15, జులై 2010, గురువారం

సమస్యా పూరణం - 39

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది .....
సెంటిమెంటు చేసె సెటిలుమెంటు.

23 కామెంట్‌లు:

  1. భర్త జైలుకెళితె భార్య మంత్రియగును
    తండ్రి చచ్చిపోతె తనయుడగును
    మొసలికంట నీరు మొహమాటపెట్టగా
    సెంటిమెంటు చేసె సెటిలుమెంటు

    రిప్లయితొలగించండి
  2. వారసత్వమిపుడు భారమాయెమనకు
    సెంటిమెంటు చేసె సెటిలుమెంటు
    వాడి తండ్రి చస్తె ప్రజలకేమిటిబాధ
    సెంటిమెంటు పేర పెంటబెట్టె

    రిప్లయితొలగించండి
  3. చదువరి గారూ,
    పూరణ అదిరింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. అన్ని సీట్లయందు కొన్ని సీట్లే వచ్చె
    కొన్ని సీట్ల లోను వన్నె తగ్గె
    ఎన్ని సీట్లు మిగులు నెన్నికలందున?
    సెంటిమెంటు చేసె సెటిలుమెంటు!!

    రిప్లయితొలగించండి
  6. తర్కవిద్య తెలిపె తగిన సమయమంచు
    జాతకమ్ము తెలిపె జాగుసేయ
    తెరవు గానలేక తికమక పడుచుండ
    సెంటిమెంటు చేసె సెటిలుమెంటు

    రిప్లయితొలగించండి
  7. అన్నదమ్ములాస్తి ఆబగ మింగగ
    మామ వచ్చి చేరి మాయ జేసె
    కోతి పిల్లి తీర్పు నీతి కధలరీతి
    సెంటిమెంటు చేసె సెటిలుమెంటు.

    రిప్లయితొలగించండి
  8. చూపు గలిసి నంత చక్కన్ని చుక్కను
    పెండ్లి యాడ గోరి పిచ్చి నాకు
    చూపు కలవ కుండ చేపట్టె నొకచుక్క
    సెంటి మెంటు చేసె సెటిలు మెంటు.

    రిప్లయితొలగించండి
  9. ఎంత ముజ్జగములు ఏల నేమి ఘనము?
    పారిజాతసుమము ’వారు’ తేగ
    సత్య భామ అలిగి సద్దు జేసి,తుదకు
    సెంటిమెంటు చేసె సెటిలుమెంటు.

    రిప్లయితొలగించండి
  10. జిగురు సత్యనారాయణ గారూ,
    హరి దోర్నాల గారూ,
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    నేదునూరి రాజేశ్వరి గారూ,
    రవి గారూ,
    అందరి పూరణలు బాగున్నాయి. ధన్యవాదాలు. సమయాభావం వల్ల విడివిడిగా వ్యాఖ్యానించలేకపోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  11. సీట్లు సీట్లు యంచు సిగపట్లు పట్టగ
    ఓట్లనమ్ము కొనగ ఓడి పోవ
    ఉద్యమించి నంత ఉప్పుసంద్రము వోలె
    సెంటిమెంటు చేసె సెటిలుమెంటు

    రిప్లయితొలగించండి
  12. నా పూరణ -
    పెండ్లి పిదప యెంత వేడినం బంపని
    యత్తవారు బిడ్డ నంపినారు
    అత్తల కగు కీడటంచు నాషాఢంపు
    సెంటిమెంటు చేసె సెటిలుమెంటు.
    ( మా అమ్మాయి విషయంలో నా స్వీయానుభవం )

    రిప్లయితొలగించండి
  13. రాచరికము పోయి రాజ్యాంగమొచ్చినా
    తండ్రి చస్తె టికెటు తనుజులొందు
    సింపతీని క్యాషు సిగ్గీడి జేస్తిరే
    సెంటిమెంటు చేసె సెటిలుమెంటు

    రిప్లయితొలగించండి
  14. తాళి కట్టు వరకు తల్లిదండ్రి వలయు,
    తప్ప ది౦క యపుడు ఆలికూడ
    ఆలుమగల గొడవ ఆమ్మప్రేమ యనెడు
    సెంటిమెంటు చేసె సెటిలుమెంటు

    (ఇది నాకు తోచిన ఆలోచన. ఈ క్రింది పద్యానికి ప్రేరణ నా సోదరి)

    ఫలము తెచ్చినట్టి పాండుతనయులను
    పంచుకొమ్మనె సమ భాగములుగ
    ఫలము తెలియకున్న ప్రతిఫలించె భవిత
    సెంటిమెంటు చేసె సెటిలుమెంటు

    రిప్లయితొలగించండి
  15. మీ స్వీయానుభవం ఆర్ద్రంగా ఉంది. (బహుశా నేను అమ్మాయి తండ్రిని కాబట్టేమో)

    రిప్లయితొలగించండి
  16. శంకరయ్య గారు,

    యధాలాపంగా రాసినా, మీరు పడిన ఆవేదన అర్థమౌతుంది. మీ పూరణ చాలా బాగుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. హరి దోర్నాల గారూ,
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. నా పూరణ విషయంలో మీ స్పందనకు ధన్యవాదాలు.

    సుమిత్ర గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.

    రవి గారూ,
    నా పూరణ విషయంలో మీ స్పందనకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. నచికేత్ గారూ,
    మీకు "శంకరాభరణం" బ్లాగు స్వాగతం పలుకుతోంది. మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. రవి: :) బాగుంది.
    మాస్టారూ, ఆర్ద్రంగా ఉంది, మీ పూరణ.

    రిప్లయితొలగించండి
  20. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    ________________________________________


    పంచ పాండ వులను - పరిమార్చ వలదంచు
    కుంతి మాట గొనెను - కొడుకు వద్ద !
    మాట నిలుపు కొఱకు - మరణించె కర్ణుండు !
    సెంటిమెంటు చేసె - సెటిలు మెంటు !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  21. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి