6, జులై 2010, మంగళవారం

సమస్యా పూరణం -31

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్యను రవి గారు పంపించారు. అది ఇది ....

వీథిని బడి తన్నుకొనిరి విరిబోణు లటన్.

27 కామెంట్‌లు:

  1. వీధి
    వీథి - ఈ రెంటిలో ఏది కరెక్టండి? అందం బ్లాగులో ది, ధి లకు ప్రాస కుదురుతుందని ఇప్పుడే చదివాను. అలానే ధి, థి లకు ప్రాస చెల్లించవచ్చా?

    రిప్లయితొలగించండి
  2. రవి గారి వ్యాఖ్య -
    వీధి
    వీథి - ఈ రెంటిలో ఏది కరెక్టండి? అందం బ్లాగులో ది, ధి లకు ప్రాస కుదురుతుందని ఇప్పుడే చదివాను. అలానే ధి, థి లకు ప్రాస చెల్లించవచ్చా?

    రిప్లయితొలగించండి
  3. వీథి కుళాయి కడ నిలిచి
    బాధల కోర్చియు మహిళలు పటువెడు నీటిన్
    సాధన చేయగ లేకయు
    వీథిని బడి తన్నుకొనిరి విరిబోణు లటన్.

    పటువ = చిన్ని కుండ

    రిప్లయితొలగించండి
  4. వీథి కుళాయి కడ నిలిచి
    బాధలు పడి వేచి వేచి పటువెడు నీటిన్
    సాధన చేయగ లేకయు
    వీథిని బడి తన్నుకొనిరి విరిబోణు లటన్.

    పటువ = చిన్న కుండ

    కండి శంకరయ్య గారు
    ఇంతకు ముందు కూడా వ్యాఖ్య ప్రచురించాను, కాని ఎందుకో రాలేదు, మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని రాస్తున్నాను. కామెంట్ మోడరేషన్ ఏమైనా ఎనేబుల్ చేసారా?

    రిప్లయితొలగించండి
  5. కందుక కేళిన్ పాల్గొని,
    అందరికానందమిడగ అతివలుయాడన్,
    మైదానము లేనందున
    వీథిని బడి తన్నుకొనిరి విరిబోణు లటన్.

    (కందుక కేళి = బంతి ఆట)

    రిప్లయితొలగించండి
  6. నేతలుగ మారి మగువలు
    బూతులు నేర్చిరి పలుకగ బుల్లి తెరలపై
    నీతిని మఱచి పదవికై
    వీథిని బడి తన్నుకొనిరి విరిబోణు లటన్!!

    "త" "థ" లకు ప్రాస చెల్లుతుందా?

    రిప్లయితొలగించండి
  7. మాధవుఁడు పల్లెఁ జేరగ
    రాధయు గోపికలు గూడి రాజిలు మోమున్
    ఆధారము వీడే యని
    వీధిని బడి తన్నుఁ గొనిరి విరిబోణులటన్.

    సమస్యాపూరణం వాఖ్యలు ఎప్పటిదప్పుడు ప్రచురిస్తేనే బావుంటుందండి.

    రిప్లయితొలగించండి
  8. చదువరి గారి పూరణలు -
    కేడీలూ గూండాలూ
    రౌడీలే పాలకులగు రాజ్య మిదయ్యెన్
    చూడండీ తోడేళ్ళను
    లేడండీ నీచుడింక లీడరు కంటెన్

    కేడీలూ గూండాలూ
    రౌడీలే పాలకులగు రాజ్య మిదయ్యెన్
    ఈడూ ఆడని చూడక
    ఏడిగ ఏటాడవలెను ఎన్‍కౌంటరులో

    రిప్లయితొలగించండి
  9. రవి గారి పూరణ -

    మాధవుఁడు పల్లెఁ జేరగ
    రాధయు గోపికలు గూడి రాజిలు మోమున్
    ఆధారము వీడే యని
    వీధిని బడి తన్నుఁ గొనిరి విరిబోణులటన్.

    సమస్యాపూరణం వాఖ్యలు ఎప్పటిదప్పుడు ప్రచురిస్తేనే బావుంటుందండి.

    రిప్లయితొలగించండి
  10. ఇద్దరు ఒకడిని వలచియు
    ఒద్దికగా నుండ గోరి ఒకరితొ నొకరున్
    ఇద్దరి నొద్దనగ ప్రియుడు
    వీధిన బడి తన్నుకొనిరి విరి బోణులటన్

    క్షమించాలి నాకు రాయాలన్న ఇష్టం తొ రాసానే గాని సరిగా రాదు పొరపాట్లు ఉన్న యెడల ప్రచురించ వలదని మనవి

    రిప్లయితొలగించండి
  11. గోదాలో ఫుటుబాలురు
    సూదంట్లై హత్తుకొనిరి సుదతుల. తామూ
    మోదమ్మున ఆడుదమని
    వీథినిబడి తన్నుకొనిరి విరిబోణులటన్

    రిప్లయితొలగించండి
  12. అందరికి వందనాలు.
    నిన్న నా బ్లాగులో కామెంట్స్ మాడరేషన్ పెట్టాను. నా మెయిల్ కు వచ్చిన వ్యాఖ్యలను బ్లాగులో ప్రచురించబోతే "ఎర్రర్" వచ్చింది. మాడరేషన్ తొలగించి నా మెయిల్ లోని వ్యాఖ్యలను కాపీ చేసి బ్లాగులో పేస్ట్ చేయబోతే బ్లాగులో వ్యాఖ్యలు కనిపించలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. ఆ తరువాత చూస్తే కొన్ని వ్యాఖ్యలు రిపీట్ అయ్యాయి. కొన్ని అసలే కనిపించ లేదు. అంతా గందరగోళ పరిస్థితి. దాంతో ఎవ్వరికీ సమాధానాలు ఇవ్వలేక పోయాను. తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేక ఇబ్బంది పడ్డాను. నన్ను క్షమించండి.

    రిప్లయితొలగించండి
  13. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    _____________________________________

    నాదీ చేదంచు నచట
    చేదుకొనగ నీరు, చిరుగు - చేద కొఱకునై
    వాదము పెరిగిన వేళను
    వీథిని బడి తన్నుకొనిరి - విరిబోణు లటన్ !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  14. వీథిని టాంకరు రాగా
    బాధలు పడి నీళ్ళ కొరకు భాగ్యపునగరిన్
    క్రోధముతో పట్టి జడలు
    వీథిని బడి తన్నుకొనిరి విరిబోణు లటన్

    రిప్లయితొలగించండి


  15. వీథిబడిని మాస్టారుగ
    యాథార్థ్యము తప్ప పలుకు యౌవను డచటన్
    పాథము రగిలింప మయిని
    వీథిని బడి తన్నుకొనిరి విరిబోణు లటన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి