25, జులై 2010, ఆదివారం

సమస్యా పూరణం - 47

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
(దాదాపు 40 సంవత్సరాల క్రితం "ఆకాశవాణి" వారిచ్చింది)
కలు సేవింపుఁడని పలికి గణ్యుండయ్యెన్.

13 కామెంట్‌లు:

 1. విలువలు వీడిన సీయము
  వెల కట్టెను జన హితమును; బీరూ విస్కీ,
  కలిగిన వైట్ డైమండ్ వో
  డ్కలు సేవింపుఁడని పలికి గణ్యుండయ్యెన్.

  రిప్లయితొలగించండి
 2. హరి దోర్నాల గారూ,
  మంచి పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. ఇలుజేరకానివేళను
  పలువురు అతిధులు ప్రియములు పలికీ విందున్
  పలురుచులని డాకులువ
  క్కలు సేవింపుఁడని పలికి గణ్యుండయ్యెన్.

  రిప్లయితొలగించండి
 4. పలువురు మెచ్చెడి స్కీములు
  ఎలుకలలా బొక్కసమును ఊడ్చేయంగన్
  పిలిచితి సారాక్షసి పా
  కలు సేవింపుఁడని పలికి గణ్యుండయ్యెన్

  రిప్లయితొలగించండి
 5. కలుష విదూరుని రాముని
  కలిసిన హనుమంతుఁ డతని ఘనతను గాంచెన్
  సులలితు రాముని కపి మూ
  కలు సేవింపుఁడని పలికి గణ్యుండయ్యెన్.

  రిప్లయితొలగించండి
 6. పలువురు మెచ్చెడి పధకము
  లెలుకలలా బొక్కసమును లూటీ చేసెన్
  పిలిచితి సారాక్షసి, రూ
  కలు సేవింపుఁడని పలికి గణ్యుండయ్యె

  రిప్లయితొలగించండి
 7. చింతా రామకృష్ణారావు గారూ,
  అజ్ఞాత గారూ,
  నచికేత్ గారూ,
  అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 8. ఎలమి మన మంత్రి రోశయ -
  "ఎలరుగ పదవులు కలుగగ ఇటలీ మాతన్
  యలుపెరుగక నిల తలమునుఁ
  కలు సేవింపుఁడ"ని పలికి గణ్యుండయ్యెన్.

  రిప్లయితొలగించండి
 9. జలపానము బహుమేలని
  పలురీతుల ప్రజలు మెచ్చ పలికెడి రాజే
  తొలిగా ఉదయమ్మున మొల
  కలు సేవింపుఁడని పలికి గణ్యుండయ్యెన్.

  రిప్లయితొలగించండి
 10. ఇలలో సన్మానవతకు
  విలువలనే పెంచి జాతిపిత గాంధీజీ
  కలు మానియు దళితుల పా
  కలు సేవింపుఁడని పలికి గణ్యుం డయ్యెన్.

  రిప్లయితొలగించండి
 11. కలు షాపు లెన్నొ తెరవగ
  పలు తెరగుల బీరు బ్రాండి పన్నుల నిడగా
  తెలగాణను దివి జేతును
  కలు సేవింపుఁడని పలికి గణ్యుండయ్యెన్

  రిప్లయితొలగించండి