నచికేత్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. రెండవ పూరణలో "కరువు వొచ్చి" అన్నారు. తెలుగులో వు,వూ,వొ,వోలతో మొదలయ్యే పదాలు లేవని చిన్నయ సూరి చెప్పాడు. "కరువు వచ్చి" అంటే సరిపోతుంది.
నేదునూరి రాజేశ్వరి గారూ, మంచి బావం. అభినందనలు. అయితే మూడవ పాదంలో యతిమైత్రి తప్పింది. "వేంకటేశుడైన వినడు ముడుపు లేక" అని సవరిస్తే ఎలా ఉంటుంది?
జిగురు సత్యనారాయణ గారూ, భావం బాగుంది. అభినందనలు. మూడవ పాదంలో ఇంద్రగణానికి బదులు "రిజెక్టు" అని జగణం వేసారు.
మంచితనము కన్న మంచి ధనమె మిన్న
రిప్లయితొలగించండిమనిషి కన్న, మనిషి మంచి కన్న!
చూచియుంటిమన్న సోంపేటలో నిన్న
ధనమె గొప్ప మంచితనము కంటె
ఘనము ఘనమటంచు కల్యాణకరమంచు
రిప్లయితొలగించండిమంచితనము నుంటి. వంచితులిల
ధనము బలము చేసి దయమాలి వర్తించు.
ధనమె గొప్ప మంచితనము కంటె.
జబ్బు చేసినంత డబ్బు సాయ మడుగ
రిప్లయితొలగించండిప్రాణ మిత్రుడొకడు పారి పోయె
వైరిగా తలచిన వాడు సాయ పడిన
ధనమె గొప్ప మంచితనము కంటె.
చదువరి గారూ,
రిప్లయితొలగించండిచింతా రామకృష్ణారావు గారూ,
హరి దోర్నాల గారూ,
అందరి పూరణలు చాలా బాగున్నాయి. అభినందనలు. సమయాభావం వల్ల విడివిడిగా వ్యాఖ్యానించలేక పోతున్నాను. మన్నించండి.
ఇన్ని పాటు లోర్చి ఇప్పుడిఁక సయోధ్య
రిప్లయితొలగించండియందురా?అదియును ఐదు ఊళ్ళ
కట!కట కట!వలఁదు.క్షత్రియునకిలఁ ని
ధనమె గొప్ప మంచితనము కంటె.
నిధనము - మరణము
నిర్ధనము - దారిద్ర్యము అని మృచ్ఛకటికంలో ఓ చోట వస్తుంది.
మన్నించడమేంటి మాస్టారూ, ఓపిగ్గా సమస్యలనిచ్చి మా పూరణలను ప్రచురిస్తున్నారు, అదే ఎక్కువ. :) అందరికీ కలిపి ఒక అభినందన వ్యాఖ్య చాలదూ!?
రిప్లయితొలగించండిరవి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
నేనూ చదువరి గారి వ్యాఖ్యను సమర్థిస్తున్నాను
రిప్లయితొలగించండివారకాంతలకడ, వర్తకమున, నేడు
రిప్లయితొలగించండిగనగ రాజకీయమునను, కడకు,
కట్టె గాల్చ నిచ్చు కాపరి వద్దనూ
ధనము గొప్ప మంచి తనము కంటె.
@ కవి మిత్రుల౦దరికి అభినందనలు.
రిప్లయితొలగించండిధనము గొప్పదియగు దానగుణము యున్న,
విద్య గొప్పదియగు వినయమున్న,
కర్మ ఫలము వీడి గావించు కార్య సా
ధనమె గొప్ప మంచితనము కంటె.
మంచి మాటలెన్ని మనసార చెప్పినా
రిప్లయితొలగించండిబడుగు జీవి కెటుల కడుపు నింపు?
చేతనైన యంత చేయూత నివ్వరా,
ధనమె గొప్ప మంచితనము కంటె!!
మంచి మంచి యన్న మనుగడ యేముంది
రిప్లయితొలగించండికంచి కేగు నట్టి కతల కతన
వేంక టేశు డైన వరమిచ్చు ఫలమొంది [వజ్రములందుకొని ]
ధనమె గొప్ప మంచి తనము కంటె
ధనమె గొప్ప మంచితనము కంటె యనుచు
రిప్లయితొలగించండితలిచె నొక్క జనుడు ధరణి యందు!
కరువు వొచ్చి యతడె కష్టాల కాయగా
సాయ మడుగ నెవరి జాడ లేదు!!
బందుఁజేసినంత బందయ్యె పెట్రోలు
రిప్లయితొలగించండిచూడ లీటరుండె స్కూటరందు
ఫ్రెండు కోర కొంత రిజెక్టుఁజేసె, యిం
ధనమె గొప్ప మంచితనము కంటె!!
ఊకదంపుడు గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. ధన్యవాదాలు.
సుమిత్ర గారూ,
బాగుంది. అభినందనలు. "దానగుణము + ఉన్న" అన్నప్పుడు యడాగమం రాదు. "దానగుణంబున్న" అని సవరిస్తే సరి.
నచికేత్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు. రెండవ పూరణలో "కరువు వొచ్చి" అన్నారు. తెలుగులో వు,వూ,వొ,వోలతో మొదలయ్యే పదాలు లేవని చిన్నయ సూరి చెప్పాడు. "కరువు వచ్చి" అంటే సరిపోతుంది.
నేదునూరి రాజేశ్వరి గారూ,
మంచి బావం. అభినందనలు. అయితే మూడవ పాదంలో యతిమైత్రి తప్పింది.
"వేంకటేశుడైన వినడు ముడుపు లేక" అని సవరిస్తే ఎలా ఉంటుంది?
జిగురు సత్యనారాయణ గారూ,
భావం బాగుంది. అభినందనలు. మూడవ పాదంలో ఇంద్రగణానికి బదులు "రిజెక్టు" అని జగణం వేసారు.
నా పూరణ -
రిప్లయితొలగించండిఐహిక సుఖ రక్తు లైనట్టి వారికిన్
ధనమె గొప్ప; మంచితనము కంటె
మించినట్టి దేది? మేలుగ పుణ్య సా
ధనముఁ జేయువారె ధన్య జనులు.
తిట్టిపోయునెడల తిరిగి తిట్టవలయు -
రిప్లయితొలగించండిమంచితనము చూప మనము గోరి,
మిన్నకున్న- ఇంక మించి పోదురు! మాన
ధనమె గొప్ప మంచి తనము కంటె!
ఆచార్య ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండిఆలస్యమైనా మంచి పూరణ పంపించారు. ధన్యవాదాలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
____________________________________
మంచి తనము జూపి - వంచనాపరులను
వదల గూడ దెపుడు - వసుధ యందు !
చెడ్డ వారి నెల్ల - శిక్షింప, నిట దుర్మ
థనమె మేలు మంచి - తనము కంటె !
____________________________________
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమంచిభావాన్నే తీసుకున్నారు పూరణకు. కాని సమస్యపాదంలోని ప్రథమాక్షరాన్ని‘థ’ గా మార్చారు. అది ‘ధ’ కదా!
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమరేం జెయ్యను ?
ధ-లన్నీ ఐపోయినై !