బస్సును భక్తుల వేడుటకును

  రిప్లయితొలగించండి
 9. సందీప్ గారూ,
  పద్యం సలక్షణంగా ఉంది. అభినందనలు. భావమే కాస్త తికమకగా ఉంది.

  జిగురు సత్యనారాయణ గారూ,
  పూరణ బాగుంది. అభినందనలు.

  హరి దోర్నాల గారూ,
  పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

  గిరి గారూ,
  చిన్నప్పుడు చదువుకున్న కుంటి, గుడ్డివాళ్ళ కథను గుర్తుకు తెచ్చారు. పూరణ బాగుంది. అభినందనలు.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  పూరణ బాగుంది. అయితే రెండవపాదంలో యతి తప్పింది. దానిని ఇలా సవరిస్తే సరి ..
  "గుండె నిండగ నాశలు మెండు గాను"

  రవి గారూ,
  ఈసారి వచ్చిన పూరణలలో మీది ఉత్తమమైన పూరణగా ఎన్నిక చేసాను. అభినందనలతో పాటు ధన్యవాదాలు.

  సుమిత్ర గారూ,
  "మూకం కరోతి వాచాలం' గుర్తుకు తెచ్చారు. పూరణ బాగుంది. అభినందనలు.

  ఫణి ప్రసన్న కుమార్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. మంగపతిని దర్శించగ బెంగపడెను
  అంగవైకల్యమతనిని భంగపరచ
  మింటి దేవుడు దయజూప మిక్కుటముగ
  కుంటివాఁడెక్కె తిరుమల కొండ పైకి

  రిప్లయితొలగించండి
 11. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  01)
  _____________________________________

  కుక్క సింహాసనం బెక్కె - కుటిల నీతి !
  కుంటి వాడెక్కె తిరుపతి - కొండ పైకి !
  కుర్ర దానికి కడుపొచ్చి - కొడుకు గలిగె !
  కనుల జూడుడు, కలియుగ - కాల మహిమ !
  _____________________________________

  రిప్లయితొలగించండి