29, జులై 2010, గురువారం

సమస్యా పూరణం - 51

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
మోకాలికి బోడిగుండు ముడిపడెను గదా!

15 కామెంట్‌లు:

  1. ఏకాక్షుఁడు; మొరటు కోపి
    ప్రాకటముగ భర్తయయ్యె వర సాధ్వికిలన్.
    నీకిది తగునా బ్రహ్మా!
    మోకాలికి బోడిగుండు ముడిపడెను గదా!

    రిప్లయితొలగించండి
  2. చింతా రామకృష్ణారావు గారూ,
    పూరణ అద్భుతం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. మోకాలిన మెదడుందని
    లోకులు మందులను తిట్ట; లోచింపంగన్
    నాకనిపించును మదిలో
    మోకాలికి బోడిగుండు ముడిపడెను గదా!

    రిప్లయితొలగించండి
  5. చీకాకుతొ పాప యేడ్చెన్
    చీకటి యందున్, చెడు కను సెగ తగిలిందే
    మో కాబోలనె కొందరు
    మోకాలికి బోడిగుండు ముడిపడెను గదా!

    రిప్లయితొలగించండి
  6. శ్రీకాంతునికై మ్రొక్కుగ
    కూకటి నివ్వను తెరువరి కొండల నెక్కెన్.
    మోకాల్నొచ్చె, దిగునపుడు.
    మోకాలికి బోడిగుండు ముడిపడెను గదా!

    రిప్లయితొలగించండి
  7. ఏకీడు సంభవించిన
    నే కుజుడో కారణమను నీ జ్యోతిష్యుల్
    నాకది చదవగ తోచును
    మోకాలికి బోడిగుండు ముడిపడెను గదా!

    రిప్లయితొలగించండి
  8. మా కామాక్షి యేకాక్షి కావున
    యే కాకినైన వెదకి వలచగ యతినేయైనన్
    లోకేశుడు విజ్ఞుడు గనుకనె
    మోకాలికి బోడి గుండు ముడి పడెను గదా ?

    రిప్లయితొలగించండి
  9. మా కామాక్షి యేకాక్షి గావున
    యేకాకి నైన వదలక యతినేయైనన్
    లోకేశుడు విజ్ఞుడు కావున
    మోకాలికి బోడి గుండు ముడి పడెను గదా. ?

    రిప్లయితొలగించండి
  10. హరి దోర్నాల గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు. అయితే "లోచింపంగన్" అనే పదం లేదు. మీరు ఆలోచింపగా అనే అర్థంలో వాడారు. దానిని "లో నరయంగన్" అని మార్చితే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  11. నచికేత్ గారూ,
    భావం మంచిదే. కాని పద్యంలో కొన్ని లోపాలున్నాయి. "చీకాకుతొ" అన్నారు. తో ను తొ అని వ్రాయడం ఈ మధ్య చాలామంది చేసే తప్పు. మొదటి పాదంలో గణదోషం ఉంది. మూడవ పాదంలో "అనె కొందరు" అన్నారు. అనె ఏకవచనం. అది కొందరికి అన్వయించదు. నా సవరణలతో మీ పద్యం...
    చీకాకున శిశువేడ్చెన్
    చీకటియందున్ చెడు కను సెగ తగిలిందే
    మో కాబోలని రందరు
    మోకాలికి బోడిగుండు ముడిపడెను గదా!

    రిప్లయితొలగించండి
  12. నచికేత్ గారూ,
    ఈ పద్యం బాగుంది. అభినందనలు. అయితే "జ్యోతిష్యుల్" తప్పు. జ్యోతిష్యుడు, జ్యోతిష్కుడు అనడం తప్పు. జోస్యుడు, జ్యౌతిషికుడు సరైనవి. మీ పద్యంలో "కారణమను నీ జ్యౌతిషికుల్" అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  13. రాజేశ్వరి నేదునూరి గారూ,
    మంచి భావం, అభినందనలు. పద్యంలో కొన్ని లోపాలున్నాయి. నా సవరణతో మీ పద్యం ....
    కామాక్షియొ యేకాక్షియె
    యేకాకినొ వదలకుండ యే యతినో తా
    లోకేశుడు జత జేసెను
    మోకాలికి బోడిగుండు ముడిపడెను గదా!

    రిప్లయితొలగించండి
  14. కాకా నాయుడు నెండల
    చీకాకని గుండుగొట్టి చీరాలందున్
    కూకొన నేసీ బస్సున
    మోకాలికి బోడిగుండు ముడిపడెను గదా!

    రిప్లయితొలగించండి