20, జులై 2010, మంగళవారం

గళ్ళ నుడి కట్టు - 15

అడ్డం
1. విభీషణుడి భార్య - ఆమె అవసరమట! (3)
4. రాత్రికి వ్యతిరేకం. కార్పణ్యాలు (3)
6. విశ్వనాథ వారి నాటకం. నాట్యమందిరం - సినిమాగా వచ్చింది (5)
7. ఋషులు చేసేది. తుస్సుమంటుందా? (3)
9. పద్మ - లక్ష్మి - ఒక ఫలం (3)
11. రోజా - దీనికి గులామువా బీబి? (3)
13. శిశువు - పాలు పట్టు (2)
14. రయం - తప్పవే గండాలు (2)
15. ఒక నాటక భేదము - డిండిమములో ఉంది (3)
16. స్త్రీలు పేరు పేరంటా పిలిచి చేసుకొనే వాయనాల సంబరం (3)
18. కోతి - తరం నరునివా? (3)
20. పద్మ బాంధవుడు - సూర్యుడు - నీట బాసిన కమలములు ఇతని రశ్మి సోకి కమిలిపోతాయి (5)
22. నిజము - అసలే త్యజింతుము (3)
23. అరటి చెట్టు - కదన కేళిలో (3)
నిలువు
1. సమానత్వం - అంటే సతమత మౌతావేం? (3)
2. త్రికరణాలలో మొదటిది - ఉస్సురంటుందా? (3)
3. అడవి - మనకోసమా? (2)
4. పిల్లలు అక్షరాలను దిద్దే ఫలకం - కలపతో చేస్తారా? (3)
5. తిరగబడ్డ తీగలు - కలతలు వద్దు (3)
8. ఇతరులకు మేలు - ఇది చేసే పాపన్న ప్రసిద్ధుడు (5)
10. నిలువు 2 తో బాధ - తమరి నోట వేరే వాదన (5)
11. కూష్మాండం - ఇంటి పేరుతో ప్రసిద్ధుడీ నటుడు (3)
12. తిరిపెము - పిల్లికి కూడ పెట్టడా? (3)
16. గొప్ప ఆశ. పేదరాశి ముసలమ్మకు తెలుసా? (3)
17. నాణెము - ఆటంకమున్నదా? (3)
18. అలవాటు - వాడు కడు వ్యసనపరుడు (3)
19. విలాస జీవనం గడిపే ............ రాజా ఏయెన్నార్ (3)
21. విలాసంగా చేసే నాట్యం - బాలా! స్యందన మెక్కు! (2)

4 కామెంట్‌లు:

  1. అడ్డం: 1.సరమ, 4.పగలు, 6.నర్తనశాల,7.తపస్సు, 9.కమల,11.గులాబీ, 13.పాప, 14.వేగం, 15.డిమము,16.పేరంటాం,18.వానరం, 20.కమలాప్తుడు, 22.సత్యము,23.కదళి

    నిలువు: 1.సమత, 2.తమస్సు, 3.కోన, 4.పలక,5.లుతల, 8.పరోపకారి, 10.తమవేదన(?), 11.గుమ్మడి,12.బిచ్చము, 16.పేరాస,17.టంకము, 18.వాడుక, 19.రంగేళి,21.లాస్యం

    రిప్లయితొలగించండి
  2. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
    నిలువు 2,8,10 మరోసారి చూడండి.

    రిప్లయితొలగించండి
  3. నిలువు 2. మనస్సు, 8.పరోపకారం, 10.మనోవేదన

    రిప్లయితొలగించండి
  4. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    ఇప్పుడు 100% సరిపోయాయి. అభినందనలు.
    విచిత్రం! ఈ రోజు మీరొక్కరే గడిని పూరించారు. రోజూ క్రమం తప్పకుండా పూరించే మిత్రులు ఈ సారి ఎందుకో ముఖం చాటేశారు.

    రిప్లయితొలగించండి