ఆర్యా! కవులు అందరూ చాలా బాగా పూరించారు మీరిచ్చిన సమస్యని. అభినందనలు. ముఖ్యంగా ఊకదంపుడుగారు " జీవితంలో షడ్రుచులూ అనుభవించక తప్పదు మానవుడు అని బోధిస్తున్నట్టు " కంద షట్కము వ్రాసి ఆనందం కలిగించారు. వారికి ధన్యవాదాలు.
శంకరయ్య గారూ, మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి, పూర్తిగా కోలుకున్న తరువాత, తీరిగ్గా చర్చించవచ్చు. ఇలా ఓపికగా ప్రతిరోజూ సమస్యనివ్వడమే మాకు చేస్తున్న పెద్ద సహాయం. మాకు మీ పట్ల ఎప్పుడూ మన్ననే.
రాజేశ్వరి గారూ, చాలా తొందరగ ఛందం నేర్చేసుకుంటున్నారు, సంతోషమండీ. పద్యం హాయిగా సాగింది. మొదటి పాదంలో ప్రాసాక్షరం ముందు,లఘువుంటే మిగతా పాదాలలోనూ లఘువే ఉండలనీ, గురువు ఉంటే మిగతా పాదాలలోనూ గురువే ఉండాలని అనుకుంటాను.
జ్ఞానాంభుధి; సద్గుణ మణి;
రిప్లయితొలగించండిప్రాణంబుగ పరులఁ జూచు భవ్యుండయ్యున్
తానొక సౌమ్యుండు. దురభి
మానమ్మే లేనివాఁడు. మాన్యుండయ్యెన్.
ఏనీటి పేర దోచెనొ
రిప్లయితొలగించండిఆనీరే తన వినాశ మందించ నహో
కానీ మాత్రము యే అభి
మానమ్మే లేనివాడు మాన్యుండయ్యెన్
ప్రాణ జ్యోతిగ దైవము
రిప్లయితొలగించండిలోన వెలిగి, ఆవరించె లోకములెల్లన్
కానంగ లేడనెడి అను
మానమ్మే లేనివాఁడు మాన్యుండయ్యెన్!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజ్ఞానము కలిగిన నెపుడును
రిప్లయితొలగించండిమౌనము దాల్చెడు ప్రధాని మన్మోహనుడే
గానీ! ఫలమేటికి? అభి
మానమ్మే లేనివాఁడు మాన్యుండయ్యెన్.
జ్ఞానము కలిగిన నెపుడును
రిప్లయితొలగించండిమౌనము దాల్చెడు ప్రధాని మన్మోహనుడే
గానీ! ఫలమేటికి? అభి
మానమ్మే లేనివాఁడు మాన్యుండయ్యెన్.
మానధనుండు సుయోధను
రిప్లయితొలగించండిడైన, దురభిమాన రహితుడా ధర్మజుడే!
మానధనుని కన్న దురభి
మానమ్మే లేనివాడు మాన్యుండయ్యెన్!
అయ్యా, అంతేగా మరి.
రిప్లయితొలగించండిమైనున్నయరుల గెలవడు
ఐనా గెలిచెను అమెరికా అధ్యక్షుడిగా
మోనీకా! ఏమందును?
మానమ్మే లేనివాడు మాన్యుండయ్యన్. (1)
మైనున్నమరుని గెలవడు
ఐనా గెల్చునట గోల్ఫు ఆటల నన్నీ
హీనంబీనాటి జగతి,
మానమ్మే లేనివాడు మాన్యుండయ్యన్. (2)
తానే వాంఛల గెలువడు
ఐనా ప్రజగొరకు స్వామి అవతారమ్మున్
బూనియె చాటున సుఖపడు
మానమ్మే లేనివాడు మాన్యుండయ్యన్ (3)
రాణిన్ జేసెను భార్యను
దాణాలెక్కలకుజమగ దనపదవియెబోన్
ఐనా, గెల్చొచ్చిమరల-
మానమ్మే లేనివాడు మాన్యుండయ్యన్ (4)
వీనికి వావీ వరుసలు
లేనేలేవు గురుగృహపు లేమన్ గూడెన్,
కానీ మింటను నిల్చుట
మానమ్మే లేనివాడు మాన్యుండయ్యన్. (5)
నానా అచ్చర లుండగ
క్షోణీతలమునకుయొక కోడై వచ్చీ
హీనపు శాపము బొందిన
మానమ్మే లేనివాడు మాన్యుండయ్యన్. (6)
తానై వలచిన వనితను
రిప్లయితొలగించండియేనాటికి నిరసించక యేమరుపాటున్
మనసున మనసై దురభి
మానమ్మే లేనివాడు మాన్యుండయ్యెన్ !
ఆర్యా! కవులు అందరూ చాలా బాగా పూరించారు మీరిచ్చిన సమస్యని. అభినందనలు. ముఖ్యంగా ఊకదంపుడుగారు " జీవితంలో షడ్రుచులూ అనుభవించక తప్పదు మానవుడు అని బోధిస్తున్నట్టు " కంద షట్కము వ్రాసి ఆనందం కలిగించారు. వారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపూరణ లందించిన
రిప్లయితొలగించండిచింతా రామకృష్ణారావు గారికి,
హరి దోర్నాల గారికి,
జిగురు సత్యనారాయణ గారికి,
రవి గారికి,
డా. ఆచార్య ఫణీంద్ర గారికి,
(కంద షట్కాన్నిచ్చిన) ఊకదంపుడు గారికి,
నేదునూరి రాజేశ్వరి గారికి
అందరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు.
ఇంకా జ్వరంనుండి పూర్తిగ కోలుకోనందున విడివిడిగా వ్యాఖ్యానించలేక పోతున్నాను. మన్నించండి.
శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీరు కాస్త విశ్రాంతి తీసుకోండి, పూర్తిగా కోలుకున్న తరువాత, తీరిగ్గా చర్చించవచ్చు.
ఇలా ఓపికగా ప్రతిరోజూ సమస్యనివ్వడమే మాకు చేస్తున్న పెద్ద సహాయం.
మాకు మీ పట్ల ఎప్పుడూ మన్ననే.
రాజేశ్వరి గారూ,
చాలా తొందరగ ఛందం నేర్చేసుకుంటున్నారు, సంతోషమండీ. పద్యం హాయిగా సాగింది.
మొదటి పాదంలో ప్రాసాక్షరం ముందు,లఘువుంటే మిగతా పాదాలలోనూ లఘువే ఉండలనీ, గురువు ఉంటే మిగతా పాదాలలోనూ గురువే ఉండాలని అనుకుంటాను.
రామకృష్ణారావు గురువు గారూ,
ధన్యవాదాలు.
తానై వలచిన వనితను
రిప్లయితొలగించండియేనాటికి విడువ కుండ యేమరుక సదా
మానంబును కాచు ; దురభి
మానమ్మే లేని వాడు మాన్యుండయ్యెన్
తమ్ముడు సవరణ చేసినది " అందరి అభిమానం ఇంతగా నేర్పు తుంటే అంతకంటె అదృష్టం మరేముంది ? dhanya vaadamulu
ఆత్మీయ మిత్రులు శంకరయ్య గారు!
రిప్లయితొలగించండికర మాత్మీయముగ తమరు
త్వరితమె స్పందించకున్న, తలచితి నేదో
పరకార్యమగ్నులనుకొని -
జ్వరమని తెలియంగ గుండె జారెను వ్యధతో!
మీరు వెంటనే కోలుకోవాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను.
జ్వర పీడితులై యుండియు
రిప్లయితొలగించండిమరుపెరుగక మాకు తగు సమస్యల నిడుచున్
నిరతము సేవలు జేసిన
గురువర్యా శంకరయ్య కోలుకొనుమయా
స్నానము చేయగ సరసన
రిప్లయితొలగించండికోనేటిని దూకి యాడ గోపికలటనున్
పూనుచు చీరలు దోచుచు
మానమ్మే లేనివాఁడు మాన్యుండయ్యెన్.