7, డిసెంబర్ 2012, శుక్రవారం

సమస్యా పూరణం - 899 (కారుపై దాశరథులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కారుపై దాశరథులు లంకకు నరిగిరి.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

17 కామెంట్‌లు:

  1. హనుమ కోరగ తనదు స్కంధాగ్రము పయి
    కూర్చొనుండని యటులనే కుదురు కొనుచు
    నాంజనేయుపై కూర్చొని యటుల నిర్వి
    కారుపై దాశరథులు లంకకు నరిగిరి

    రిప్లయితొలగించండి
  2. vara garwituMDaina raavaNuni dunuma
    daMDa yaatrakai veDaliri danuja mOsa
    కారుపై దాశరథులు, లంకకు నరిగిరి
    raama patnaina seetamma raksha sEya.

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రిశుక్రవారం, డిసెంబర్ 07, 2012 9:32:00 AM


    వరముచే గర్వితుండు రావణుని దునుమ
    దండయాతకై వెడలిన దనుజ మోస
    కారుపై దాశరథులు, లంకకు నరిగిరి
    రాము పత్నైన సీతమ్మ రక్ష సేయ.

    రిప్లయితొలగించండి
  4. హనుమ భుజముపై గూర్చుండి యనువు గాను
    కనుచు నెన్నియో వింతలు గమనమునను
    తరలి గిరులపై నదులపై దాటుచు నొక
    *కారుపై దాశరథులు లంకకు నరిగిరి

    *అడవి

    రిప్లయితొలగించండి
  5. స్వామి సేవను చేయగ సంతసమున
    బాహువులపైన నాసీన పఱచు కొఱకు
    విస్తృతమ్ముగ మేనును పెంచు నిర్వి
    కారుపై దాశరథులు లంకకు నరిగిరి.

    రిప్లయితొలగించండి
  6. సీత జాడను దెలిసిన శ్రీ విభుండు

    చేర నామెను నయ్యెడ శీ ఘ్రముగను

    సాద రంబుగ కపి భుజ స్కంధ మనెడు

    కారుపై దాశ రధులు లంకకు నరిగిరి .

    రిప్లయితొలగించండి
  7. ప్రభువు సేవయే బంటుకు పరమ ధర్మ
    మనుచు నవనిజఁ గాపాడె డవసరాన
    నింగి నంటి హనుమనిల్వ నిత్య భజన
    కారు పై దాశరథులు లంకకునరిగిరి.

    రిప్లయితొలగించండి

  8. రామ లక్ష్మణుల వహించి రయ్యి మనుచు
    వేగముగ హనుమంతుడు వెడలు చుండ
    కారు మబ్బులు కమ్మిన కతన *మొగులు
    కారుపై దాశరథులు లంకకు నరిగిరి

    *కారు మొగులు లేక మొగులు కారు

    రిప్లయితొలగించండి
  9. వెడలిరి సురలు భూలోక విహరణమున
    పుణ్యసీమల దండకారణ్యమున షి
    కారుపై ; దాశరథులు లంకకు నరిగిరి
    వారధిని గట్ట కడలిపై వానరు లట

    రిప్లయితొలగించండి
  10. వాహనముగ నొప్పె హనుమ వారిజాక్షు
    లైన రామలక్ష్మణులకు లాఘవముగ
    మారుతసుతుడు గొనిపోవ ' మారుతి ' యను
    కారుపై దాశరథులు లంకకు నరిగిరి

    రిప్లయితొలగించండి
  11. మిత్రుల అందరి పూరణలు అలరించుచున్నవి.

    ఈనాటి పూరణలు చూస్తుంటే శ్రీ నాగరాజు రవీందర్ గారి మనస్సు మారుతి కారులో షికార్లు కొట్టుచున్నదిగ కనిపించుచున్నది. వివిధ భావములతో అనేక పూరణలు గావించుచున్నారు. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. రావణుని జంపి సీతను రమ్యవదన
    దేను వారధి పై వెళ్ళే సేన నడచి
    గాడ్పు కొమరుని ఘన భుజస్కంద మనెడి
    కారుపై దాశరధులు లంకకు నరిగిరి .

    రిప్లయితొలగించండి
  13. నేమాని గురువర్యులకు ప్రణామములు - ధన్యవాదములు. అంతా మీ చలవే.

    రిప్లయితొలగించండి
  14. శ్రీగురుభ్యోనమ:
    సందేహం: "...లంకకరిగిరి" (లంకకు + అరిగిరి). అక్కడ నుగాగము వస్తుందా?

    రిప్లయితొలగించండి
  15. అయ్యా! ఛంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు.
    షష్ఠీ విభక్తిలో కి (కిన్), కు(కున్), లో(లోన్) లోపల(లోపలన్) అనే విభక్తి ప్రత్యయములు ద్రుతప్రకృతికములే. అందుచేత చివర ద్రుతము ఉంటుంది. వీలును బట్టి "న్" ను వాడనక్కరలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. గగన భాగము నంతయు క్రమ్ము కొనగ
    తనువు పెంచుకు నాతడు దర్ప మొంది
    భక్తి మీరగ హనుమ నురక్తి యనెడి
    కారుపై దాశరధులు లంకకు నరిగిరి

    రిప్లయితొలగించండి
  17. చిన్న సవరణ తో..

    వరముచే గర్వితుండు రావణుని దునుమ
    దండయాత్రకై వెడలిరి దనుజ మోస
    కారుపై దాశరథులు, లంకకు నరిగిరి
    రామ చంద్రుని సతి సీత రక్ష సేయ.

    రిప్లయితొలగించండి