ప్రభ అశోక్ గారూ, "శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం. మీ పూరణలో భావం బాగున్నా, గణ, యతి దోషాలు ఉన్నాయి. వాటిని ఇలా సవరించాను.... రొచ్చుగ నున్నను పోతిమి కచ్చిగ దన్నుకు తినుటకు కళ్యాణములో నచ్చకను బయట పడితిమి పచ్చడి మెతుకులె మన కిక పరమాన్న మయెన్.
ఊకదంపుడు గారూ, యె,హె లకు నిరభ్యంతరంగా యతి చెల్లుతుంది. యతిమైత్రి కల అక్షరాల జాబితాలో మొట్టమొదట వచ్చేది అ,ఆ,ఐ, ఔ,య,హ. దాని ప్రకారమే ఇ,ఈ,ఎ,ఏ,ఋ,యి,హి,యె,హె లకు యతి చెల్లుతుంది.
రాజేశ్వరి గారూ, పూరణ నిర్దోషంగా, భావస్ఫోరకంగా బాగుంది. సవరించదగ్గ తప్పులేమీ లేవు. "విపరీతంగా" అనే వ్యావహారిక ప్రయోగాన్ని "విపరీతముగన్" అని కావ్యభాషలో వ్రాస్తే సరి. మీకు నా అభినందనలు.
వెచ్చాలు కొనుటకెల్లితి
రిప్లయితొలగించండిఅచ్చెరువందితి ధరలను ఆలోకించన్
ముచ్చెమటలు పట్టెనయో
పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్.
హెచ్చెను ధరలవి, దినసరి
రిప్లయితొలగించండివెచ్చములు కొనుటయె బరువు వీక్షింపంగన్.
విచ్చిన బతుకులు మనవయె
పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్.
ముచ్చుల పాలనలో మరి
రిప్లయితొలగించండిహెచ్చిన ధరలను కనంగ యెదపోటయ్యెన్
నచ్చిన నచ్చక పోయిన
పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్!!
రొచ్చు గ నున్న నేల,
రిప్లయితొలగించండికచ్చిగ దన్నుకు తినగ పెండ్లి బఫేలో,..
నచ్చక బయటబడితిమి,
పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్!!
హరి దోర్నాల గారూ,
రిప్లయితొలగించండిమంచి అర్థంతో పద్యం వ్రాసారు. బాగుంది. అయితే వ్యావహారిక పదాలను కొద్దిగా మారిస్తే ....
వెచ్చములు కొనుట కేగితి
నచ్చెరు వందితిని ధరల నాలోకించన్
ముచ్చెమటలు పట్టెనయో
పచ్చడి మెతుకులె మనకిక పరమాన్న మయెన్.
రవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ అద్భుతం. అభినందనలు.
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిబ్రహ్మాండమైన పూరణ. ధన్యవాదాలు.
మా తాతగారి పూరణ ఇలా ఉంది.
రిప్లయితొలగించండివెచ్చము తెచ్చుట కొరకై
ముచ్చట పడి, పోయి, ధరల ముందుగ చూడన్ కట్టా!
ముచ్చెమటలు పోసెనచట
పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్!
ప్రభ అశోక్ గారూ,
రిప్లయితొలగించండి"శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం. మీ పూరణలో భావం బాగున్నా, గణ, యతి దోషాలు ఉన్నాయి. వాటిని ఇలా సవరించాను....
రొచ్చుగ నున్నను పోతిమి
కచ్చిగ దన్నుకు తినుటకు కళ్యాణములో
నచ్చకను బయట పడితిమి
పచ్చడి మెతుకులె మన కిక పరమాన్న మయెన్.
ప్రజ్ఞా దీప్తి గారూ,
రిప్లయితొలగించండిస్వాగతం. మీ తాత గారి పూరణ చాలా బాగుంది. మూడవ పాదంలో చివర "కట్టా" అనేది తొలగిస్తే సరి!
పచ్చని సంసారమ్మున
రిప్లయితొలగించండిఅచ్చెరు వొ౦దెడు రీతిగ ఆలియు మగడున్,
ముచ్చట గొల్పుచు పలికిరి
పచ్చడి మెతుకులె మనకిక పరమాన్న మయెన్.
శంకరయ్య గారూ, నమస్కారమండీ. సత్యనారాయణ గారి పూరనలో నాదో సందేహం
రిప్లయితొలగించండిహె కు యె కు యతి వేయవచ్చా తెలుపగలరు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసుమిత్ర గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
ఊకదంపుడు గారూ,
రిప్లయితొలగించండియె,హె లకు నిరభ్యంతరంగా యతి చెల్లుతుంది. యతిమైత్రి కల అక్షరాల జాబితాలో మొట్టమొదట వచ్చేది అ,ఆ,ఐ, ఔ,య,హ. దాని ప్రకారమే ఇ,ఈ,ఎ,ఏ,ఋ,యి,హి,యె,హె లకు యతి చెల్లుతుంది.
హెచ్చిన ధరలను కనుగొని
రిప్లయితొలగించండివచ్చెనుగద గుండె పోటు విపరీ తంగా
నచ్చినది తినగ నోచక
పచ్చడి మెతుకులె మనకిక పరమాన్న మయెన్
క్షమించాలి తప్పులను సవరించ గలరు నాకు సరిగా రాదు గనుక
రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండిపూరణ నిర్దోషంగా, భావస్ఫోరకంగా బాగుంది. సవరించదగ్గ తప్పులేమీ లేవు. "విపరీతంగా" అనే వ్యావహారిక ప్రయోగాన్ని "విపరీతముగన్" అని కావ్యభాషలో వ్రాస్తే సరి. మీకు నా అభినందనలు.
ఊక దంపుడు గారు వారి బ్లాగులో చేసిన పూరణ -
రిప్లయితొలగించండిపదవీ విరమణ చేసిన వృద్ధుడు, తన భార్యతో,భోజనానికి కూర్చుంటూ:
చచ్చులు పుచ్చులు కూడా
లచ్చిమి!కొనలేకనుంటి; లావా నలమై
చిచ్చరబుట్ట జఠరమున
పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్.
[సామాన్యంగా వారి బ్లాగులోనే జవాబు ఇచ్చేవాడిని కానీయండీ, ఈ పద్యంలో లావానలమని అపభ్రంశం ఉండటంతో అక్కడ జూపలేదు.]
ఊక దంపుడు గారూ,
రిప్లయితొలగించండి"లావానలమై" ప్రయోగం చమత్కారంగా ఉంది. మిశ్రసమాస ప్రయోగం దోషం కాదు. మంచి పూరణ. అభినందనలు.
వెచ్చని గాడ్పుల వేసవి
రిప్లయితొలగించండివచ్చిన సడి తెలియునట్లు వడ్డించండోయ్
నచ్చిన ముక్కల మాగాయ్
పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్
- సనత్ కుమార్
పచ్చడి చేయఁ నరగుణము
రిప్లయితొలగించండిపచ్చడి చేసెను ధరణిన పచ్చని చెట్లన్
పచ్చడి చేసినఁ ప్రకృతిని
పచ్చడి మెతుకులె మనకిఁక పరమాన్నమవున్
రాజేశ్వరి గారి పూరణలో రెండవ పాదములో "వ" కు "వి" కి యతి కుదరదు అనుకుంట. ఆ పాదాన్ని ఇలా మారిస్తే సరిపోతుంది.
రిప్లయితొలగించండి"విచ్చేసెను గుండె పోటు విపరీతముగన్"
పచ్చడి చేయఁ నరగుణము
రిప్లయితొలగించండిపచ్చడి చేసెను ధరణిన పచ్చని చెట్లన్
పచ్చడి చేసినఁ ప్రకృతిని
పచ్చడి మెతుకులె మనకిఁక పరమాన్నమవున్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_____________________________________
మెచ్చిన తిండికి నోచము
హెచ్చిన యీ ధరల వలన - యిక్కటు లాయెన్ !
పుచ్చిన వంకాయలతో
పచ్చడి మెతుకులె మన కిఁక - పరమాన్న మయెన్ !
_____________________________________
వసంత కిశోర్ గారూ మీ "మెచ్చిన తిండికి నోచము' పద్యముతో పూరణ బాగుంది.
రిప్లయితొలగించండిరావుగారూ !బహుకాల దర్శనం ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ థాంక్స్.నాలుగురోజులు బయటికి వెళ్ళితే ఏవి మిస్ అవుతామో భలే తెలుస్తుంది.
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమెచ్చదగిన పూరణ చేసారు. అభినందనలు.
లక్కరాజు వారూ,
ధన్యవాదాలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండికుచ్చుల జడనున్ జూచుచు
రిప్లయితొలగించండినచ్చపు కోస్తా పడుచని హైదరబాదున్
ముచ్చటగా కూడుకొనగ
పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్
తెచ్చెడిసొమ్ములుచాలక
రిప్లయితొలగించండిమచ్చికతోభోజనమ్ము ,మనుగడలేకన్
అచ్చికబుచ్చికలాడుచు
పచ్చడిమెతుకులెమనకిక పరమాన్నమయెన్
వచ్చిరి బంధువు లిద్దరు
రిప్లయితొలగించండితెచ్చిన బిర్యాని వారు తెగ తిన్నరయా
బిచ్చము గా మిగిలినదే
పచ్చడి మెతుకులె మనకిక పరమాన్నమయెన్!!