17, డిసెంబర్ 2012, సోమవారం

పద్య రచన - 193

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. అడవులన్నిటి నరుడేమొ హతము జేయ
    మోదమే లేక నారణ్య రోదనాయె
    అడవి వీడెను సింగంబు లడలి పోయి
    మార్గమేలేక జనుచుండె మార్గ మందు

    రిప్లయితొలగించండి
  2. పంచాస్యముల కుటుంబం
    బంచిత గతి ఠీవి మెరయ నరుగుచు నుండెన్
    మంచి రహదారిపై నదె
    కాంచితి చిత్రమున బళిర కనువిందు కదా!

    రిప్లయితొలగించండి
  3. ఈ చిత్రము చూస్తే ఆ సింహాలు మా యింటి ముందటే ( హ్యూగో లో ) తిరుగాడుతున్నట్లనిపించింది. ఈ సాయంకాలము శునక పరిమాణములో నున్న ఒక పెద్ద పిల్లిని చూసాము వాటిని బాబ్ కాట్స్ అంటారు.


    విహగ గణముల రవముల నహముఁ జూతు
    హరిణ చయముల గమనము లన్ను గాంతు
    నింటి వెనుక సృగాలపు నింపు గనగఁ
    జెలువ మూరించె ముంగిటిన్ సింహ త్రయము !

    రిప్లయితొలగించండి
  4. జూలుగలిగిన ముఖమును
    జాల గనదలచి, మృగేంద్రు జతగూడుటకై
    బేలగు ముఖమును గొనుచును
    గాలించుచు నీ సివంగి కదిలెను చెలితో.

    రిప్లయితొలగించండి
  5. విపిన మందుండు తమ కూన వెంట రాగ
    చూడు డ ల్ల దె సింహముల్ రెండు నచట
    వచ్చు చున్నవి ముందుకు విచ్చల విడి
    నెవరి యాయువు మూ డె నో నెవరి కె ఱు క ?

    రిప్లయితొలగించండి
  6. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, డిసెంబర్ 17, 2012 12:45:00 PM

    తల్లిదండ్రు లనవరతము నేక దేహులై
    సంచరించుచుండ సంతసమున
    మార్గ మదియె యైన మాన సుతుండిట
    విడివడి నడచుటయె వింత గనర!

    రిప్లయితొలగించండి
  7. బుడిబుడి నడకల నడుగిడి
    గుడిగుడిగా నరుగుదెంచు కూనను గనుచున్
    వెడలిన సింగంబు లిరువురు
    విడువక వెన్నంటి యుండు విధమును గనుమా !

    రిప్లయితొలగించండి
  8. యిడుముల బడవేసి మనల
    నడవులపై దండయాత్ర నరులకు మోదం !
    బడయగ నరికిరి వనములు
    పిడికెడు జాలైన లేక పెను భూతము లై !

    రిప్లయితొలగించండి
  9. శాతుడను పేరు గలిగియు
    శాత వాహనుని పేర శకమే వెలయన్ !
    ప్రీతీగ నుండెడి మనలను
    నీతియె లేనట్టి జనులు నిడుముల ద్రోసెన్ !

    రిప్లయితొలగించండి
  10. రోడ్డెక్కిన సింహాల చిత్రాన్ని చూసి స్పందించి వైవిధ్యమైన పద్యాలను రసవత్తరంగా చెప్పిన కవిమిత్రులు....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    గన్నవరపు వారూ,
    ‘గమనము లన్ను..’ అనేది ‘గమనంపు టన్ను...’ అయితే..?
    *
    లక్ష్మీదేవి గారూ,
    మొదటి పాదంలో ఒక లఘువు తగ్గింది. ‘జూలును గలిగిన ముఖమును’ అందామా?
    *
    సుబ్బారావు గారూ,
    రెండవ పాదంలో యతి తప్పింది. ‘చూడు డ ల్ల దె సింహముల్ మూడు కలసి’ అందాం.
    *
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మొదటి పాదంలో గణదోషం ఉంది. ‘తల్లిదండ్రు లెపుడు తా మేకదేహులై’ అందాం. మూడవ పాదంలో ‘మాన’కు అన్వయం కుదరడం లేదు. ‘మార్గమదియె యైన మఱి యా సుతుండిట’ అందామా?
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    జంతువలను ఇరువురు అనవచ్చా. ‘సింగపు జంటను’ అందామా?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    యడాగమంతోనే పద్యాన్ని ప్రారంభించారు. ‘ఇడుముల’ అనవచ్చుకదా!

    రిప్లయితొలగించండి
  11. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండవ పూరణలోని భావం అర్థం కావడం లేదు. రెండవ పాదంలో గణదోషం.

    రిప్లయితొలగించండి




  12. అయ్యదొక జంతుసంరక్షణాటవీస్థ
    లమ్ము కాబోలు ,దారిలో నెమ్మదిగను
    సింగపు కిశోరమున్ ,దో సివంగు లచట
    నడచి వచ్చుచు నున్నవా నందముగను.

    రిప్లయితొలగించండి
  13. నిజమే గురువు గారూ !
    “ వెడలిన సింగంబుల జత" అంటే సరిపోతుందేమో !

    రిప్లయితొలగించండి
  14. కూన తమను వీడి గొనగఁ గ్రొత్తదారి
    "వలద! నుసరింపు" మనినంత వడిని బెంచఁ
    "బరిసరములందునఁ గలరు నరులు, కాన
    వీడు నటులె వర్తిలు"ననె పితకుఁ మాత.

    రిప్లయితొలగించండి
  15. అడవి సింగ జంట కైన సంతానపు
    నడక తెలుపు బిడ్డ నైజ మెల్ల
    బిడ్డ పనితనంబు వెదకి జూచెడువేళ
    ప్రాణులన్నిటందు భావమొకటె!

    రిప్లయితొలగించండి
  16. గురువులకు నమస్కారములు
    కుబేరుడి సోదరుని కొడుకు పసి తనంలోనె తల్లి దండ్రు లిద్దరు మరణించడం వలన శాతుడు అనే సిం హం ఆ బాలుని తన వీపుపై మోసి పెంచిన దనీ అందువలన ఆ బాలునికి " శాత వాహనుడని పేరు వచ్చిం దనీ ,పిమ్మట అతనికి సంస్కృతం రానందున గుణాడ్యుడు , పాణిని , పందెం వేసుకుని పాణిని సంస్కృతం నేర్పాడని ఆ చక్రవర్తి పేరున శాతవాహన శకం ఏర్పడిందనీ " గుణాడ్యుని బృహత్ కధలో ముది గొండ శివప్రసాద్ గారి రచన చదివిన గుర్తు. పొరబడి ఉంటే క్షమించ గలరు.

    రిప్లయితొలగించండి



  17. నా పద్యంలో మూడవపాదాన్ని ,ఈ విధంగా సవరిస్తున్నాను.
    '' సింగపు గొదమ తోడ సివంగులచట. ''

    ఆరెండూ ఆడసింహాలే.(సివంగులు )
    రాజేశ్వరిగారూ,మీరు చదివిన కథ ప్రచారంలో ఉన్నదే.కాని సాతవాహన,లేక శాతవాహన వంశానికి మూలపురుషుడు వేరు.గుణా ఢ్యుడు అతని వంశం లోని వాడు.

    రిప్లయితొలగించండి
  18. పెద్దలకు నమస్కరాములు
    గుణాఢ్యుడు వ్యాకరణం చెబుతానని ,ఆరు సంవత్సరములు పడుతుందని అనడం వలన , పాణిని వచ్చి ఆరు నెలలకే నేర్పుతానని , పందెం కడతాడు కదా ! ఓడిపోయిన వారు చెప్పుల దండ మెడలో వేసుకుని తిరగాలని ఐతే గుణాధ్యుడు కేవలం వ్యాకరణ పండితుడు మాత్రమే .
    ఐతె ఇంతకీ " సాతుడనే పేరు గల సిం హము పైన తిరిగి నందున శాత వాహనుడై శక కర్త ఐనప్పడికీ విస్వాసం లేని జనులు మనకి అన్యాయం చేసారు " అని చెప్పాలన్నదే నా ప్రయత్నం.సరిగా చెప్ప లేక పోయి నందులకు మన్నించ గలరు

    రిప్లయితొలగించండి
  19. పైగా అవి రెండూ ఆడ సిం హ లన్న సంగతి మరచి పోవడం లో నాప్రయత్నం పూర్తిగా పొరబాటన్న మాట . తెలియ జెప్పినందులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  20. కమనీయం గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘దో సివంగు’ లన్నది సవరించారు కదా! సంతోషం.
    *
    రామకృష్ణ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    అయితే అక్కడ ఉన్నవి రెండూ ఆడ సింహాలే. :-)
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘సింగ జంట’ను ‘సింగపు జత’ అందాం.

    రిప్లయితొలగించండి