8, జులై 2010, గురువారం

సమస్యా పూరణం - 33

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
గొడుగు కలిగి కూడ తడిసినాఁడు.

26 కామెంట్‌లు:

  1. గొడుగు బట్టి వెడలె బుడుతడు బడికిని
    వరద నీటి యందు వర్ష మందు
    చిన్న కారు వచ్చి చిమ్మగా నీటిని
    గొడుగు కలిగి కూడ తడిసినాఁడు.

    రిప్లయితొలగించండి
  2. తడియు మిత్రునొకని దాతృత్వ బుద్ధితో
    అతడు గొడుగు క్రింద కరుగుమనగ,
    కొలది కొలది వాడు గొడుగెల్ల వ్యాపింప -
    గొడుగు కలిగి కూడ తడిసినాడు!

    రిప్లయితొలగించండి
  3. బృంద నాట్య మందు మంద యాడిరి చేత
    గొడుగు కలిగి; కూడ తడిసినాడు (తడిసిన్ + ఆడు)
    చలన చిత్ర నటుఁడు లలన సరసఁ జేరి.
    గొడుగు కలిగి కూడ తడిసినాఁడు.

    కాకతాళీయంగా ఇది నా నూరవ పద్యం.

    రిప్లయితొలగించండి
  4. పూరణలు బాగున్నాయ్ . రవి గారూ, ఇంతింతై అన్నట్టు అప్పుడే శత కృతి కర్తలైపోయారా??

    రిప్లయితొలగించండి
  5. వాన గాలి కలిసి వాయించి వేయగ
    బడుగు జీవి యొకడు గొడుగు తెరువ,
    కమ్ము లన్ని తిరిగె జుమ్ముని వెనక్కు
    గొడుగు కలిగి కూడ తడసినాడు.

    రిప్లయితొలగించండి
  6. వాన గాలి కలిసి వాయించి వేయగ
    బడుగు జీవి యొకడు గొడుగు తెరువ,
    కమ్ము లన్ని తిరిగె జుమ్ముని వెనక్కు
    గొడుగు కలిగి కూడ తడసినాడు.

    రిప్లయితొలగించండి
  7. తడుచుటన్న మిగుల తహతహలాడెడు
    కొడుకు బడికిపోవ గొడుగునీయ
    మలుపు తిరగగానె మడిచి చంకనబెట్టి
    గొడుగు కలిగి కూడ తడిసినాఁడు

    రిప్లయితొలగించండి
  8. సనత్ గారు చెప్పినట్టు ఇంతింతై వృద్ధి చెందారు. పద్యం రవికి సహజంగా అబ్బిన విద్య అనిపిస్తోంది. నూరు పద్యాల రవి, శత సహస్ర కిరణాల రవి కావాలని ఆకాంక్షిస్తూ, అభినందనలతో!

    రిప్లయితొలగించండి
  9. "నీవు వచ్చెదనన నేను వద్దనెదనా?"
    అనుచు వాన తడిసె అతివ యొకతి
    ఆమె తోడ కూడి యాడె నొకడునంత
    గొడుగు కలిగి కూడ తడిసినాఁడు!!

    రిప్లయితొలగించండి
  10. హరి దోర్నాల గారూ,
    పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    డా. ఆచాయ ఫనీంద్ర గారూ,
    "ఇసింటా రమ్మంటే ఇల్లంతా నాదే" అన్నాట్ట! మీ పూరణలో ఆ భావం ప్రతిబింబించింది. ధన్యవాలాలు.

    రవి గారూ,
    ముందుగా నేనిచ్చే "శర పద్య లేఖక" బిరుదును స్వీకరించండి. మీ రిలాగే సహస్రాధిక పద్య లేఖకులు కావాలని మా కోరిక. అదేదో సినిమాలో బాబూ మోహనో, అలీనో పాడిన పాటను గుర్తుకు తెచ్చారు మీ పూరణతో. అభినందనలు.

    సనత్ శ్రీపతి గారూ,
    పూరణలను "ఎంజాయ్" చేస్తున్నందుకు ధన్యవాదాలు.

    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మూడవ పాదంలో "జుమ్మని"కి బదులు "జుమ్ముని" అని పొరపాటున టైప్ అయిందనుకుంటా.

    చదువరి గారూ,
    మీ పూరణ నన్ను బాగా నవ్వించింది. ధన్యవాదాలు. ఇక మీ లాంటివారు ప్రోత్సహిస్తే రవి గారు ఇంకెన్నో పద్యాలతో తెలుగు తల్లిని అలంకరిస్తారు.

    జిగురు సత్య నారాయణ గారూ,
    బాగుంది. సినిమా పేరు గుర్తుకు లేదు కాని ఇది పెంబర్తి రైల్వే స్టాషన్లో చిత్రించిన పాట కదా. పూరణ అదిరింది.

    రిప్లయితొలగించండి
  11. నా పూరణ -

    మతి మరుపుల వాఁడు మార్కెట్టు కేగుచు
    వాన వచ్చు ననుచు భార్య చెప్ప
    సరి సరి యని పలికి మరచెను; తన యింట
    గొడుగు కలిగి కూడ తడిసినాఁడు.

    రిప్లయితొలగించండి
  12. నా పూరణ -

    మతి మరుపుల వాఁడు మార్కెట్టు కేగుచు
    వాన వచ్చు ననుచు భార్య చెప్ప
    సరి సరి యని పలికి మరచెను; తన యింట
    గొడుగు కలిగి కూడ తడిసినాఁడు.

    రిప్లయితొలగించండి
  13. చేత నుండె గొడుగు చిన్నదైనను మెండె,
    చిట్టి దొక్క ప్రక్క చిందు ద్రొక్కు
    చుండె, దాన్ని తడియకుండ చూడనిలిచి
    గొడుగు కలిగి కూడ తడిసినాడు

    రిప్లయితొలగించండి
  14. గిరి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. ఈ రోజు పూరణలన్నీ భేషుగ్గా ఉన్నాయి. ఆచార్య ఫణీంద్ర గారి పూరణ (ముఖ్యంగా మూడవ పాదం) చదివి నవ్వుకుంటుంటే, పొద్దున ఆఫీసు వాళ్ళు విచిత్రంగా చూశారు.

    శంకరయ్య గారు: రెండు దోసిళ్ళతో స్వీకరించాను. :-)

    శ్రీపతి గారు, చదువరి గారు: నూటిలో నలభై శాతం పెద్దలు తప్పులు దిద్దినవే. :-)

    చదువరి గారు, మీవంటి సహృదయుల ప్రోత్సాహము, మిత్రుల అండ, పెద్దల ఆశీస్సులే రాయిస్తున్నాయి. ముఖ్యంగా మా గురువులు చింతా రామకృష్ణారావు గారిని మరువలేను. ఎన్నిసార్లు తప్పులు వ్రాసినా విసుక్కోక, మందబుద్ధికి నేర్పించి పద్యాలు వ్రాయించారు.

    రిప్లయితొలగించండి
  16. రవి గారూ,
    అచ్చు తప్పు .. మీ కిచ్చిన బిరుదు "శతపద్యలేఖక" .... ఈ బిరుదు మీరు ఇంకొక్క పద్యం రాసే వరకే. వెంటనే బిరుదును ఉపసంహరిస్తాము. "సహస్ర పద్య లేఖక" బిరుదు మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీదే ఆలస్యం :-)

    రిప్లయితొలగించండి
  17. తడిసి నంతనె చూడగ తరుణి సొగసు
    నడక తడబడె కనులు నిలుప లేక
    గుటక వేయుచు పిలువగ గొడుగు నీడ
    గొడుగు కలిగి కూడ తడిసి నాడు. "

    క్షమించాలి తమరి అభి మానమునకు ధన్య వాదములు నేను నేర్చు కుంటున్నాను.ఇది కుడ ఎక్కువ తప్పులున్న ఎడల ప్రచు రించ వలదని మనవి

    రిప్లయితొలగించండి
  18. రాజేశ్వరి గారూ,
    మంచి ప్రయత్నం. అయితే 1, 3 పాదాలు తేటగీతి. సమస్య ఆటవెలదిలో ఉంది. మీ పద్యాన్ని ఇలా సవరించాను.
    తడిసినంత జూడ తరుణి సౌందర్యమ్ము
    నడకతోడ చూపు తడబడె నదె
    గుటక వేసి పిలువ గొడుగు నీడ కరుగ
    గొడుగు కలిగి కూడ తడిసినాడు.

    రిప్లయితొలగించండి
  19. రవిగారూ!
    శత పద్యాలు పూర్తి చేసినందుకు ముందుగా అందుకోండి మా అభినందనలు.

    అందరి పూరణలు చాలా బాగున్నాయి. శంకరయ్య గారూ,అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    _____________________________________

    కొత్త గొడుగు కొన్న - కోదండ రామయ్య
    కొంగు చాటు దాచి - కొత్త గొడుగు
    కోమలములు కురియ - కోరి దా పరుగెత్తె !
    గొడుగు కలిగి కూడ - తడిసినాఁడు !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  21. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ఈ మధ్యే ఒక వీడియో చూసాను. అందులో గొడుగు లమ్మేవాడు గొడుగుకు 50 సంవత్సరాల గ్యారంటీ ఇస్తాడు. కండిషన్ ఏమంటే గొడుగును ఎండకు తెరవవద్దు, వానలో తడవనీయవద్దు. మీ పద్యం ఆ వీడియోను గుర్తుకు తెచ్చింది.

    రిప్లయితొలగించండి
  22. గొడుగు నిచ్చి తల్లి బుడుగును బడికంపె
    వాన రాగ దారి లోన తాను
    పడవ జేసి యాడి పడిపడి చిందేసి
    గొడుగు కలిగి కూడ తడిసినాఁడు.

    రిప్లయితొలగించండి
  23. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ముచ్చటైన (పిల్లలు చేష్టలు ముచ్చటగానే ఉంటాయి కదా!) పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ "గొడుగు నిచ్చి తల్లి బుడుగును బడికంపె"
    పూరణ కళ్ళకు కట్టినట్లు బాగా పూరించారు.

    రిప్లయితొలగించండి
  25. శంకరార్యా ! లక్కరాజు గారూ ! ధన్యవాదములు..
    మీ ప్రోత్సాహము మరువలేనిది.

    రిప్లయితొలగించండి