వసంత కిశోర్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. రెండవపాదం చివర ‘వలెన్’ అందాం. ఈ సమయంలో నిద్రపోకుండా ఏం జేస్తున్నారు? మొన్ననే కదా చెప్పింది ఆరోగ్యం జాగ్రత్త అని!
నరసింహ మూర్తి గారూ, మా నిద్రాలేమిని గురించి మంచి పద్యం చెప్పారు. ధన్యవాదాలు. వసంత కిశోర్ గారికి అలవాటే కాని మా బావగారు ట్రయిన్ దిగి ఆ సమయంలో వచ్చారు. ఆయనతో మాట్లాడుతూ ఒకసారి మెయిల్ చెక్ చేద్దామని నెట్ ఓపెన్ చేసాను. అంతే!
శంకరార్యా ! కిషోర్ జీ ! మీరు నిద్రమానుకొని శంకరాభరణానికి మెరుగులుఅద్దుతున్నారు.. ఆరోగ్యం జాగ్రత్త సుమా ! ---------------------------------------------------------------------------- మానాన్నే ఆరోగ్యము గానుండుట కొరకు తెస్తి గా తాయెత్తున్ ఈ నాడే, చూడు బాగగు నా నాటికి; తీసికట్టు నాగంభొట్లూ!
కిశోర్ జీ రోజుకి కనీసము ఐదారు గంటలైనా పడుకొండి సామీ ! మా వైద్యులకైతె తప్పదు రాత్రంతా ఫోను కాల్స్ తో నిద్రా భంగం. మీరు హాయిగా బజ్జో వచ్చు కదా ! పోనీ ఈ మెయిల్లో ఫోను నంబరియ్యండి . వారాంతములో మీ కనువైన సమయములో పిలుస్తాను. సరదాగా కొద్ది సేపు మాట్లాడు కొందాము.
ఏనాటికైన సీటును
రిప్లయితొలగించండితానే కైవసము సేయ తలపులు కలుగన్
పూనెను బాబుకు బాబ్లీ
నానాటికి తీసికట్టు నాగంభొట్లూ!
హరి దోర్నాల గారూ,
రిప్లయితొలగించండిసమయోచితమైన పూరణ. బాగుంది. అభినందనలు.
ఏ నాటిది మన ధర్మము
రిప్లయితొలగించండిఈ నాటికి విలువలన్ని ఏ మాయెనహో
నానారీతులు వెలయగ
నానాటికి తీసికట్టు నాగంభొట్లూ!
నానా గడ్డిని నెసవుచు
పోనాడిరి దేశ భవిత పోకిరి శేతల్
ఏనాటిదొ భరత యశము
నానాటికి తీసికట్టు నాగంభొట్లూ!
నా పూరణలు -
రిప్లయితొలగించండి(1)
నానా బాధలు పడి దే
శానికి తెచ్చిరిదె ఘనులు స్వాతంత్ర్యంబున్
కాని ఫలిత మేమున్నది?
నానాటికి తీసికట్టు నాగంభొట్లూ!
(2)
ఏనాడుండునొ తద్దిన
మానాడే కడుపు నిండు; నదె వారమయెన్
నేనిన్నాళ్ళుగ పస్తులు
నానాటికి తీసికట్టు నాగంభొట్లూ!
( "ఎద్దినం తద్దినం నాస్తి, తద్దినం మమ తద్దినం" గుర్తుకు వచ్చి )
అస్తమాను పూజలతో పొద్దుపుచ్చే ఓ ఇల్లాలితో మొగుడు.
రిప్లయితొలగించండిఈనాడైనా దయతో
రానే రావా సరసకు రంగాజమ్మో
ఈ నా కాపుర మెందుకు?
నానాటికి తీసికట్టు నాగంభొట్లూ.
ఓ సినిమా చూస్తూంటే ఈ ఆలోచన వచ్చింది.
ఈనాటి కీచకుల పరిమార్చుట
రిప్లయితొలగించండిఏనాటికైన జరుగునె మనకిక ఏమఱుపాటున్
రానేరదు వమ్మిక యాశలు
నానాటికి తీసికట్టు నాగంబొట్లూ !
శంకరయ్య గారు,
రిప్లయితొలగించండి2వ పద్యంలో పొరపాటుగా టైప్ చేయడం జరిగింది. దానిని
నెసవుచును 'మెసవుచు' అని, శేతల్ ను 'నేతల్' గా చదవగలరు.
(నాగంభొట్లు భార్య తన భర్త పేదరికాన్ని ఎద్దేవ చెస్తూ పలికిన మాటలు)
రిప్లయితొలగించండికానగ గతి మీకింకన్
మా నానిచ్చిన నవీన మధుపర్కంబుల్
మానము కాచు సభలలో
నా నాటికి తీసికట్టు నాగంభొట్లూ!
(సభలలోన్ + ఆ నాటికి = సభలలోనానాటికి)
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
ఒక యిల్లాలి వేదన :
01)
_____________________________________
నానాటికి ధరలు ,పెరిగె
ఈ నాటికి బత్తె మదియె - యిదివరకు వలే !
ఖానా పీనాలు ,తుదకు
నానాటికి తీసికట్టు - నాగంభొట్లూ!
_____________________________________
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
రెండవపాదం చివర ‘వలెన్’ అందాం.
ఈ సమయంలో నిద్రపోకుండా ఏం జేస్తున్నారు? మొన్ననే కదా చెప్పింది ఆరోగ్యం జాగ్రత్త అని!
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఈ సమయంలో మీరు ?????
ఆనాడు నారు జాములు
రిప్లయితొలగించండిఈనాడును జూడ వీరు నేడును జాముల్
యేనాడు నిద్ర వోదురొ
నానాటికి తీసికట్టు నాగంభొట్లూ !
నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమా నిద్రాలేమిని గురించి మంచి పద్యం చెప్పారు. ధన్యవాదాలు. వసంత కిశోర్ గారికి అలవాటే కాని మా బావగారు ట్రయిన్ దిగి ఆ సమయంలో వచ్చారు. ఆయనతో మాట్లాడుతూ ఒకసారి మెయిల్ చెక్ చేద్దామని నెట్ ఓపెన్ చేసాను. అంతే!
మూర్తీజీ ! నన్నే వెక్కిరిస్తారా ! అదీ చందోబద్దంగా !
రిప్లయితొలగించండిఉండండి మీ పని జెప్తాను !
శంకరార్యా ! కిషోర్ జీ ! మీరు నిద్రమానుకొని శంకరాభరణానికి మెరుగులుఅద్దుతున్నారు.. ఆరోగ్యం జాగ్రత్త సుమా !
రిప్లయితొలగించండి----------------------------------------------------------------------------
మానాన్నే ఆరోగ్యము
గానుండుట కొరకు తెస్తి గా తాయెత్తున్
ఈ నాడే, చూడు బాగగు
నా నాటికి; తీసికట్టు నాగంభొట్లూ!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండినాగంభొట్లవారికి కట్టుకొనడానికి తాయెత్తు తెచ్చిన మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
కిశోర్ జీ రోజుకి కనీసము ఐదారు గంటలైనా పడుకొండి సామీ ! మా వైద్యులకైతె తప్పదు రాత్రంతా ఫోను కాల్స్ తో నిద్రా భంగం. మీరు హాయిగా బజ్జో వచ్చు కదా ! పోనీ ఈ మెయిల్లో ఫోను నంబరియ్యండి . వారాంతములో మీ కనువైన సమయములో పిలుస్తాను. సరదాగా కొద్ది సేపు మాట్లాడు కొందాము.
రిప్లయితొలగించండిఆ నాడొక సాగరమిది
రిప్లయితొలగించండికోనేరయి క్రుంగి క్రుంగి గుంటగ మారెన్
దీనుడు హుసేనుదిచటన్
నానాటికి తీసికట్టు నాగంభొట్లూ!