నేదునూరి రాజేశ్వరి గారూ, భావంలో ఎదో అస్పష్టత ఉంది. అయినా ఫరవాలేదు. నేను సమస్యనే కందంగా మారుస్తున్నా. మీ పద్యంలో గణదోషాలున్నాయి. నేను ఇలా సవరించాను. పురవీథుల పలు స్వాములు నరమేధము సేయ జనుల నమ్మికతోడన్ వరముల నీయఁగ నలువలు నరుఁడే నారాయణుండ నని నమ్మించెన్.
భ్రమర కీటము పగిదిని భక్తుడొకడు
రిప్లయితొలగించండితాను తాదాత్మ్యమును పొంది దైవమందు;
తానె దైవత్వమునుపొందె తత్పరతను.
నరుఁడె నారాయణుఁడ నంచు నమ్మఁ బలికె.
నారదునితో గయుడు :
రిప్లయితొలగించండిద్వైత వని నన్ ప్రపన్నుగఁ బంపఁబోకు
శ్వేతవాహను శరము నా శిరముఁ ద్రుంచు
నర్జునుఁడె కృష్ణుఁ గృతి దీర్పునంచు గయుడు
నరుడె నారాయణుండని నమ్మఁబలికె
తీరా పూరణ వ్రాసుకున్నాక చూసాను మీ సమస్య 'నరుడె నారాయుణఁడ నంచు నమ్మఁ బలికె' అని ఉందని. వీలు దొరికితే క్రొత్త పూరణ పంపుతాను.
ఇంద్ర జాలపు ట్రిక్కులు ఎరుగనేర్చి
రిప్లయితొలగించండిపిదప వేదాంత సాహిత్య వివర మెరిగి
జనుల నాకట్టు కొను పదజాల మరసి
నరుఁడె నారాయణుఁడ నంచు నమ్మఁ బలికె.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపురవీధుల స్వాములు పలువురు
రిప్లయితొలగించండినరమేధము చేయుచుండ జనులను నమ్మిక తోడన్
వరముల నీయగ నలువలు
నరుఁడె నారాయణుఁడ నంచు నమ్మఁ బలికె
నిజానికది " కందము కాదని తెలిసినా " రవిగారు వ్రాసారని నేను రాసాను వారు తొలగించారు మరి నేను ? పోనీలెండి నేనేది రాసినా తప్పులె వస్తాయికదా ! ఇది మరొకటి
రిప్లయితొలగించండిచింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిపూరణ అద్భుతం. ధన్యవాదాలు.
గిరి గారూ,
రిప్లయితొలగించండిసమస్య విషయంలో పొరబడ్డా మంచి పద్యాన్ని అందించారు. ధన్యవాదాలు.
నేదునూరి రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండిభావంలో ఎదో అస్పష్టత ఉంది. అయినా ఫరవాలేదు. నేను సమస్యనే కందంగా మారుస్తున్నా. మీ పద్యంలో గణదోషాలున్నాయి. నేను ఇలా సవరించాను.
పురవీథుల పలు స్వాములు
నరమేధము సేయ జనుల నమ్మికతోడన్
వరముల నీయఁగ నలువలు
నరుఁడే నారాయణుండ నని నమ్మించెన్.
నా పూరణ -
రిప్లయితొలగించండిఎచటినుండి యేతెంచెనో యెవరి కొడుకొ
తెలియ దెవరికి; షిరిడీని వెలసి తనదు
మహిమలను జూపె సాయి జనహితకరుఁడు
నరుఁడె నారాయణుఁడ నంచు నమ్మఁ బలికె.
వేలి కొసలనుండి విభూతి రాలి పడెను
రిప్లయితొలగించండిఉదర మందుండి లింగాలు ఉబికి వచ్చె
జనుల నాకట్ట కనికట్లు చాల జేసి
నరుఁడె నారాయణుఁడ నంచు నమ్మఁ బలికె
చదువరి గారూ,
రిప్లయితొలగించండిమంచి పూరణ. అభినందనలు.
అమరిన దీపముల్ వెలిగి యందము చిందగ నింటియింటనున్
రిప్లయితొలగించండికొమరులు కూతులందరును గూడును చేరిన సండందునన్
తిమిరము పార ద్రోలెడిది దివ్వెల పండుగ ఢాముఢాములం
దమవస నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే