30, జులై 2010, శుక్రవారం

దత్త పది - 7

కవి మిత్రులారా,
క్రింది పదాలను ఉపయోగించి "నగర జీవనం" విషయంగా మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.
కరి, విరి, హరి, సిరి.
వారాంతపు సమస్యా పూరణానికి ఈ రోజు చివరి రోజు. గమనించండి.
వారాంతపు సమస్యా పూరణం - 2
అమవస నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే.

15 కామెంట్‌లు:

  1. కంద గీత గర్భ చంపక మాల:-
    కరి వరదుండవే!మములఁ గావ రమా ప్రియ! మాయ యేల? భా
    వి రిపువుగా నిటన్! కలుష భీకర జృంభణఁ గాంచ వేల రా?
    హరి! కరుణింపుమా! కలుష హారి! రహించెడి కాలుషంబు వ్రే
    సి, రిపు వధా! సదా గొలుపు క్షేమము.దుస్థితిఁ గూలఁ గొట్టుమా!

    కరి వరదుండవే!మములఁ గా
    వ రమా ప్రియ! మాయ యేల? భావి రిపువుగా?
    కరుణింపుమా! కలుష హా
    రి! రహించెడి కాలుషంబు; వ్రేసి, రిపు వధా!

    మములఁ గావ రమా ప్రియ! మాయ యేల?
    కలుష భీకర జృంభణఁ గాంచ వేల ?
    కలుష హారి! రహించెడి కాలుషంబు!
    గొలుపు క్షేమము.దుస్థితిఁ గూలఁ గొట్టు!

    రిప్లయితొలగించండి
  2. చింతా రామకృష్ణారావు గారూ,
    మీ ప్రతిభకు, పద్య రచనా నైపుణ్యానికి జోహారులు. దత్తపదిని గర్భకవిత్వంతో పూరించడం నాకు తెలిసినంత వరకు సాహిత్య చరిత్రలో ఇదే ప్రథమం. ధన్యవాదాలు.
    గర్భ కందంలో మొదటి పాదంలో ప్రారంభంలో "కరి" శబ్దం పొరపాటున అదనంగా టైప్ అయింది.

    రిప్లయితొలగించండి
  3. కం||
    కురవవె ముసిరిన మబ్బులు,
    కరువయె తొలకరి చినుకుల కమ్మని పల్కుల్
    విరియవె మురిసిన పువ్వులు,
    మెరియదె సుజల హరివిల్లు మేఘశ్యామా!

    రిప్లయితొలగించండి
  4. కంద గీత గర్భ చంపక మాల:-

    కరి వరదా! హరీ! కరివిగా! కర మీయఁగ కాచుటందు.కా
    విరి పెరిగెన్ గదా!, విరిసె వెల్లువగా ఖిల. పెచ్చు రేగె! దే
    వర! కరుణింపవా! హరివి, భాస్కర! వ్రేల్చుమనంత దీని.కా
    సిరి జనులున్ ప్రభూ! విసిరి చీదఱగించకు వేడు మమ్ములన్.

    వరదా! హరీ! కరివిగా!
    కర మీయఁగ కాచుటందు.కావిరి పెరిగెన్
    కరుణింపవా! హరివి, భా
    స్కర! వ్రేల్చుమనంత దీని.కాసిరి జనులున్!


    కరివిగా! కర మీయఁగ కాచుటందు.
    విరిసె వెల్లువగా ఖిల. పెచ్చు రేగె!
    హరివి, భాస్కర! వ్రేల్చుమనంత దీని.
    విసిరి చీదఱగించకు వేడు మమ్ము.

    భావము
    ఓ కరివరదుఁడా! ఓ శ్రీ హరీ! కాపాడడం విషయంలో ఆపన్నులకు హస్తము నందించుటలో సాక్షీభూతమైనవాఁడివి కదా! నలుపు ( క్రుళ్ళు )పెరిగిపోయింది కదా! ఈ కల్మషము వెల్లువవోలె విరిసింది కదా! మించి అధిగమిస్తోంది. ఓ పరమాత్మా! కరుణింపవా! నీవు హరివి. అనంతమైన ఓ భాస్కరుఁడా! ఈ క్రుళ్ళును నశింపఁ జేయుము. అందుకొఱకై జనులు కాచుకొని యుండిరి.ఓ ప్రభూ! ఈ విధముగా వేడెడి మమ్ములను త్రోసివేసి; చీదఱించుకోవలదు సుమా!

    రిప్లయితొలగించండి
  5. వరదుండవే!మములఁ గా
    వ రమా ప్రియ! మాయ యేల? భావి రిపువుగా?
    కరుణింపుమా! కలుష హా
    రి! రహించెడి కాలుషంబు; వ్రేసి, రిపు వధా!

    రిప్లయితొలగించండి
  6. తొలకరి జల్లులు కురిసెను
    కలనిజమైనటు తలపులు విరిసెను మదిలో
    కలగాదిక హరితవనము
    తలచిన సిరిదొరుకు రోజు తాదరి జేరెన్

    రిప్లయితొలగించండి
  7. అసంఖ్య (సోమశేఖర్) గారూ,
    చమ్మని పూరణ నిచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. హరికైనను సిరికైనను
    హరి బ్రోచిన కరికియైన హరునకునైనన్
    నరకమ్మీ ట్రాఫిక్కే
    సురవిరియూ వాడిపోవు చొరబడినంతన్

    రిప్లయితొలగించండి
  9. హరి దోర్నాల గారూ,
    మీ పద్యం నిజంగానే తొలకరి జల్లు వలె అలరించింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. చింతా రామకృష్ణారావు గారూ,
    అద్భుతం సార్! అసామాన్యం మీ ప్రతిభ.

    రిప్లయితొలగించండి
  11. చదువరి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. శంకరయ్య గారూ ! సరస్వతీ పుత్రులు చింతా వారు [ మా తమ్ముడు చిరంజీవి రామ కృష్ణ ] ఈ బ్లాగులొ అదుగిడటం చాలా గర్వం గా ఆనందంగా ఉంది.అందరికి ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  14. నా పూరణ -
    ఒకరి విషయముల్ దెలియ వింకొకరి కిచట
    నెంత తివిరిన లేదు ప్రశాంతత యిట
    ప్రహరి గోడలఁ గనిపించు వ్రాత లెన్నొ
    కసిరికొన నొప్పు పాడు నగరఁపు బ్రతుకు.

    రిప్లయితొలగించండి
  15. సిరిగల మనుజుఁడె మనుజుఁడు
    హరియు కరివరదుఁడయినను యహితులు కనఁగా.
    విరివిగ ధనమును గడనుచు
    బరువుగ వగచును. నగరపు బ్రతుకన నిదియే.

    రిప్లయితొలగించండి