9, జులై 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 34

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
బొంకినట్టివాఁడె పుణ్యజనుఁడు.

25 కామెంట్‌లు:

 1. కానికాలమొచ్చె కలికాలమందున
  ధర్మగ్లాని కలిగె, ఖర్మ కాలె
  రంకు చేయువాడు రాజ్యమేలును నేడు
  బొంకినట్టివాఁడె పుణ్యజనుఁడు

  రిప్లయితొలగించండి
 2. మాస్టారూ,
  పద్యకవిత్వ ప్రేమికులు ఈ లింకు ఇష్టపడతారని ఇస్తున్నాను -బహుశా కొందరికి తెలిసే ఉంటుంది. http://siliconandhra.org/nextgen/sujanaranjani/july10/padyamhrudyam.html

  నెలనెలా ఒకటో రెండో సమస్యలు ఇస్తూంటారు. గతంలో నేను కొన్నిసార్లు పూరణలు సమర్పించాను.

  రిప్లయితొలగించండి
 3. బొంకు తప్పె గాని బొంకుట తప్పదు
  ఘడియ బొంక కుండ గడప లేము
  పరుల మేలు తనకు పరమార్థముగ నెంచి
  బొంకి నట్టి వాఁడె పుణ్యజనుఁడు.

  రిప్లయితొలగించండి
 4. చంక నాకి పోయె శాస్త్ర సారమ్ములు
  రంకు బొంకు నేడు రహిఁగలిగెను
  వంక బెట్ట లేరు వసుధన వీరిని
  బొంకినట్టివాఁడె పుణ్యజనుఁడు!!

  రిప్లయితొలగించండి
 5. వారిజాక్షులందు వైవాహికములందు
  ప్రాణ విత్త మాన భంగమందు
  చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు
  బొంకినట్టివాఁడె పుణ్యజనుఁడు.

  రిప్లయితొలగించండి
 6. సత్యసంధుడైన సాలోకచిత్తుడై
  కాపురముకు చేటు కలుగకుండ
  సమయమెరిగి మెలగ సత్యమైనను దాచి
  బొంకునట్టివాడె పుణ్య జనుడు

  రిప్లయితొలగించండి
 7. శంక యేల నయ్య శంకరయ్యా మీకు
  సంకటములు బాప సంఘమునకు
  బొంక వలసి రాగ జంకక గొంకక
  బొంకినట్టివాఁడె పుణ్యజనుఁడు.

  రిప్లయితొలగించండి
 8. చదువరి గారూ,
  "కాని కాలము +ఒచ్చె" అన్నచోట ఒచ్చె గ్రామ్యం. వచ్చె శుద్ధప్రయోగం. "ధర్మగ్లాని"లో "ర్మ" గురువు కనుక గణ దోషం. నా సవరణ -

  కాని కాలము కద కలికాల మందున
  ధర్మమునకు గ్లాని కలిగె నయ్యొ!
  రంకు చేయువాఁడు రాజ్య మేలును నేడు
  బొంకినట్టివాఁడె పుణ్యజనుఁడు.

  రిప్లయితొలగించండి
 9. చదువరి గారూ,
  ధన్యవాదాలు. "సిలికానాంధ్ర" గురించి తెలుసు. గతంలో నేనూ కొన్ని పూరణలు పంపాను.

  రిప్లయితొలగించండి
 10. హరి దోర్నాల గారూ,
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ ఇద్దరి పూరణలు నిర్దోషంగా, చక్కగా ఉన్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. అజ్ఞాత గారూ,
  ప్రసిద్ధ పద్యాన్ని చక్కగా వాడుకున్నారు. బాగుంది. నిజానికి నేను సమస్యను సిద్ధం చేసింది ఆ పద్యం స్ఫూర్తి తోనే.

  సుమిత్ర గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  అజ్ఞాత - 2 గారూ,
  పై అజ్ఞాత, మీరు ఒకరేనా? వేరూ వేరా? ఏమైనా పద్యం చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. ధర్మ, గ్లాని రెండు వేరువేరు పదాలు కదా అని అనుకున్నాను. సవరణలకు నెనరులు సార్.

  రిప్లయితొలగించండి
 13. ఆంగ్లములో బ్లఫ్ఫడ మంటే తెలుగులో బొంకడ మంతే...

  పోక రనబడు నొక పేకాట యందున
  గెలువ నేర్వ, నేర్వ వలయు బ్లఫ్ఫు
  అట్టి ఆటలాడు ఆసక్తులొకఁ జేర
  బొంకునట్టి వాడె పుణ్యజనుడు

  రిప్లయితొలగించండి
 14. దొంగ పొత్తులందు ధూర్తాదులందును
  పదవి విత్త లంచ ప్రస్తవమున
  సిగ్గు విడఁచి బదుక మొగ్గు జూపఁగ నేడు
  బొంకినట్టివాఁడె పుణ్యజనుఁడు.

  రిప్లయితొలగించండి
 15. జంకు గొంకు లేని జలసూకరమ్ములు
  తప్పు జేయ నెంచ తప్పు గాదు
  లంచ మిచ్చి శరణు లలితమ్మ కునుమొక్కి
  బొంకి నట్టి వాడె పుణ్య జనుడు.

  క్షమంచాలి తమరిని బాగా శ్రమ పెట్టాను " ఇది కుడా పొరబాటొస్తె ఇంక శ్రమ పెట్టను " ధన్య వాదములు
  జలసూకరము = మొసలి

  రిప్లయితొలగించండి
 16. "సమస్యా పూరణం - 33" పోస్ట్‌పై సుమిత్ర క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

  రవిగారూ!
  శత పద్యాలు పూర్తి చేసినందుకు ముందుగా అందుకోండి మా అభినందనలు.

  అందరి పూరణలు చాలా బాగున్నాయి. శంకరయ్య గారూ,అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. గిరి గారూ,
  బాగుంది పూరణ. అభినందనలు. నాకు రమ్మీ తప్ప పోకర్ తెలియదు. అందువల్ల ఈ బ్లఫింగ్ పట్ల అవగాహన లేదు.

  రవి గారూ,
  మంచి పూరణ. అభినందనలు.

  రాజేశ్వరి గారూ,
  పద్యం సలక్షణంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. గిరిగారూ,
  పోకర్లో నిజానికి బొంకడం ఉండదు, "బ్లఫ్" అని మరో పేకాట. అందులో బొంకడం ఉంటుంది :-)

  మా బొంకులదిబ్బనీ, గిరీశాన్ని తలుచుకుంటూ నా పూరణ:

  లంకచుట్ట బీల్చి బొంకులదిబ్బపై
  లెక్చరిచ్చె నా గిరీశమిట్లు
  "జంకుగొంకు లేక, వెంకటేశం డియర్!
  బొంకినట్టివాడె పుణ్యజనుడు"

  రిప్లయితొలగించండి
 19. శంకరయ్య గారు,
  నిజానికి నేను పోకరు ఆడను, బ్లఫ్ఫు గుఱించి స్నేహితుల వల్ల పలుచోట్ల చదివిన విషయాల వల్ల తెలుసుకోవడమే గానీ, స్వయంప్రయోజకత్వము అందులో లేశమూ లేదు :-)

  రిప్లయితొలగించండి
 20. భైరవభట్ల కామేశ్వర రావు గారూ,
  మీ పూరణ అద్భుతం. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 21. కామేశ్వర రావు గారు,
  పోకర్లో బ్లఫ్ఫు ఉందండీ - లేనిది ఉన్నట్టు బొంకి పైచేయి వాణ్ణి ప్రక్కత్రోవ పట్టించి ఓడించే విధానమది . ఈ లంకె చూడండి..

  రిప్లయితొలగించండి
 22. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  నేటి స్థితి :
  01)
  _____________________________________

  బొంకు లాడు వారె - భోగంబు మరియును
  బూజ లందుకొనును - బుడమి జనుల !
  బొంకు లాడ కున్న - భోజనమే సున్న
  బొంకి నట్టి వాడె - పుణ్య జనుడు !
  _____________________________________

  రిప్లయితొలగించండి
 23. వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘బూజ లందుకొంద్రు" అంటే బాగుంటుందేమో?

  రిప్లయితొలగించండి