26, డిసెంబర్ 2012, బుధవారం

పద్య రచన - 202

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. ఇన్నాళ్ళకు నీకిచ్చిన
    మన్ననలే నిజములయ్యి నిత్యము జనమే
    నాన్నా అమ్మల సంస్కృతి
    దన్నుగ నిల బెట్ట తెలుగు తల్లీ శుభమౌ.


    రిప్లయితొలగించండి
  2. ఇన్నాళ్ళకు నీకిచ్చిన
    మన్ననలే నిజములగుచు నిత్యము భావిన్
    నాన్నా అమ్మల సంస్కృతి
    దన్నుగ నిల బెట్ట తెలుగు తల్లీ శుభమౌ.

    రిప్లయితొలగించండి
  3. విష్ణుచిత్తుని తనయ పవిత్ర హృదయ
    విష్ణు సేవాపరాయణ వినయ భావ
    భూస్వరూప గోదాదేవి పుణ్య పాద
    సన్నిధి నొనర్తు నివె నమస్కారములను

    రిప్లయితొలగించండి
  4. 'అ'యను యక్షరము హరియై యలరు చుండ!
    విశ్వ రూపిణి వగుచు నీ విభవ మొప్ప!
    తెలియకున్నారు పుడమిన తెలుగు వారు
    మేటి దనుచు ప్రపంచంబు మెచ్చు చుండ!
    మాతృ మూర్తి గొప్పతనంబు మరువ దగునె!

    రిప్లయితొలగించండి
  5. గోదా దేవికి జేతును
    బాదాలకు బూజ నిపుడు బంధువు లెదు ట న్
    వేదాల మంత్ర యుతముగ
    నా దేవియె గాచు నన్ను ననవర తంబున్ .

    రిప్లయితొలగించండి
  6. మా తెలుగు తల్లి నీకిదే మల్లె మాల
    మమ్ము గన్నట్టి తల్లి నీవమ్మ మమ్ము
    తప్పు లెన్నక మన్నించు దయను తెలుగు
    పల్కు మరచిన భ్రష్టుల మల్క వలదు.

    రిప్లయితొలగించండి






  7. తెలుగువారందరికి తల్లి తెలుగుతల్లి,
    ప్రాంతభేదమ్ము లేకయే పాడుకొనుడి,
    తెలుగుజాతిఘనచరిత్ర,తెలుగుతేజ
    మవని వ్యాపింపజేయుడీ,ఆంధ్రులార!

    తెలుగుతల్లి విగ్రహం చూసి కొందరు కవిమిత్రులు గోదాదేవి( ఆండాళ్)పైన పద్యాలు ఎందుకు రాసారో తెలియకుండా ఉన్నది.

    రిప్లయితొలగించండి
  8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, డిసెంబర్ 26, 2012 5:13:00 PM

    ఇక్షు ఖండ ద్రాక్ష రసంబు లిందు జేర
    తెనుగు భాషకు నబ్బెను తియ్యం దనము
    శంకరంబాడి పాడిన శ్రావ్య గీత
    మనుదినము నుతింతు “మా తెలుగు తల్లి”

    రిప్లయితొలగించండి
  9. తెలుగు వెలుగులు విరజిమ్ము దేశ మాత
    కనుల కింపైన సొగసుల కల్ప వల్లి
    భాష లందున లెస్సైన భాష మనది
    దేశ దేశాలు మెచ్చిన దేవత నగ

    రిప్లయితొలగించండి
  10. తెలుగు వెలుంగజేయుటకు దీక్షను బూనిన పెద్దవారలన్
    తలచిన కార్యమందు తగు దారిని సాగుటకైన రీతిగా
    సలలితమానసమ్ముగల చక్కని తల్లిగ నీవు దీవనల్
    పలుకుమటంచు వేడుదును, వందనమందును గైకొనంగదే!





    రిప్లయితొలగించండి
  11. ఈనాటి ‘తెలుగు తల్లి’ చిత్రాన్ని గోదాదేవి చిత్రంగా పొరబడటానికి అవకాశం ఉంది. పరవాలేదు.
    చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    సహదేవుడు గారికి,
    సుబ్బారావు గారికి,
    మిస్సన్న గారికి,
    కమనీయం గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    అభినందనలు., ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి