17, జులై 2010, శనివారం

సమస్యా పూరణం - 41

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
సెల్లుఫోను లసత్యముల్ జెప్ప నేర్పె.

10 కామెంట్‌లు:

  1. మాటి మాటికి ఫోనులో మంతనాలు
    తప్పు కొనవలెనన్న యేదారి లేక
    కాన్ఫరెన్సు యుందని చెప్పి కల్ల లాడ
    సెల్లుఫోను లసత్యముల్ జెప్ప నేర్చె

    రిప్లయితొలగించండి
  2. ఘల్లు ఘల్లుమనుచు మ్రోయ సెల్లు ఫోను
    తప్పుకు తిరగగ కుదరదెప్పుడైన
    ఎవనికైన మరి దొరుకు నవని పైన
    స్విచ్చునాపి లేదని పల్కు సిగ్నలచట
    కడకు హరి చంద్రుడైనను కల్లలాడు
    సెల్లుఫోను లసత్యముల్ జెప్ప నేర్పె!!

    రిప్లయితొలగించండి
  3. ప్రేమలో పడ్డ అమ్మాయి ప్రియుడి తోటి
    మాటలాడంగ ఒకనాడు మార్గమేది?
    నేడు చేతిలో సెల్‌ఫోను నిబ్బరంగ
    సెల్లుఫోను లసత్యముల్ జెప్ప నేర్చె!!

    రిప్లయితొలగించండి
  4. హరి దోర్నాల గారూ,
    జిగురు సత్యనారాయణ గారూ,
    నచికేత్ గారూ,
    అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. నా పూరణ -
    కలువ నాసక్తి లేని వారలకు, వేళ
    కాని వేళ నాఫీసరు కలువు మన్న
    నింట నుండియు పొరుగూరు కేగితి నని
    సెల్లు ఫోను లసత్యముల్ జెప్ప నేర్పె.

    రిప్లయితొలగించండి
  6. దినమునకనేక మారులు దీసుకొనుడి
    మా క్రెడిట్టు కార్డులటంచు మదిని రోయ
    జేయు కాల్సుకు చిత్తము జెల్లునట్టు
    సెల్లుఫోను లసత్యముల్ జెప్ప నేర్పె.

    రిప్లయితొలగించండి
  7. చంటి పిల్లలాగ ఎపుడు వెంటనుండు
    వాగ లేమండి, సెల్లుతొ వేగలేము
    ఎల్ల వేళలందు నిజము చెల్ల దందు
    సెల్లుఫోను లసత్యముల్ జెప్ప నేర్పె

    రిప్లయితొలగించండి
  8. రవి గారూ,
    చదువరి గారూ,
    మీ యిద్దరి పూరణలు బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ____________________________________
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
    చేతి లోన చేతిని వేసి - చెప్పనేల ?
    చెవికి యానించి నేమైన - జెప్ప వచ్చు !
    చెలియ మనసును దోచగ - చిత్రమైన
    సెల్లుఫోను లసత్యముల్ - జెప్ప నేర్పె !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  10. వసంత కిశోర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి