సాధారణ మానవునిగ నాదైవ మెదురుగ వచ్చి; నన్నే గనుచున్ మోదంబు చూపుచును; నా రాధా! యిటు రమ్మటంచు రాముఁడు పిలిచెన్. భావము:- ఓ నా రాధా! నా దైవమైన రాముఁడు సాధారణ మానవుని వలె నాకు ఎదురుగ వచ్చి; ప్రేమ పూర్వకముగా నన్నే చూచుచు " ఇలారా!" అంటూ నన్ను పిలిచెను.
"రక్త సంబంధం" సినిమాలో చెల్లెలైన రాధను(సావిత్రి)కోటీశ్వరుని కివ్వాలనే తలంపు కలిగిన లక్షాధికారి రాజు(ఎన్*టి*ఆర్-అదే -రాముడు) పేద వాడైన ఆనంద్(కాంతారావు)ను రాధ ప్రేమిస్తుందని తెలియగానే కోపంతో :
బాధను విలవిల లాడె వి
రిప్లయితొలగించండిరాధుడు గాయము లగుటను రాముని వలనన్
క్రోధము నంతట వీడి వి
రాధా! యిటు రమ్మటంచు రాముఁడు పిలిచెన్.
సాధారణ మానవునిగ
రిప్లయితొలగించండినాదైవ మెదురుగ వచ్చి; నన్నే గనుచున్
మోదంబు చూపుచును; నా
రాధా! యిటు రమ్మటంచు రాముఁడు పిలిచెన్.
భావము:-
ఓ నా రాధా! నా దైవమైన రాముఁడు సాధారణ మానవుని వలె నాకు ఎదురుగ వచ్చి; ప్రేమ పూర్వకముగా నన్నే చూచుచు " ఇలారా!" అంటూ నన్ను పిలిచెను.
బాధలు లేవు మనకిఁక వి
రిప్లయితొలగించండిరోధులుఁ బాసిరి. హృదయము రూఢిగ నీదే!
సాధు సుగుణ భర్తృ సమా
రాధా! యిటు రమ్మటంచు రాముఁడు పిలిచెన్.
నలభై సంవత్సరాల క్రితం నేను చేసిన పూరణ -
రిప్లయితొలగించండిభూధవుని సతిని సీతను
సాధించిన రక్కసుండు సంతోషముతో
బాధింపఁగఁ గోపమున వి
రాధా! యిటు రమ్మటంచు రాముఁడు పిలిచెన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాధాకృష్ణులె ఆడుచు,
రిప్లయితొలగించండిప్రాధాన్యము నీయలేదు బలరామునికిన్!
క్రోధమునొందెనొ? ఏమో?
రాధా! ఇటు రమ్మటంచు రాముడు పిలిచెన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబాధిం చకె ప్రియ సఖినను
రిప్లయితొలగించండిసాధారణ దోషమునకు చంపెద వేలా ?
నాదగు హృదయము నీదిక
రాధా ! ఇటు రమ్మటంచు రాముడు పిలిచెన్ !
ఆచార్య ఫణీంద్ర గారి పూరణ రంజింపజేసింది.
రిప్లయితొలగించండిరవి గారు! కృతజ్ఞతలు!
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
"రక్త సంబంధం" సినిమాలో చెల్లెలైన రాధను(సావిత్రి)కోటీశ్వరుని కివ్వాలనే తలంపు కలిగిన లక్షాధికారి రాజు(ఎన్*టి*ఆర్-అదే -రాముడు) పేద వాడైన ఆనంద్(కాంతారావు)ను రాధ ప్రేమిస్తుందని తెలియగానే కోపంతో :
01)
_____________________________________
క్రోధో దీప్తుం డాయెను
రాధా నందుల నట గని - రాతిరి వేళన్ !
బాధామయ హృదయముతో
"రాధా"!యిటు రమ్మటంచు - రాముఁడు పిలిచెన్ !
_____________________________________
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిపూరణలో మీ చమత్కారం అదిరించి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచిన్న సవరణ తో ..
రిప్లయితొలగించండిరాధను పిలిచెను కృష్ణుడు
"రాధా"!యిటు రమ్మటంచు -'రాముఁడు పిలిచెన్
బాధను పడకుము, ఆడెద
రాధా ! మరి యన్న గూడ రాగా' యనియెన్ !
రాధను కృష్ణుడు పిలెచెను
రిప్లయితొలగించండిరాధా! యిటు రమ్మటంచు;...రాముఁడు పిలిచెన్
బాధను తాళగ జాలక
గోధూళిన జానకినట గోముగ కలలో :)