11, డిసెంబర్ 2012, మంగళవారం

సమస్యా పూరణం - 903 (రాముఁడు క్రూరాత్ముఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రాముఁడు క్రూరాత్ముఁడు గద రావణుఁ జంపెన్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదములు.

21 కామెంట్‌లు:

  1. ఏమిది రావణ భక్తులు
    ఈ మహిలో మరల బుట్టి యిట్లను చుండెన్
    ఏమీ తప్పది లేకనె
    రాముఁడు క్రూరాత్ముఁడు గద రావణుఁ జంపెన్.

    రిప్లయితొలగించండి


  2. భూమికి భారము బాపెను
    శ్యాముడు ధర్మమును మరల సంస్థాపించెన్
    కోమల హృదయుండగు శ్రీ
    రాముడు, క్రూరాత్ముడు గద రావణు జంపెన్

    రిప్లయితొలగించండి

  3. ఆ మునిసత్వుల బ్రోచగ
    స్త్రీమణియౌ సీతఁ గాచి శ్రేయస్సొదవన్
    భూమిని భారము డించగ
    రాముడు, క్రూరాత్ముడు గద రావణుఁ జంపెన్ !

    రిప్లయితొలగించండి
  4. దేముడు రాముని నెఱుగక
    గాములు కలసి సభ జేసి గర్వము విడకన్
    తామస మనమున బలికిరి
    “రాముడు క్రూరాత్ముడు గద రావణు జంపెన్"

    రిప్లయితొలగించండి
  5. గోముగ కానల కొద్దను
    రాముఁడు క్రూరాత్ముఁడు గద; రావణుఁ జంపెన్
    కోమల స్వామియె నాదగు
    క్షేమము కొరకై యనుచును సీత తలంచెన్.

    రిప్లయితొలగించండి
  6. ఏమీ చెలగాటంబా?
    రాముడు క్రూరాత్ముడు గద రావణు జంపెన్
    మేమాతని గూల్చెదమనె
    నా మైరావణుడు భీకరావేశముతో

    రిప్లయితొలగించండి
  7. రాముడు దయార్ద్ర హృదయుడు
    రాముడు నిల నుద్భవించె రావణు జంపన్
    రాముని యిటులన దగదిక
    రాముడు క్రురాత్ముడు గద రావణు జంపెన్ .

    రిప్లయితొలగించండి
  8. భూమిజ నేలినదెవ్వరు?
    భామకు బాధకలిగించు పాపి యదెవరో?
    రాముఁడపుడేమి జేసెను?
    రాముఁడు; క్రూరాత్ముఁడు గద; రావణుఁ జంపెన్.

    రిప్లయితొలగించండి

  9. భూమిజ పత్యవతారము
    ప్రామిడులను ధూర్త జనుల బరిమార్చుటకే
    నీ మహి ధర్మోద్ధారుక
    రాముడు, క్రూరాత్ముడగద రావణు , జంపెన్.

    రిప్లయితొలగించండి
  10. ఓ నాస్థికుదు ఇట్లు పలికెను )
    భామయగు తాటకిని, హా
    రామాయని పిలిచినత్తి మారీచుని, యా
    కోమలి శూర్పణఖను, మీ
    రాముదు కూరథ్ముదు గద, రావణు జంపెన్

    రిప్లయితొలగించండి
  11. కామంబున సీతమ్మను
    దాఁ మాయల నపహరించి తల్లటఁబెట్టన్
    ప్రేమార్ద్రమ్మున వగచెను
    రాముడు , క్రూరాత్ముడుగద రావణు, జంపెన్!

    రిప్లయితొలగించండి
  12. ఆ మండోదరి మనోభి-
    రాముఁడు క్రూరాత్ముఁడు గద రావణుఁ జంపెన్
    భూమిజపతి శ్రీ రాముడు
    సేమంబును చేయుకొరకు క్షితికి నరేంద్రా!

    రిప్లయితొలగించండి




  13. భీమపరాక్రముడును,గరు
    ణామయుడయినను విభీషణాదుల బ్రోవన్
    భూమిజ జెరదప్పింపన్
    రాముడు;క్రూరాత్ముడుగద రావణు జంపెన్.

    రిప్లయితొలగించండి
  14. అయ్యా! మిస్సన్న గారూ!
    మీ పద్యములో 1వ పాదములో గణభంగము కలదు (3వ గణము జగణము ఉండకూడదు). స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. నేమాని పండితార్యా! క్రింది విధంగా సవరించ వచ్చునేమో చెప్పండి:

    ఆ మండోదరికి హృదభి-
    రాముఁడు క్రూరాత్ముఁడు గద రావణుఁ జంపెన్
    భూమిజపతి శ్రీ రాముడు
    సేమంబును చేయుకొరకు క్షితికి నరేంద్రా!

    రిప్లయితొలగించండి
  16. అయ్యా శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    శ్రీ కంది శంకరయ్య గారు చాలా కాలముగా వ్యాఖ్యలు చేయుట లేదు. వారిని అడిగి తెలుసుకొందాము మీ పద్యము గురించి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. కీమాయణ కావ్యములో
    రాముడు పెరియారు సామి రభసగ పలికెన్
    గోముగ ద్రావిడ కోటికి:
    "రాముఁడు క్రూరాత్ముఁడు గద రావణుఁ జంపెన్"

    రిప్లయితొలగించండి
  18. కామము క్రోధము వీడుచు
    నీమమునన్ కోర్టు కీడ్చి నిశ్చల మతితో
    గోముగ జైలున కంపక
    రాముఁడు క్రూరాత్ముఁడు గద రావణుఁ జంపెన్!

    రిప్లయితొలగించండి