17, జులై 2010, శనివారం
గళ్ళ నుడి కట్టు - 12
అడ్డం
1. రామారావు, నాగేశ్వర్రావు బావమరదులై తలపడిన పౌరాణిక చిత్రం (7)
6. శివుని శత్రువు మన్మథుడు - దరిద్రారుణంలో వెనుకనుండి చూడండి (3)
7. కుబేరుని పట్టణం. అక్కడ అలకలల్లలాడుతాయా? (3)
9. అతని విన్నపంలో తృప్తి (3)
10. లోకోక్తి. మనసా! మెతకదన మెందుకే? (3)
11. సిరికి ప్రకృతి (1)
12. చులకన. అది తెలుసు కదా! (3)
13. గుడి. దానికో వెల చెప్పగలమా? (3)
15. ప్రథమా విభక్తి ప్రత్యయాలలో మొదటి మూడు అట్నుంచి (3)
17. ఈ ఒడ్డు. ఇక్కడిద్దరికే చోటు. ప్రథమాక్షరం మధ్యకు చేరింది (3)
18. కవుల లోకానికి ఆశ్రయమైన లక్షణగ్రంథం. వేములవాడ భీమకవిదా? మల్లియ రేచనదా?
నిలువు
2. వెంట్రుక. "కృష్ణా! శలవు"లో ద్వితీయ, పంచమాలు వర్జ్యం (3)
3. స్వల్పమైన అస్వస్థత. కాంచన లతకా? (3)
4. వ్యతిరేకం. కాబట్టే తలక్రిందులయింది (3)
5. అయ్యప్ప. శివ కేశవుల పుత్రుడు (7)
7. "స్వారోచిష మను సంభవము" కావ్య కర్త (7)
8. కవిత్వం. కవి తన్మయుడై రాసేది (3)
12. ఉద్దెర. అవురా! ఇవ్వవా? (3)
13. వాంఛ. ఒకరికో, ఇద్దరికో? (3)
14. పద్మం. జలంలో పుట్టి అలల తాకిడికి అస్తవ్యస్తమయింది (3)
16. జతనమునకు ప్రకృతి. కిందినుండి (3)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అడ్డం
రిప్లయితొలగించండి1.శ్రీ కృష్ణార్జున యుద్ధం 6.రుద్రారి 7.అలక 9.వినతి 10.సామెత 11.శ్రీ 12.అలుసు 13.కోవెల 15. వుముడు 17.ద్ద ఇరి 18.కవిజనాశ్రయము
నిలువు
1.కృశల 3.నలత 4.మురుతి 5.హరిహరసుతుడు 7.అల్లసానిపెద్దన 8.కవిత 12.అరువు 13.కోరిక 14. కలమం 16.ముత్నయ
ప్రసీద గారూ,
రిప్లయితొలగించండిఅడ్డం 9, నిలువు 4,14 మరోసారి చూడండి
అడ్డము:
రిప్లయితొలగించండి1) శ్రీకృష్ణార్జునయుద్ధము,6)రుద్రారి,7)అలక,9)తనివి,10)సామెత,11)శ్రీ,12)అలుసు,13)కోవెల,15)వుముడు,(డుమువు),17)ద్దఅరి(అద్దరి),18)కనకమల్లియము.
నిలువు:
2)కృశ్నము,3)నలత,4)విరుద్ధం,5)హరిహరసుతుడు,7)అలసానిపెద్దన,8)కవిత,12)అరువు,13)కోరిక,14)లమక(కమల),16)యత్నము..
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిఅడ్డం 17,18 - నిలువు 1,14 మరోసారి ప్రయత్నించండి.
సారీ సర్.. ఇప్పుడు చెప్పండి
రిప్లయితొలగించండిఅడ్డం 9: తనివి
నిలువు 4: మురువి 14.లజజం
ప్రసీద గారూ,
రిప్లయితొలగించండినిలువు 4 తప్పు మిగిలినవన్నీ కరెక్టే.
అడ్డం: 1. శ్రీకృష్ణార్జున యుద్ధం,6.రుద్రారి, 7.అలక, 9. తనివి, 10.సామెత, 11.శ్రీ, 12.అలుసు, 13.కోవెల, 15.వుముడు,17.ద్ద ఇ రి, 18.కవిజనాశ్రయం
రిప్లయితొలగించండినిలువు: 2.కృశల, 3.నలత, 4.ద్ధంరువి,5.హరిహరసుతుడు, 7.అల్లసాని పెద్దన, 8.కవిత, 12.అరువు, 13.కోరిక,14.లజజ, 16.ముత్నయ
మురళి మోహన్ గారూ,
రిప్లయితొలగించండినూటికి నూరు పాళ్ళు కరెక్ట్! అభినందనలతో పాటు ధన్యవాదాలు.
ఈ రోజు ఎందుకో చాలా తక్కువమంది ప్రయత్నించారు.
ప్రసీద గారూ,
రిప్లయితొలగించండిభమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
గళ్ళ నిడి కట్టు పూరణలో దాదాపుగా కృతకృత్యులయ్యారు. అభినందనలు. సరైన సమాధానాల కోసం శ్రీ కోడీహళ్ళి మురళీ మోహన్ గారి సమాధానాలను చూడండి.
కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
ధన్యవాదాలు.