దత్తపది - జనవరి, మార్చి, మే, జులై (భారతార్థంలో)
గాడేపల్లి కుక్కుటేశ్వర రావు (20వ శతాబ్దం) బాల్యంనుండే పద్యాలను రచించినవాడు. 18 ఏళ్ళ వయస్సులోనే విద్వత్సభలలో అవధానాలను చేసి కీర్తిని పొందాడు. కొప్పరపు సోదరులలో ఒకరి కుమారుడైన కొప్పరపు సీతారామ వరప్రసాద్ ఇతని అవధాన గురువు.31-7-1971 నాడు రాజమండ్రిలో జరిగిన అవధానంలో ఒక పృచ్ఛకుడు "జనవరి, మార్చి, మే, జులై" పదాల నిచ్చి భారతార్థంలో చంపకమాల చెప్పమన్నాడట. దానికి గాడేపల్లి కవి చెప్పిన పద్యం ....
విను విను మార్చి యార్చి, రిపువీరుల నెంతటి మేటి రాజులై
నను రణమేదినిన్ నిలిచి నన్నును నిన్నుఁ దిరస్కరించి మే
నను విజయా! చనం గలరె? నాకును బుట్టుకనుండి నీవునుం
జనవరి వౌటఁ దెల్పితి వెసన్ మఱి లెమ్ము రణమ్ము సేయఁగన్.
నను రణమేదినిన్ నిలిచి నన్నును నిన్నుఁ దిరస్కరించి మే
నను విజయా! చనం గలరె? నాకును బుట్టుకనుండి నీవునుం
జనవరి వౌటఁ దెల్పితి వెసన్ మఱి లెమ్ము రణమ్ము సేయఁగన్.
("తెలుగులో చాటు కవిత్వము" సిద్ధాంతగ్రంథ రచయిత్రి ప్రొ.జి. లలిత గారికి కృతజ్ఞతలతో)
రేడుల లోననే జన వరిష్టుఁడు ధర్మజు; డన్నమాటకున్
రిప్లయితొలగించండితోడుగ నున్న తమ్ములును దుష్టుల మార్చిరి శిక్షణంబుచే.
మేలును గూర్చినారు కడు మేదుర సద్గతిగొల్పి.పాండు భూ
పాలజు లైరి సజ్జనుల పాలిట ధర్మ సమైక్య రూపుగా!
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిభావించి కుక్కుటేశ్వర
రావు రచన మేలటంచు వ్రాసితి నయ్యా!
భావములు రామకృష్ణా
రావు రచనలోఁ గడు మధురములై మించెన్.
ద్రౌపది:
రిప్లయితొలగించండిరీతియె గాదు ఓ జనవరిష్టుడ నీకుఁ! మహాపరాక్రమో
పేతులు తమ్ములై దనర మేషము మీనము లెన్నగానిటన్.
రాతలు మార్చుమా కురువరాగ్రణి! భూమికి రాజులైరిగా
భ్రాతలు మీరలస్త్రములఁ బట్టుట పాడి, యుపక్రమించుడీ!
చాలా బాగున్నాయండీ.
రిప్లయితొలగించండిఘనముగనెవ్వడిందున జగాన సుధామ సుమార్చితుండు నె
రిప్లయితొలగించండివ్వనిఁగని పాండవుల్ వెలిగె వాసిగ పోరున సూర్య తేజులై
అనయము మేలుఁగూర్చి రణమందున కౌరవ సైన్య ధైర్య భం
జన వరివస్యుతుండునగు శ్యామల మూర్తికి పూజ చేసెదన్!!
రవి గారూ,
రిప్లయితొలగించండిచక్కని భావంతో దత్తపదిని పూర్తి చేసారు. బాగుంది. కాని రెండవ పాదంలో యతిదోషం ఉంది. గమనించండి.
రవి గారూ,
రిప్లయితొలగించండిచక్కని భావంతో దత్తపదిని పూర్తి చేసారు. బాగుంది. కాని రెండవ పాదంలో యతిదోషం ఉంది. గమనించండి.
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిదత్తపదికి మీ పరిష్కారం అద్భుతం. ధన్యవాదాలు.
రీతియె గాదు ఓ జనవరిష్టుడ నీకుఁ! మహాపరాక్రమో
రిప్లయితొలగించండిపేతులు తమ్ములై దనర పీచమడంచి యరాతి మూకలన్,
రాతలు మార్చుమా కురువరాగ్రణి! మేదికి రాజులైరిగా
భ్రాతలు మీరలస్త్రములఁ బట్టుట పాడి, యుపక్రమించుడీ!
రవి గారూ,
రిప్లయితొలగించండిఇప్పుడు సరిపోయింది.
శంకరార్యా ! మొదటి పూరణలో ప్రాస ??
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండి‘లడయోరభేదః’ సూత్రం వల్ల ఆ ప్రాస పండితామోదమే. ప్రసిద్ధ పూర్వకవి ప్రయోగా లున్నాయి.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఇంకొంచెం వివరంగా చెబుతారా !