5, జులై 2010, సోమవారం

గళ్ళ నుడి కట్టు - 1


గళ్ళ నుడి కట్టు
తెలుగు భాషాభిమానులకు, కవి మిత్రులకు నమస్సుమాంజలి. ఇన్ని రోజులుగా నా బ్లాగును వీక్షిస్తూ. సమస్యలనుపూరిస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న అందరికి ధన్యవాదాలు. నా బ్లాగులో మరిన్ని అంశాలను చేర్చాలని ఆలోచిస్తున్నతరుణంలోక్రాస్ వర్డ్ పజిల్ ప్రవేశపెట్టమని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. అందుకే ఈ ప్రయత్నం.
ఈ "గళ్ళ నుడి కట్టు" సమాధానలను వ్యాఖ్య రూపంలో పంపిస్తే సరి. ఎంత కాలంలో దీనికి సమాధానాలు వస్తాయోచూసి దీనిని రోజు కొక్కటి పెట్టాలా, లేక ఎన్ని రోజుల వ్యవధిలో పెట్టాలో నిర్ణయిస్తాను. మీ అందరి సలహాలను,సహకారాన్నికోరుతున్నాను.

గళ్ళ నుడి కట్టు - 1

అడ్డం
1. జ్ఞానజ్యోతిని వెదజల్లే బ్లాగు గురువు గారి ఇంటిపేరు (4)
3.
ఇంగ్లీషు కోతికి మధ్య, చివర దానిని కలిపితే గంగ (4)
7. "
శిరా కదంబం" బ్లాగులో సినిమా విశేషాల కుప్ప. తిరగేసి చూడండి (2)
8.
వాడికి పది లంఖనాలైనా అందులోనే క్షేమం ఉంది (3)
9.
అందమైన పచ్చి పులుసు (2)
12.
ఇదెత్తుకొచ్చిందట కన్నెపిల్ల - అక్కినేని పాటలో (3)
13.
శ్వేతం - చెప్పు (3)
17.
ఉదయంలో కారుణ్యం (2)
18.
ఇది ఉన్న రోజుల్లో నేరములు కానరావన్నాడు బద్దెన (3)
19.
దీన్ని చూడగనే సరస్వతి, నారదుడు, చిట్టిబాబు గుర్తుకొస్తారు (2)
22.
.. .. .. అంటూ తన పేరు చెప్పింది బొమ్మరిల్లు పాప. దానికి
మంచితనాన్ని చేరిస్తే ఒక నటి పేరయింది (4)
23.
తమిళశ్రీతో భర్త. ఒక పుణ్యక్షేత్రం (4)

నిలువు
1. నెట్ పట్టిన రాజా మన్మథుడు? (4)
2.
హిందీలో చెప్పవయ్యా (2)
4.
దాదాపుగా దగ్గర (2)
5.
పొడవైన నిశ్వాస. ఇంకా పొడవయింది. హూఁ .... (4)
6.
అన్న పెండ్లాము (3)
10.
ఇది వచ్చిందే పిల్లా అని పాడాడు అక్కినేని (3)
11. 13
అడ్డానికి వ్యతిరేకం (3)
14.
రామదాసు అడ్డదిడ్డంగా పాడితే ఆరవస్వరం హ్రస్వమైంది. చెన్నై (4)
15.
నది. మరో చరిత్ర నాయిక (3)
16.
చిలకమర్తి వారి ప్రసిద్ధ నవల (4)
20.
సదా సిరికి దూరం. స్వేచ్ఛ లేని పనిమనిషి (2)
21.
నేములో నేముందట

16 కామెంట్‌లు:

 1. అడ్డము---
  1. వల్లభోజు
  3. మందాకిని
  7. రాశి
  8. పదిలం
  11. (క్లూ యివ్వలేదు)
  12. కడవ
  13. తెలుపు
  17. దయ
  18....
  19. వీణ
  22. సుహాసిని
  23. తిరుపతి
  నిలువు---
  1....
  2. భోలో
  4. దాపు
  5. నిశ్వాసము
  6. వదిన
  9. (క్లూ యివ్వలేదు)
  10. పడవ
  11. నలుపు
  14. మదరాసు
  15. సరిత
  16. గణపతి
  20. దాసి
  21. పేరు

  రిప్లయితొలగించండి
 2. అడ్డం
  1. వలబోజు
  3. మందాకిని
  7. రాశి
  8. పదిలం
  9.
  12. కడవ
  13. తెలుపు
  17. దయ
  19. వీణ
  22. సుహాసిని
  23. తిరుపతి
  నిలువు
  1. వలరాజు
  2. బోలో
  4. దాపు
  5. నిశ్వాసము
  6. వదిన
  10. పడవా
  11. నలుపు
  14. మదరాసు
  15. సరిత
  16. గణపతి
  20. దాసి
  21. పేరు  సుభద్ర వేదుల

  రిప్లయితొలగించండి
 3. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
  "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. ఇంత తొందరగా గడి దాదాపుగా పూర్తి చేసినందుకు అభినందనలు. నేనిచ్చిన ఆధారాలు మరీ సులభంగా ఉన్నాయా? ఇక 11 అడ్డం కాదు, నిలువు. 9 నిలువు కాదు, అడ్డం. ఒకసారి గమనించండి.

  రిప్లయితొలగించండి
 4. ప్రసీద గారూ,
  "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీరు ఇచ్చిన సమాధానాలన్నీ సరియైనవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. శంకరయ్య గారు,
  ఒక మనవి, ఇలాంటి టపాలకు వ్యాఖ్యలు మీకు తప్ప ఇతరులకు కనబడకుండా చేయండి - నిర్ణీత సమయము తరువాత వ్యాఖ్యలు అందఱికీ చూపించండి. పద్యా పూరణలలో ఒకరు వ్రాసింది చదివినా ఫరవాలేదు కానీ, గడులకి, ప్రహేళికలకి అలా కుదరదు..

  రిప్లయితొలగించండి
 6. మేస్టారూ
  నిజంగా తొందరగానే వ్రాసేసానండి. లేకుంటే మా వారికి ఫలహారం చేసి పెట్టి, పూజ చేసికొని వచ్చేసరికి దాదాపు అంతా పూర్తి చేసేస్తూన్నారు మరి. గిరి గారు చెప్పినట్లుగా చేయండి.

  రిప్లయితొలగించండి
 7. గిరి గారూ,
  నిజమే. మీ సలహాకు ధన్యవాదాలు. కాని వ్యాఖ్యలు నేను చూసిన తర్వాతే ప్రచురణ కావాలంటే ఏం చేయాలో నాకు తెలియదు. జ్యోతి గారిని అడుగుతాను.

  రిప్లయితొలగించండి
 8. శంకరయ్యగారు వివరాలు మెయిల్ చేసా చూడండి..

  రిప్లయితొలగించండి
 9. శంకరయ్య గారు,
  బ్లాగర్లలో ప్రవాస భారతీయులం చాలా మందే ఉన్నాము. మీరు కామెంట్ మోడరేషన్ కనుక ఎనేబుల్ చేసినట్టయితే సమాధానాలు మరునాటి ఉదయం ప్రచురించవలసిందిగా మనవి. అలా అయితే అందరికి స్పందించటానికి తగిన సమయం దొరుకుతుంది.

  రిప్లయితొలగించండి
 10. సాయి ప్రవీణ్ గారూ,
  ధన్యవాదాలు. అలాగే.

  రిప్లయితొలగించండి
 11. సాయి ప్రవీణ్ గారూ,
  మీరు చెప్పినట్లే కామెంట్ మాడరేషన్ ఎనేబుల్ చేశాను.

  రిప్లయితొలగించండి
 12. master garu,many many thanks andi,telugu bhashaseva chesthunna meeku aa bhagavanthudu ayurarogyalu prasadimchalani koruthunnanu.twaralo maache prarambhimchabade monthly magazine lo mee perutho induloni vishayalanu prachurimchemduku anumanistaara? please.

  రిప్లయితొలగించండి
 13. అజ్ఞాత గారూ,
  ధన్యవాదాలు.
  నా బ్లాగులో ప్రచురించే ఏ అంశాన్నైనా నిరభ్యంతరంగా ఏ విధంగానైనా మీరు ఉపయోగించుకోవచ్చు. అందుకు నేను సంతోషంగా అనుమతిస్తున్నాను. కాకుంటే "ఫలానా అంశాన్ని ఫలానా సంచికలో ప్రచురించాం" అని తెలియజేసి ఆ పత్రిక ప్రతిని ఒకదానిని నాకు పంపిస్తే ఆనందిస్తాను. సాహితీ సేవలో మీకు ఏవిధమైన సహకారం కావాలన్నా అందిస్తాను.

  రిప్లయితొలగించండి