19, డిసెంబర్ 2012, బుధవారం

పద్య రచన - 195

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22 కామెంట్‌లు:

  1. ఊయల లూగుము బిడ్డా
    బాయిని త్రాగితివింకను బజ్జో తండ్రీ
    పోయిక రావలె నీటికి
    మీయయ్యకు వండవలయు మీదట బువ్వన్.

    రిప్లయితొలగించండి
  2. అయ్యా! శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    తొందరపడరాదు అని ఆర్యోక్తి. మీరు కందపద్యమును బాగుగానే వ్రాసేరు. 6వ గణము భగణముగా వేసేరు. దానిని ఒక్క మారు పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగంది. అభినందనలు.
    ‘త్రాగితి వింకను’ అన్నదాన్ని ‘త్రాగితివి నీవు’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  4. ముద్దుల మూట వీవు గుణభూషణ! మాయనెరుంగనట్టి నీ
    వద్దిర దైవరూపుడవు హాయిగ పాలను ద్రావితీవు, వే
    నిద్దుర పొమ్ము నా మనమునే సుమశయ్యగ జేసియూచుదున్
    తద్దయు భక్తిమీర సిత తామరసేక్షణ! విశ్వరక్షకా!

    రిప్లయితొలగించండి
  5. ఆర్యా ! నిజమే తొందరలో జరిగిన పొరపాటు.
    మాస్టరు గారూ ! చక్కటి సవరణ చేశారు.
    ఇరువురకు ధన్యవాదములు..
    సవరణతో...

    ఊయల లూగుము బిడ్డా
    బాయిని త్రాగితివి నీవు బజ్జో తండ్రీ
    పోయిక రావలె నీటికి
    మీయయ్యకు వండవలయు మీదట బువ్వన్.

    రిప్లయితొలగించండి
  6. లాలను పోసితి నీకిక
    జోలను పాడెదను వినుము జోకొట్టెద గా !
    హేలగ నిదురించు ముమరి
    గోలను జేయకను నీవు గోపాలుడ వై !

    రిప్లయితొలగించండి
  7. రాజేశ్వరి అక్కయ్య గారూ! మీ లాలింపు పద్యం లాలి పాటలా మధురముగానున్నది...

    రిప్లయితొలగించండి
  8. పాపడు లేవకున్న మరి పాపము తోచదు తల్లి కింతయున్
    పాప మరేడ్వకున్న నిక పాపము తోచదు తల్లి కింతయున్
    పాపడు పాలు త్రాగకను పాపము తోచదు తల్లి కింతయున్
    పాపడు పండకున్న మరి పాపము తోచదు తల్లి కింతయున్.

    రిప్లయితొలగించండి
  9. వినుమాముద్దులగూర్చుచున్ తిరిగి నువ్వీరీతి యాటాడుచున్
    మనముల్లాసము జెందగా మిగుల సంభాషించ నింపాయెనే!
    యినుడుంగ్రుంకెను ప్రొద్దు పోయెనిక నీవీ లాలిలో హాయిగా
    కనుచున్ స్వప్నము నిద్దురించవలె , నీకై నేను పాడేనిదే.

    రిప్లయితొలగించండి
  10. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, డిసెంబర్ 19, 2012 2:12:00 PM

    సుగంధిః
    అమ్మ చేత తాన మాడి అంద మైన మోముతో
    గుమ్మ పాలు గ్రుక్కె డంత గొంతు లోన గ్రోలగన్
    అమ్మ కింత వేడు కిచ్చి అంత లోనె వెళ్ళుచున్
    కమ్మ నైన నిద్ర పోవ కన్న తల్లి కౌగిటన్

    రిప్లయితొలగించండి
  11. సి పి బ్రౌన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో "జాతీయ స్థాయి పద్య, గేయ, నాటక రచనల" పోటీలకు ఆహ్వానం పలుకుతున్నాము. వివరాలకోసం దయచే www.cpbrown.org చూడండి

    రిప్లయితొలగించండి
  12. సోదరులు శ్రీ గోలివారికి ధన్య వాదములు
    మీ అందరి పద్యాలు ఎప్పుడూ బాగుంటాయి.ఎప్పుడైనా నా పద్యం బాగుందంటే అది .........
    " అది యైత్ వండర్ "

    రిప్లయితొలగించండి





  13. ముద్దులొల్కెడి బిడ్డను మోదమలర
    లాలిలోనుంచి తీయగ జోలపాడ
    వెడలు

    తల్లిని గనుగొన వెల్లివిరియు
    కమ్మనగు దేశి పాటల కైతలెన్నొ

    శంకరార్యా,1000 సమస్యా పూరణలు,పద్యరచనలు ప్రచురించాలనే ప్రతిపాదనకు మీ నుంచి సమాధానం లేదు.కనీసం,సభ్యులు తమ కవితలు మాత్రమైనా ప్రచురించుకుంటామంటే తీసి యివ్వగలరా?మీ ఆరోగ్యం కుదుటబడిందనుకొంటాను.

    రిప్లయితొలగించండి
  14. చిన్ని కృష్ణుడి వలె చెలరేగి పోకురా
    బాల రాముడి వలె బజ్జు కోర
    పాడి లాలి నూతు బంగారు నా తండ్రి
    దిష్టి తీయఁ గనుమ తీపి కలల

    రిప్లయితొలగించండి
  15. పాలు ద్రాగిన పసిపాప గోల మానె
    కనులు మూతలు వడె నంత గల్గె నిదుర
    అమ్మ ముద్దాడి బాలుని హత్తుకొనుచు
    నెత్తి యూయలలో నుంచి నిదుర బుచ్చె

    రిప్లయితొలగించండి
  16. మాతృప్రేమను వివరిస్తూ మంచి పద్యాలు వ్రాసిన....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    మిస్సన్న గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    కమనీయం గారికి,
    సహదేవుడు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    మిస్సన్న గారూ,
    పద్యము వ్రాయకున్న మరి పాపము మిస్సన కెట్లు తోచునో!
    *
    లక్ష్మీదేవి గారూ,
    ‘పాడేనిదే’ వ్యావహారికమయింది. ‘పాడంగనే’ అందామా?
    *
    కమనీయం గారూ,
    సమస్యలను, దత్తపదులను, పద్య రచనలను పుస్తకంగా తీసుకువచ్చే ఆలోచన చాలా కాలంగా ఉంది. ముద్రించాలంటే అది ఎంతో కర్చు, శ్రమతో కూడినది. నాకైతే ఆ ఆలోచన లేదు.
    ఇ-బుక్ గా తయారు చేసే ప్రయత్నం కొంత జరిగింది. దాన్ని కొనసాగించి pdf ఫార్మేట్‌లో పుస్తకం తొందరలోనే తీసుకు వస్తాను. ధన్యవాదాలు.
    *
    సహదేవుడు గారూ,
    ధన్యవాదాలు.
    మీరు ఉదారచిత్తంతో పుస్తక ప్రచురణకు ఆర్థిక సహాయం చేసినా అది వేరే విధంగా వినియోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే నా ఆర్థిక సమస్యలు అటువంటివి. ఇప్పటికే రెండు సార్లు వేర్వేరు కారణాలతో బ్లాగు మిత్రుల నుండి ఆర్థిక సహాయం పొంది వారిని ఇబ్బంది పెట్టినవాడినయ్యాను. ‘అప్పు’ అని తీసుకున్నవి కూడా తిరిగి చెల్లింపలేని స్థితిలో ఉన్నానని చెప్పడానికి సిగ్గు పడుతున్నాను.
    అందువల్ల డబ్బు కర్చు చేయవలసిన పని లేని ఇ-బుక్ ఆలోచన చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  17. కమనీయం గారూ,
    మరొక్క మాట. ‘శంకరాభరణం’లోని రచనలను ఎవరైనా స్వేచ్ఛగ వినియోగించుకోవచ్చు. ‘కాపీరైటు’ లేదు. నా అనుమతి అవసరం లేదు.
    పదుగురికి ఉపయోగపడేలా ఏరూపంలో వెళ్ళినా సంతోషమే! స్వస్తి!

    రిప్లయితొలగించండి



  18. శంకరయ్యగారూ.నమస్తే,ప్రింటు మీడియాలో కాకున్నా E-book గా తీసుకువస్తానన్నందుకు చాలా సంతోషం.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారూ సంతోషం (నవ్వుతూ).
    ఒక్కొక్కసారి పూర్తి పద్యం వ్రాయలేక వచ్చిన పాదాలు మట్టుకు వ్రాసిపెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా పనికొస్తాయని.

    రిప్లయితొలగించండి
  20. డా.తోపెల్ల రామలక్ష్మిగురువారం, డిసెంబర్ 20, 2012 8:39:00 PM

    అమ్మ లాల పోయ గాను హాయి గొన్న పాప తా
    కమ్మ నైన పాలు త్రావి కన్ను లెత్తి చూడగా
    సమ్మ తమ్ము తెల్పి నట్టి చక్క నైన పాపనా
    కొమ్మ తీసి యూయ లుంచ కోరి సాగె తిన్నగా.

    రిప్లయితొలగించండి
  21. ఊ యల లూపుదు గన్నా !
    హాయిగ మఱి పండు కొనుము నలసట తీరున్
    నాయమ వచ్చిన పిమ్మట
    తీయును నిక దిష్టి నీకు తెల్లని లవణాన్ .

    రిప్లయితొలగించండి