15, జులై 2010, గురువారం

గళ్ళ నుడి కట్టు - 10


అడ్డం
1. "చందమామ" వాళ్ళు నడిపిన సినిమా పత్రిక. ఆ కాలంలో చిత్ర విజయాలకు కారణమయిందా? (5)
4. వామ భాగం - మడమ కాదు (3)
6. నల దమయంతుల మధ్య రాయబారం నడిపిన మానస సరోవర పక్షి (2)
7. తడి, వాడి - పద! నువ్వు తడుస్తావేమో? (3)
8. అడుగు - పదమే తిరగబడింది (2)
11. ముద్దార నేర్పిస్తే వీళ్ళు నేర్వని విద్య కలదా అని ఒక కవి చెప్పాడు (4)
12. చేది రాజు - భీముని దెబ్బకు కీచుమన్నాడు (4)
14. పిచ్చి - ఈ శంకరయ్య నేను కాదు, ఎన్.టీ.ఆర్ (2)
15. 24 నిమిషాల పాటు తలుపులు తెరవకుండా అది వేస్తే ఎలా? (3)
16. చూస్తా మీ సంగతి అంటూ మెలిపెట్టేది (2)
20. గద్య ప్రబంధం అన్నారు కాని ఇంగ్లీషు పేరే స్థిరపడింది ఈ సాహిత్య ప్రక్రియకు (3)
21. చురుకైన బుద్ధి కలవాడు - కుశుని అగ్రజునికి ఇది ఉందా? (5)
నిలువు
1. పెండ్లి - వివాదం వద్దు. దీనితో విద్య నాశనమట! (3)
2. యాగం (2)
3. పదమూడవ తిథి (4)
4. పక్షులు, జలచరాల ఆహారం - దీన్ని ఎరగరా? (2)
5. భూమిని పాలిచేవాడు - మరీ హీనంగా పాలించేవాడా?
9. వాన కోయిల - చెప్పడం చాతకాదా? (3)
10. మాట - గద్యం అనికూడ అంటారు (3)
11. సత్యభామ చేత కృష్ణున్ని తన్నించిన ఈ కవికి ముక్కుపొడుం కావాలా? (5)
13. పిడికిట పట్టే చిన్న కత్తి (4)
17. పరిపూర్ణ జ్ఞానం. కనీసం బుద్ధి లేదంటారా? (3)
18. ప్రేమ - దీనిలో పడుచువారు పడతారు, చేపలూ పడతాయి (2)
19. గృధ్రం - తలక్రిందులయింది. కాకుల్ని కొట్టి దీనికేద్దామా?

16 కామెంట్‌లు:

  1. అడ్డం: 1.విజయచిత్ర, 4.ఎడమ, 7.పదను, 8.దంపా, 11.ముదితలు, 12.కీచకుడు, 14.తిక్క, 15.గడియ, 16.మీసం,20.నవల, 21.కుశాగ్రబుద్ధి
    నిలువు:1.వివాహం, 2.యజ్ఞం, 3.త్రయోదశి, 4.ఎర, 5.మహీపాలుడు,9.చాతకం,10.వచనం/వాచకం(?),11.ముక్కుతిమ్మన, 13.పిడిబాకు, 17.సంబుద్ధి,18.వల, 19.ద్దగ్ర

    రిప్లయితొలగించండి
  2. అడ్డం
    1.విజయచిత్ర 4.ఎడమ 6.హంస 7.పదను 8.టపా (పాట తిరగబడింది) 11.ముదితలు 12.కీచకుడు 14.తిక్క 15. గడియ 16.మీసం 20.నవల 21.కుశాగ్రబుద్ధి
    నిలువు
    1.వివాహం 2. యజ్ఞం 3.త్రయోదశి 4.ఎర 5.మహీపాలుడు 9.చాతకా (కం)? 10.వచనం 11.ముక్కుతిమ్మన 13.పిడిబాకు 17.సంబుద్ధి 18.వల 19.ద్దగ్ర (గ్రద్ద తలకిందులైంది)
    ఒక సందేహం సార్:12 అడ్డం; చేది రాజు శిసుపాలుడు కదా, ఇక్కడ ఆధారానికి కీచకుడు సరిపోయింది. కరక్టా కాదా చెప్పగలరు.9 నిలువు కూడా చాతక/కా అని రాస్తే చాలా చాతకం అని ఉండాలా?
    subhadra/praseeda

    రిప్లయితొలగించండి
  3. అడ్డము:
    1. విజయచిత్ర, 4. ఎడమ,6. హంస, 7. పదను, 8. దంపా(పాదం), 11. ముదితల్, 12. కీచకుడు, 14. తిక్క, 15. పిడిబాకు, 16. మీసం, 20. నవల, 21. కుశాగ్రబుద్ది.
    నిలువు:
    1.వివాహం, 2. యజ్ఞం, 3. త్రయోదశి, 4. ఎర, 5. మహీపాలుడు, 9. చాతక, 10. వచనం, 11. ముక్కుతిమ్మన, 13. పిడిబాకు, 17. సంబుద్ది, 18. వల, 19.ద్దగ్ర(గ్రద్ద).

    రిప్లయితొలగించండి
  4. అడ్డం:1.విజయచిత్ర 4.ఎడమ 6.హంస 7.గొడుగు 8.దంపా 11.ముదితలు 12.కీచకుడు 14.తిక్క 15.గడియ 16.మీసం 20.నవల 21.కుశాగ్రబుద్ది
    నిలువు: 1.వివాహం 2.యజ్ఞం 3.త్రయోదశి 4.ఎర 5.మహీపాలుడు 9.చాతక 10.వచనం 11.ముక్కుతిమ్మన 13.పిడిబాకు 18.వల 19.ద్దగ్ర

    రిప్లయితొలగించండి
  5. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
    ఆల్ కరెక్ట్. అభినందనలు. అడ్డం 6 సమాధానం టైపు చేయడం మరిచిపోయారు.

    రిప్లయితొలగించండి
  6. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    ఒక్క తప్పుతో పూరించారు. అదికూడ పొరపాటున ఒకదానికి మరొకటి టైప్ చేసి ఉంటారు. అభినందనలు. అడ్డం 15 ఒకసారి చూడండి.

    రిప్లయితొలగించండి
  7. అనూ గారూ,
    "గళ్ళ నుడి కట్టు"కు స్వాగతం.
    అడ్డం 7 తప్పు. నిలువు 17 సమాధానం ఇవ్వలేదు. ఒకసారి పరిశీలించండి.

    రిప్లయితొలగించండి
  8. అడ్డం
    1. విజయచిత్ర 4. ఎడమ 6.హంస 7. పదను 8. టపా ( పాట తిరగబడింది) 11. ముదితలు 12. కీచకుడు 14. తిక్క 15. గడియ 16. మీసం 20. నవల 21. కుశాగ్రబుద్ధి
    నిలువు
    1. వివాహం 2. యజ్ఞం 3. త్రయోదశి 4. ఎర 5. మహీపాలుడు 9. చాతక (కం?) 10. వచనం 11. ముక్కుతిమ్మన 13. పిడిబాకు 17. సంబుద్ధి 18.వల 19. ద్దగ్ర (గ్రద్ద తిరగబడింది)
    12 అడ్డం ; చేది రాజు శిశుపాలుడు కదా, మరి క్లూ కీచకుడికి సరిపోయింది. అలాగే 9 నిలువు చాతక అంటే సరిపోతుందా? చాతకం అనాలా?
    నేను పొద్దున్నే 7 గంటలకే సమాధానం పంపించాను.. మీకు చేరలిందా లేదా తెలుపగలరు, అందుకే మళ్ళీ పంపుతున్నాను.

    రిప్లయితొలగించండి
  9. అడ్డం:1.విజయచిత్ర,4.ఎడమ,6.హంస,7.పదను,8.దంపా,11.ముదితలు,12.కీచకుడు,14.తిక్క,15.గడియ,16.మీసం,20.నవల,21. కుశాగ్రబుద్ధి
    నిలువు:1.వివాహం,2.యజ్ణం,3.త్రయోదశి,4.ఎర,5. మహీపాలుడు, 9.చాతక, 10.వచనం,11.ముక్కుతిమ్మన, 13.పిడిబాకు, 17.సంబుద్ధి, 18.వల,19.ద్దగ్ర
    -విజయ జ్యోతి.

    రిప్లయితొలగించండి
  10. విజయ జ్యోతి గారూ,
    ఆల్ కరెక్ట్! అభినందనలు. అయితే మీరు తెలుగు టైప్ లేఖినిలో చేస్తున్నారో లేక బరహాలోనో కాని అక్షరదోషాలు ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  11. ప్రసీద గారూ,
    మీ రెండు టపాలు చేరాయి. నేను చూడడమే కాస్త ఆలస్యమయింది.
    ఒక్క తప్పుతో గడిని పూర్తి చేశారు. అభినందనలు. అడ్డం 8 తప్పు.
    ఇక చేది రాజు శిశుపాలుడే. నా తప్పును గుర్తించినందుకు ధన్యవాదాలు. సరి చేస్తాను.
    పదాలు ఏదో ఒక ప్రత్యయంతో ఉండాలి కదా. "వదన" అంటే సరిపోతుందా? వదనము (గ్రాంధికం), వదనం (శిష్ట వ్యావహారికం). నేనిచ్చే పదాలు ఎక్కువగా వ్యవహారికంలోనే ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా "ము" ప్రత్యయంతో సమాధానం కోరితే ఆ విషయాన్ని ఆధారంలోనే "హింట్' ఇస్తాను.

    రిప్లయితొలగించండి
  12. గడి 10 = అడ్డం = 1.విజయ చిత్ర.4.ఎడమ.6.హంస.7.పదయు.8.దంపా.11.ముదితలు.12.కీచకుడు 14.తిక్క15.వేడిగ.16.మీసం.20.నవల.21.కుశాగ్రబుద్ధి.
    నిలువు = 1.వివాహం.2.యజ్ఞం.3.త్రయోదశి.4.ఎర [చాప ] 5.మహిపాలుడు.9.చాతకం.10.వచనం.11.ముక్కుతిమ్మన.13.పిడిబాకు.17.సంబుద్ధి.18.వల.19.ద్ధగ్ర [గ్రద్ధ ]

    రిప్లయితొలగించండి
  13. 1)విజయ చిత్ర ,4)ఎడమ ,6)హంస ,8)దంపా (పాదం),11)ముదితలు ,12)కీచకుడు ,14)తిక్క ,15)గడియ ,16)మీసం ,20)నవల,21)కుశాగ్రబుధ్ధి
    -------------------------------------------
    1)వివాహం ,2)యజ్ఞం,3)త్రయోదశి ,4)ఎర,5)మహీపాలుడు ,9)చాతకం ,10)వచనం ,11)ముక్కు తిమ్మన ,13)పిడిబాకు ,17)సంబుద్ధి,18)వల ,19)ద్దగ్ర (గ్రద్ద)

    రిప్లయితొలగించండి
  14. నేదునూరి రాజేశ్వరి గారూ,
    అడ్డం 7,15 మళ్ళీ ప్రయత్నించండి.

    రిప్లయితొలగించండి
  15. సాయి ప్రవీణ్ గారూ,
    అడ్డం 7 సమాధానం ఇవ్వలేదు. మిగతావన్నీ కరెక్టే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. అన్నీ రాసాననే అనుకున్నానండి. ఎలాగో మిస్ అయింది.
    7) పదను

    రిప్లయితొలగించండి