2, డిసెంబర్ 2012, ఆదివారం

పద్య రచన - 178

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. యమునా నదీ సమీపమునందు దనరారు
    ....పచ్చిక బీడుల వద్ద జేరి
    గోవుల వత్సల గోపాలురను గూడి
    ....బలరామ కృష్ణులు బాల్యమందు
    ప్రకృతి శోభల లోన పరవశమ్మొందుచు
    ....నాట పాటలలోన నలరుచుండ
    వీనుల విందుగా గానమ్ము నొనరింప
    ....పిల్లనగ్రోవితో నల్లనయ్య
    నృత్యమాడ దొడగె నీలకంఠంబులు
    హర్షమున జెలంగె నాలమంద
    లా విధమ్ము జూడ నానంద మొప్పారు
    వడిగ జాలువారు పద్య ధార

    రిప్లయితొలగించండి
  2. బాల గోపాల! నీ పాదకమలములు
    నడయాడు నేలను నాదు కనుల
    గంటినే! నేడు నా కనులభాగ్యములిట్లు
    ఫలియించె నయ్యరొ! పంకజాక్ష!
    గోవుల బాలించు కూర్మితో ననునింక
    పాలింపు జగదీశ! పరమపురుష!
    వేణు గానమ్మును వినిపించి పరవశ
    మును నింపు కృష్ణయ్య! మోదమంది

    నీదు మ్రోలనె ప్రాణము నెమ్మదిగను
    విడిచి నీలోన చేరుదు వేదవేద్య!
    కరుణ నింత జూపగదయ్య! కమలనేత్ర!
    మొఱను వినరాగదే చిన్నిముద్దుకృష్ణ!

    రిప్లయితొలగించండి
  3. ఆల మందలు బచ్చిక యాహరించ
    గోప బాలురు జక్కగ గుమ్మి గూడి
    యాట లాడుచు నుండిరి యయ్య దునన
    కృ ష్ణు జుట్టును దిరిగిరి గొల్ల వారు

    రిప్లయితొలగించండి
  4. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము చాల మంచి భావముతో అలరారుచున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. లక్ష్మీ దేవి గారూ మీ భావ జాలానికి జోహారు!
    మీ స్ఫూర్తి తో నేను........

    పసుల కాపరి వీవు పసు పతియును నీవు
    ..................పసు లక్షణమ్ముల మసల నీకు.
    శిఖి పింఛ మౌళివి శిఖ పట్టుకొని నీవు
    .................చెడు దారి బోకుండ శిక్ష నిమ్ము.
    వేణుగాన విలోల వేవేల రాగముల్
    .................నీవి గానివి జేర నీకు నన్ను.
    గోపాల బాలకా గోపాలురను వోలె
    .................స్నేహమ్ము నీతోడ చేయ నిమ్ము.


    యమున యొడ్డున పున్నమి యామిని నను
    నీదు చెంతను పులకింప నిమ్ము కృష్ణ!
    మధుర బృందావనీ సీమ మధుపముగను
    పుట్టి నీ పాద పద్మాల మురియ నిమ్ము.


    రిప్లయితొలగించండి
  6. వేణు గోపాలుఁ గానము వినిన నచట
    నెమలి పురివిప్పులావుల నెమరు లయలు
    తరుల పరవశ ఫలములు విరివిఁబండ
    యమున జలపాత పరవళ్ళు విమల ఝరులు
    రెప్ప వేయుట మఱిపించు లీల లవియె!

    రిప్లయితొలగించండి
  7. ధన్యురాలను.
    అందరి పద్యములూ మిక్కిలి శోభతో మురిపించుచున్నవి.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. పచ్చిక బీడుల నడుమను
    ముచ్చటగా యాట లాడి మోదము చెందన్ !
    తెచ్చిన చల్దులు పంచుకు
    నిచ్చగనే తినెద రంత నీప్సిత మిడగా !

    రిప్లయితొలగించండి


  9. కననీయెశోభలు కలబోసినట్టుల
    వనిలోన నొకచోట దనరియుండ
    వెన్నుండు నన్నయు చెన్నుమీరుచునుండ
    నటజేరి సఖులతో నాటలాడు
    దృశ్యమ్మదెంతయు దివ్యదర్శనమాయె
    ఫలములు ,గోవులు, పక్షితతియు ,
    ప్రకృతియంతయు మోహపారవశ్యముజెంద
    వేణుగానమ్మున విందుజేయ
    మధురలహరియై వినిపింప మరలచూచి
    సురలు,కిన్నరుల్ దివినుండి చూచితరలి
    కమలనయనునదృశ్యులై కాంచిరంట
    బాలకునివోలె నటియించు పరమపురుషు.





    రిప్లయితొలగించండి




  10. నీ తెలికన్నులందు ,నవనీలకనీనికలందు,మెత్తనౌ,
    లేతగులాబి పూపెదవి ,లీలగదోచెడి మందహాసమే
    దోతెలియంగరాని మధురోహల రేపి తపింపజేయు మా
    చేతములుల్లసిల్లు ,తులసీవనమాలి
    ,సరోజవీక్షణా .

    రిప్లయితొలగించండి
  11. నల్లని వాడగు కృష్ణుడు
    అల్లరి తానాపి రాగ మాలాపింపన్
    పిల్లన గ్రోవిని, వినుచును
    ఎల్లరు మరి మేను మరచు నిలనే మరచున్.

    రిప్లయితొలగించండి
  12. గోకులంలో కృష్ణుడిపై మనోహరమైన పద్యాలను అందించిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    మిస్సన్న గారికి,
    సహదేవుడు గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    కమనీయం గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి