16, డిసెంబర్ 2012, ఆదివారం

పద్య రచన - 192

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. బొజ్జ గణపయ్య మాకైన యొజ్జ వీవు
    విద్య లొసగుము దానితో వినయమిమ్ము
    తీతు గుంజీలు నీ ముందు ప్రీతి తోడ
    తప్పులెంచకు మామీద దయను జూపు.

    రిప్లయితొలగించండి
  2. శ్రీమన్మహాదేవపుత్రా! నగేశాత్మజా ప్రేమపాత్రా! గజాధీశ వక్త్రా! దయాపూర్ణ నేత్రా! లసద్భవ్య గాత్రా! గణేశా! సురేశాది దేవ వ్రజస్తుత్య చారిత్ర! సర్వోపకారీ! మహావిఘ్నహారీ! చిదానంద! లంబోదరా! ఏకదంతా! ప్రశాంతా! శుభాకార! ఓంకార వాచ్యా! గుణాతీత తత్త్వా! మహాసత్త్వ! విద్యాప్రదాతా! కవీనాంకవీ! ఆదిపూజ్యా! యటంచున్ స్మరింతున్ వ్రతంబుల్ పొనర్తున్ భజింతున్ సదా నీదు పాదంబుజాతమ్ములన్ మూష వాహా! మహాసిద్ధి దాతా! రసాఢ్యంబులౌ భక్ష్య భోజ్యాదులం దెచ్చి నైవేద్యముల్ చేయుదున్ స్తోత్రముల్ చేసి సర్వోపచారమ్ములన్ వేడ్కతో జేయుదున్ స్వామి! నీ ముందు నే దండముల్ వెట్టుదున్ హారతుల్ పట్టుదున్ మంత్రపుష్పాలతో నిన్ను గీర్తించుదున్
    నాదు పాపమ్ములన్ బాపుమా కష్టముల్ దీర్పుమా సౌఖ్యముల్ గూర్పుమా యంచు గుంజీలు నే దీయుదున్ స్వామి! కైలాస శైలేంద్రవాసా! స్ఫురన్మందహాసా! నమస్తే నమస్తే నమః

    రిప్లయితొలగించండి
  3. బొజ్జ గణపయ్య ! యుండ్రాళ్ళు బోసి నీకు
    ధూప దీపంబు లారతు లొప్పు గాను
    నోలి నిడుదును మఱియును నుల్ల మలర
    తీ తు గుంజీలు నో సామి ! ప్రీ తి జూడు

    రిప్లయితొలగించండి


  4. శ్రీ గణాధిప మ్రొక్కెద చిత్తమలర
    పరమభక్తితో గుంజీలు పదులు తీసి
    నాదు కోర్కెల దీర్పు ప్రణామములను
    గైకొనుమ దేవదేవ విఘ్నాధిరాజ.

    రిప్లయితొలగించండి
  5. విఘ్న నాయక! మ్రొక్కెద వినయ మొప్ప!
    వంగి గుంజిల్లఁ దీసెద! వరము లిడవె!
    గురువు బోధలు చెవికెక్కు గరిమ నొసగి
    విఘ్నముల బాపు కార్యాల విజయ మంద!

    రిప్లయితొలగించండి
  6. కోరికలను దీర్చు గుజ్జువేలుపు మీకు
    ఐదును పదిసేయ హరుని కొడుకు !
    కొంత ఫలము నిచ్చు గుంజిళ్ళు తీసిన
    వలెను చిత్తశుద్ది భక్తులార !

    రిప్లయితొలగించండి
  7. మాగతకాలమంతయును మాకొఱకై వినియోగబెట్టి శా
    స్త్రాగమమెల్ల వీడియడియాశలవెంటఁజరించి ఖిన్నుడై
    రోగములంద్రుకృంగిభవరోగమునందు విరక్తిఁబొందితిన్
    ఓగణనాయకా!శరణమోయని మ్రొక్కెద దారిఁజూపుమా.

    మాకొఱకై = మాకొరకు, ధనముకొరకు

    రిప్లయితొలగించండి


  8. శ్రీగణాధిప మ్రొక్కెద చిత్తమలలర
    పరమభక్తితో గుంజీలు పదులు తీసి
    నాదు కోర్కెల దీర్చు ప్రణామములను
    గైకొనుమ దేవదేవ విఘ్నాధిరాజ.

    రిప్లయితొలగించండి
  9. దండములయ్య! నీకు పలు తప్పులు జేయుచునుంటి మత్త వే-
    దండముఖా! క్షమించు నను దాసుడ నయ్య! వహించి కోపమున్
    దండన సేయ కయ్య! భవ తాపములన్ భరియింప నాకు నీ
    దండ యవశ్యమయ్య! వరదా! శివపుత్ర! వినాయకా! సదా.

    రిప్లయితొలగించండి
  10. మిత్రులందరి పూరణలు నలరించుచున్నవి. అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. గుడికి బోయి మనము గుంజీలు తీయగ
    మెచ్చి గణప తేమొ నిచ్చు వరము
    మూషిక మది జూచి ముసి ముసి నవ్వుల
    తోక ముడుచు కొనెను తుంట రెలుక

    రిప్లయితొలగించండి
  12. ‘దాసుని తప్పులు దండముతో సరి!’ అన్నట్టు గుంజిళ్ళు అంటే ఇష్టపడే వినాయకుని చిత్రాన్ని చూచి స్పందించి మంచి పద్యాలు వ్రాసిన కవిమిత్రులు...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిన నేమాని వారికి (వీరు వ్రాసిన దండకం భక్తజనోపయోగంగా ఉంది),
    సుబ్బారావు గారికి,
    కమనీయం గారికి,
    సహదేవుడు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    మిస్సన్న గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి