24, జులై 2010, శనివారం

దత్తపది - 6

కవి మిత్రులారా!
క్రింది పదాలను ఉపయోగించి మీకు నచ్చిన విషయంపై, నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.
కడప, బాసర, కొండపల్లి, యాదగిరి.

17 కామెంట్‌లు:

  1. కడప గౌరమ్మ! కావుమా కంది వార్ని.
    కావుమో బాసరాంబికా! కందివార్ని.
    కావుమోకొండపల్లీశ! కందివార్ని.
    కావిమామోయాదగిరి దేవ! కందివార్ని.

    సహృదయుల పూరణ నిమిత్తం దత్తపది.

    ఇడ్లీ, పూరీ, ఉప్మా, కాఫీ

    ఈ పదాలాతో, ముంబయి మారణకాండని, గజేంద్రమోక్షానికి అన్వయిస్తూ, మత్తేభంలో పద్యం చెప్పాలి

    రిప్లయితొలగించండి
  2. ఇడ్లీ, పూరీ, ఉప్మా, కాఫీ
    ఈ పదాలాతో, ముంబయి మారణకాండని, గజేంద్రమోక్షానికి అన్వయిస్తూ, మత్తేభంలో నేను చేసిన పూరణ.

    కసభుక్కీలదురంత నర్కమిచటన్ "కాల్చుండిది డ్లీయనన్"
    ముసుగుల్ దాలిచి పట్టె మమ్ము గనుమా! పూరీ జగన్నాయకా!
    ఉసురుల్ తీయగ నుండె కావుమిలలో ఉప్మాక దేవా! మమున్
    విషమంబియ్యది. యిట్టి చిన్న పనికా ఫిర్యాదటంచెంచకన్!

    కసబ్ ఢిల్లీ అనుకొని ముంబాయ్ని కాల్చే ప్రయత్నం చేసినప్పుడు మనాఅర్త గజేంద్రులమొర. పాకిస్తానీయుడైన కసబ్ ఇది డిల్లీ అనడానికి అది డ్లీ=ఇదిడ్లీ అని మెసేజ్ పంపడం తద్వారా జరిగిన అనర్థం దుఃఖితుల ఆర్త నాదాలు. ఏ దేవుడైనా రక్షించకపోతాడ అని పూరీ జగన్నాధుని; ఉపమాక వేంకటేశ్వరునీ పేరుపెట్టి మరీ ప్రార్థించారు..ఊహించుకొని ఈ పద్యం చాఉవ మనవి.
    (కాల్చుండు + ఇది + ఈ +డ్లీ ( ఈ + ఢిల్లీ = ఇడ్లీ ) = కాల్చుండిదిడ్లీ)
    (ముసుగు = పొగు ముసుగు)

    రిప్లయితొలగించండి
  3. విషయం: గిరిజా కల్యాణము
    సందర్భము: చెలికత్తెలు పార్వతికి, తనను వివాహమాడ శివుఁడు హిమవంతుని పట్టణమునకు వచ్చెనని తెలియఁజేయుట.

    తే.గీ.
    చెలియ! అంబా! సరసిజాక్షి! చేకొన నిను
    వచ్చె చలికొండ పల్లికి పరమ శివుఁడు
    త్రొక్కె హిమవంతుని కడప మక్కువగను
    చేసె మర్యాద గిరిపతి చెలఁగి యంత!!

    రిప్లయితొలగించండి
  4. కడఫ రెడ్డమ్మ చెప్పెను కవన జ్యోసం
    వెలది బాసర ఇచ్చెను వరము లెన్నో
    యెటుల నేర్పిరొ గీతిలు యాదగిరులు
    కడకు బోవంగ నేటికి కొండ పల్లి ?

    రిప్లయితొలగించండి
  5. [చివరి పాదం సరి పోతుందను కుంటే ]
    " కంద మునకేల బోవలె కొండపల్లి "

    రిప్లయితొలగించండి
  6. కడప రెడ్డమ్మ చెప్పెను కవన జ్యోసం
    వెలది బాసర ఇచ్చెను వరము లెన్నొ
    యెటుల నేర్పిరొ గీతిలు యాదగిరులు
    కంద మునకేల బోవలె కొండ పల్లి ?

    రిప్లయితొలగించండి
  7. ఆఖరిపాదం అక్షర దోషం ముద్రితమైనందున సరి చేసి ఇక్కడ మళ్ళీ వ్రాసితిని.

    కడప గౌరమ్మ! కావుమా కంది వార్ని.
    కావుమో బాసరాంబికా! కందివార్ని.
    కావుమోకొండపల్లీశ! కందివార్ని.
    కావుమోయాదగిరి దేవ! కందివార్ని

    రిప్లయితొలగించండి
  8. శంకరయ్యగారు,
    పని వత్తిడిలో బ్లాగు చూడడం కుదరక మీ అనారోగ్యం సంగతి తెలీలేదు. మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  9. ఆశు కవులేరి నిలుప పద్య మరియాద
    గిరియు హరియు రారు బహుశ మరచె బాస
    రవియు గాంచడేమి, దిగెనొ రాత్రి కొండ!
    పల్లియములెగా మీకడ పద్య రచన!

    (మరియాద అంటే ఆనవాయితీ అని, ’బాస’ అంటే ’వాగ్దానం’ అనీ నా భావన)

    రిప్లయితొలగించండి
  10. చింతా రామకృష్ణారావు గారూ,
    నన్ను రక్షించమని వివిధ దేవతలను ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీ ఆత్మీయ శుభాకాంక్షల వలననే నేను జ్వరం నుండి కోలుకున్నాను.
    ఇక సోమ శేఖర్ గారిచ్చిన దత్తపదికి మీ పూరణ అద్భుతం. నేనైతే ఆ పదాలతో, ఆ విషయంపై పద్యం రాయడం అసంభవం అని చెప్పాను. సోమ శేఖర్ గారూ ప్రయత్నించారు. ఆ పద్యం మీ మెయిల్ కు వస్తుంది. దాని గుణదోష విచారణ చేయండి.

    రిప్లయితొలగించండి
  11. జిగురు సత్యనారాయణ గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. నేదునూరి రాజేశ్వరి గారూ,
    మంచి ప్రయత్నం. అభినందనలు. చివరి మూడు పాదాల్లో ( సవరించిన పాదంతో కూడా ) యతిమైత్రి తప్పింది.

    రిప్లయితొలగించండి
  13. చదువరి గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. సుమిత్ర గారూ,
    ధన్యవాదాలు. ఇప్పుడు నా ఆరోగ్యం కుదుట పడింది.

    రిప్లయితొలగించండి
  15. శంకరయ్యగారూ! ఆ పరాత్పరుఁడెంత గొప్పవాఁడండీ! మీకు అనారోగ్యంగా ఉన్న సంగతి నాకు హృదయాంతరాళాల్లో స్ఫురిస్తోది. అందుకే నేనలా వ్రాసాను; కాదు ఆ పరాత్పరుఁడే వ్రాయించాడు.
    ప్రస్తుతం మీరు కోలుకున్నందుకు చాలా సంతోషమండి.

    రిప్లయితొలగించండి
  16. నా పూరణ -
    గురువు కడ పద్యముల వ్రాయు తెరువుఁ దెలిసి
    కొంటి నంబా! సరస్వతీ! కోరినట్టి
    చదువులకు కొండ! పల్లియ జనులు నీకు
    నొసఁగ మరియాద, గిరి గీసి యుందు నెట్లు?

    రిప్లయితొలగించండి
  17. వేయి శుభమ్ముల వెంటఁ దెస్తివి యమ్మ
    చల్ల బంగరు కొండ! పల్లె భామ!
    గడపఁ కుడి పదముఁ దొడరఁగ తండుల
    కడవను పడవైచి అడుగు వెట్టు!
    కనుము మగనిఁ గూర్మిఁ గసరవలఁదె తల్లి
    కీసరబాసరఁ వీసమెత్తు!
    పండు కాఁపురమమ్మ! పండంటి శిశువిచ్చు
    కేల్గవన్ మరియాద గిరిజ తనయ!

    ఆ.వె||
    అత్త మామ నీకుఁ ఆరడి వెట్టరు.
    మెట్టినిల్లు తలుప పుట్టినిల్లె.
    సుతుని వోలె పతినిఁ జూడుమ కోడల.
    స్వాగతమ్ము నీకుఁ సరసిజాక్షి!

    రిప్లయితొలగించండి