31, జులై 2010, శనివారం

సమస్యా పూరణం -52

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
ఫలితమ్మును జూచి నేత వలవల వగచెన్.

11 కామెంట్‌లు:

  1. పలు పలు ధనములు పంచెను.
    కలిసిన ప్రతి వాని నడిగె ఘనమగు ఓటున్
    తెలిసెను తీర్పు.తనకు దుష్
    ఫలితమ్మును జూచి నేత వలవల వగచెన్.

    రిప్లయితొలగించండి
  2. కలయౌ పదవిని పొందగ
    తలపడె తా నెన్నికలల తహతహ మనుచున్
    తొలిమె ట్టెక్కే వేళన
    ఫలితమ్మును జూచి నేత వలవల వగచెన్.

    రిప్లయితొలగించండి
  3. డి.శ్రీనివాస్ పరిస్థితి

    కల చెదిరెను, కధ ముగిసెను
    బలవంతపు ఎన్నికలల బలిపశువాయెన్
    తలవంపులు తెచ్చెడి దుష్
    ఫలితమ్మును జూచి నేత వలవల వగచెన్

    రిప్లయితొలగించండి
  4. వలువను నేయుట కొరకై
    నెలరోజులు శ్రమపడెనొక నేతన్న భలా!
    తలచిన రొక్కము దొరకక
    ఫలితమ్మును జూచి నేత వలవల వగచెన్.

    రిప్లయితొలగించండి
  5. వలువను నేయగ 'కంచి'న
    నెలరోజులు శ్రమపడెనొక నేతన్న భలా!
    తలచిన రొక్కము దొరకక
    ఫలితమ్మును జూచి నేత వలవల వగచెన్.

    రిప్లయితొలగించండి
  6. బలమైన కోర్కె జనమున
    నెలవైన గురుతు దెలియక నిలిచెను తెదెపా
    కలగా మారగ భవితము
    ఫలితమ్మును జూచి నేత వలవల వగచెన్

    రిప్లయితొలగించండి
  7. పలువిధ సమీకరణముల
    కలగలుపుచు పొత్తులంది కలబడె నొకడున్
    కలలవి కల్లలు కాగా
    ఫలితమ్మును జూచి నేత వలవల వగచెన్.

    రిప్లయితొలగించండి
  8. వలువను పట్టున నేయగ
    నెల రోజులు శ్రమ చేసెడి నేతన్నలకున్
    తలచిన రొక్కము దొరకక
    ఫలితమ్మును జూచి నేత వలవల వగచెన్

    రిప్లయితొలగించండి
  9. చింతా రామకృష్ణారావు గారూ,
    నా శ్రమకు సత్ఫలితమే దొరుకుతున్నది. మీ పూరణలు నా బ్లాగుకు వన్నె తెస్తున్నాయి. ధన్యవాదాలు.

    చదువరి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.

    నచికేత్ గారూ,
    డియెస్ పైన, మీకు మీరే మూడు సార్లు సవరించుకున్న నేతన్న పద్యం బాగున్నాయి. అభినందనలు.

    హరి దోర్నాల గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రవి గారూ,
    అద్భుతమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. నా పూరణ -
    తెలఁగాణ సెంటిమెంటు ప్ర
    జలలో గాఢముగఁ గల విషయము దెలిసియున్
    నిలబడె నెన్నికలో తుది
    ఫలితమ్మును జూచి నేత వలవల వగచెన్.

    రిప్లయితొలగించండి
  11. కులముల మతముల గూర్చుచు
    కలుపుచు భాగించి హెచ్చి కంప్యూటరునన్
    సలుపగ రణమును కడపను
    ఫలితమ్మును జూచి నేత వలవల వగచెన్

    రిప్లయితొలగించండి