31, డిసెంబర్ 2012, సోమవారం

పద్య రచన - 207

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. పంచ రంగుల మెరసెడు పక్షులార
    ఏమి చూచుచు నుంటిరో ఎక్కి కొమ్మ
    'షూటు ' జేయగ జూతురు చూడ మీరు
    " కన్ను" "గన్నుల" గమనించ కలుగు సుఖము.

    కన్ను = కెమెరా

    రిప్లయితొలగించండి
  2. మోడు వారిన యట్టి యా భూజము పయి
    రంగు రంగుల పక్షులు వ్రాలి చాల
    చల్ల గాలిలో మిగుల విశ్రాంతి గొనుచు
    నలరు చున్నవి కనుల విందైన రీతి

    రిప్లయితొలగించండి
  3. కలసి జీవించు మానవా కలిమి యగును
    మ్రోడు వారిన బ్రతుకుల మోదమగును
    పోరు నష్టము నీకెన్న పొందు సుఖము
    పక్షి సంఘపు హితవైన పలుకులివ్వి.

    రిప్లయితొలగించండి
  4. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, డిసెంబర్ 31, 2012 12:17:00 PM

    గగన వీధిని విహరించి ఘనము గాను
    శోభ లీనెడి వనలక్ష్మి సొయగంబు
    చిత్ర మనిపించి జేరెను సేద దీర
    కలిమి బలిమి జూపుచు పక్షి కాంత లంత.

    రిప్లయితొలగించండి
  5. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, డిసెంబర్ 31, 2012 12:18:00 PM

    గగన వీధిని విహరించి ఘనము గాను
    శోభ లీనెడి వనలక్ష్మి సోయగంబు
    చిత్ర మనిపించి జేరెను సేద దీర
    కలిమి బలిమి జూపుచు పక్షి కాంత లంత.

    రిప్లయితొలగించండి
  6. పెద్దలందరికి ప్రణామములు!

    పద్దెనిమిది చిలుకలను చూడగానే పద్దెనిమిది పర్వాల శ్రీ మహాభారతం పరిస్ఫురించింది:

    శ్రీదకవిత్వభావగుణరీతుల కొక్కొక పర్వమున్ రసా
    స్వాదకమై శుకాకృతి శుభాకృతి నూని తరింపఁజేయ స
    మ్మోదకరమ్ముగా జనుల మ్రోలను నిల్చితి; గొల్చువార మ
    ష్టాదశపర్వనిర్వహణసంభృతపంచమవేదమా! నినున్.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  7. చక్కని చిత్రం బియ్యది
    పెక్కులు సుందరములైన విహగము లొకటై
    మిక్కిలి సఖ్యము బూనుచు
    నిక్కడ సుఖముండె జూడు డీదృశ్యంబున్.

    కన్నుల పండుగ చేయుచు
    నున్నతమౌ భావనంబు నుర్వీతలమం
    దన్నిట జనులకు జూపుచు
    నున్నది ఖగపంక్తి ప్రకటితోత్సాహమునన్.

    బహువర్ణంబుల పక్షులు
    సహపంక్తిగ జేరియుండి శాఖమునందున్
    సహవాసము జనులందరి
    కహరహమిదె నేర్పుచుండె నద్భుతరీతిన్.

    రిప్లయితొలగించండి
  8. బోయని వల పట్టి యెగిరి
    సాయము కొఱకై యెలుకను సఫలత తోడన్
    ధ్యేయము వీడక చను కథ
    మాయని గుఱుతదియె; నేడు మదిలో మదిలెన్.

    రిప్లయితొలగించండి
  9. Birds of same feathers flock together
    అన్న నానుడి కన్వయంగా :

    వాలె కొమ్మ పైన పక్షులన్ని గలిసి
    యొక్క రంగు గలవి యొక్క చోట
    మంచిచెడు గుణముల మనుజులు నట్లెపో
    మిత్రులగుచు నుండ్రు మైత్రి తోడ

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! రవీందర్ గారు!
    శుభాశీస్సులుమీ పద్యము 4వ పాదము --
    "మిత్రులగుచు నుండ్రు మైత్రి తోడ" కి బదులుగా
    "ఆప్తులగుచు నుందు రాదరమున" అని మార్చితే
    చాల బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. ఆశ్రయించుడీ స్థాణువు నాదరమున
    నా మహాదేవు సాయుజ్య మందగలరు
    కాంచు డారీతి శాంతి సౌఖ్యముల ననుచు
    దెలుపు ద్విజతతినే వినుతింతు నాత్మ

    (స్థాణువు = శివుడు, మ్రోడు అని అర్థములు; మరియు
    ద్విజతతి = బ్రహ్మజ్ఞానుల సమూహము, పక్షుల సమూహము అని అర్థములు)

    రిప్లయితొలగించండి
  12. గురువు గారూ ! అలాగే మార్చుతున్నాను :

    వాలె కొమ్మ పైన పక్షులన్ని గలిసి
    యొక్క రంగు గలవి యొక్క చోట
    మంచిచెడు గుణముల మనుజు లటులనె పో
    ఆప్తులగుచు నుందు రాదరమున

    రిప్లయితొలగించండి




  13. సామరస్యమ్ముతో వృక్షశాఖపైన
    నందమైన వర్ణముల విహంగములవె
    చూడ ముచ్చట గొలిపెడి వేడుకగను
    పటము నందు జిత్రించిన భాతి నవుర.

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ ‘కన్ను, గన్ను’ల పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ మొదటి పద్యం ప్రకృతి వర్ణనతో అలరిస్తే, రెండవ పద్యం శ్లేషతో శోభిస్తూ, పారమార్థిక సత్యాన్ని ప్రబోధిస్తున్నది. అభినందనలు, ధన్యవాదములు.
    *
    మిస్సన్న గారూ,
    హితోపదేశం చేస్తున్న మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మనోహరంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధరరావు గారూ,
    మీ పరిశీలనాశక్తికి జోహార్లు! (మీ పరిశోధనాశక్తి ఎంతటిదో తెలిసిందే). భారత పరంగా మీరు చెప్పిన పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ మూడు పద్యాల ఖండకృతి చాలా బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ‘మిత్రలాభం’ కథను ప్రస్తావించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, డిసెంబర్ 31, 2012 9:44:00 PM

    మాష్టారికి నమస్సులు. మీ ప్రోత్సాహంతో మరింత ఉత్సాహం కల్గు చున్నది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  16. కొమ్మనిండుగ పక్షులు కొలువుఁ దీర
    చూచి నంతనె కొమ్మేది తోచ లేదు
    బ్రతుకు పంజర మందుండి ప్రాణ పక్షి
    పైకెగురు బాట తీరున పంక్తిఁ గంటి!

    రిప్లయితొలగించండి
  17. మాటలు నేరని పక్షులు
    కూటమి గట్టుచును మిగుల గుదురుగ నుండున్
    ఏటికి నరులటు లుండక
    చీటికి మాటికి తగవుల చెలరేగుదురో?

    రిప్లయితొలగించండి