15, డిసెంబర్ 2012, శనివారం

సమస్యా పూరణం - 907 (రాతికి మన్మథుఁడు పుట్టి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రాతికి మన్మథుఁడు పుట్టి రతిఁ బెండ్లాడెన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

19 కామెంట్‌లు:

  1. శ్రీతరుణీమణికి సరో
    జాతాక్షునకున్ హృదంబుజాతము లలరన్
    ఖ్యాతగుణుండగు దనుజా
    రాతికి మన్మథుడు పుట్టి రతి బెండ్లాడెన్

    రిప్లయితొలగించండి
  2. మాతకు శ్రీపతి తలపున
    చేతమలరగ జనియించె చేతోజాతుం
    డా తీరుననా దైత్యా
    రాతికి మన్మథుఁడు పుట్టి రతిఁ బెండ్లాడెన్.

    రిప్లయితొలగించండి
  3. ప్రీతిగ శత రతి పతులుగ
    భాతిని వెలుగొందు హరికి పావన హృదిలో
    ఖ్యాతిని పొందెనుగ మురా
    రాతికి మన్మథుఁడు పుట్టి రతిఁ బెండ్లాడెన్.

    రిప్లయితొలగించండి
  4. మాతులుడైనను బాలుని
    ప్రీతిగనక చంపదలచి ప్రేతములకు దా
    నేతగు కంసుఁడు; కంసా
    రాతికి మన్మథుఁడు పుట్టి రతిఁ బెండ్లాడెన్.

    రిప్లయితొలగించండి
  5. మాతల మూవురి పనుపున
    పీ తాంబర ధారి యపుడు పెనుపు గలుగగన్
    ప్రీ తిని గలిగెడు దనుజా
    రాతికి మన్మధుడు పుట్టి రతి బెండ్లా డె న్

    రిప్లయితొలగించండి

  6. మాతల మూవురి పనుపు న
    పీ తాంబర ధారి యపుడు పెంపొం దం గన్
    ప్రీ తిని నొందా దనుజా
    రాతికి మన్మధుడు పుట్టి రతి బెండ్లా డె న్

    రిప్లయితొలగించండి





  7. చేతోహరుడు,మనోజ్ఞుడు
    నేతల్లికి బుట్టలేదు;ఇచ్చాజన్ముం
    డాతడు,శ్రీహరి దైత్యా
    రాతికి మన్మథుడు పుట్టి రతి బెండ్లాడెన్


    రిప్లయితొలగించండి
  8. జోతల నిడి సూర్యునకు ప్ర
    భాతము నాకమును జేరి, వార్తను దెల్పెన్
    ప్రీతిగ సురమౌని బలా
    రాతికి ; “ మన్మథుడు పుట్టి రతి బెండ్లాడెన్"

    రిప్లయితొలగించండి
  9. భూతలమున నిండ కడుపు
    చేతనతోఁ గోరికలెగసి వెదకు జతకై
    కోతలుఁ గావివి కడకున్
    రాతికి మన్మధుఁడుఁబుట్టి రతిఁబెండ్లాడున్!

    రిప్లయితొలగించండి
  10. పండిత వర్యులందరికీ నమస్కారములు. ఎందుకో తెలియదు - కొన్ని రోజులుగా ఎంత ప్రయత్నించినా నేను పద్యం రాయలేక పోతున్నాను. సమయం ఉన్నప్పటికీ, వాక్యం కుదరటం లేదు. పెద్దల ఆశీర్వాదం, భగవంతుని కృప కొరకు వేచి ఉన్నాను.

    రిప్లయితొలగించండి
  11. శీతాచలాగ్రముపయినఁ
    బూతాగ్నిదహించినంత పూవిలుకానిన్
    భూతలముపైనఁ గంసా
    రాతికి మన్మథుడు పుట్టి రతి బెండ్లాడెన్.

    రిప్లయితొలగించండి
  12. మిత్రమా వామన కుమార్ గారూ చింతిలకండి. ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా భావం కుదిరితే పద్యం కుదరదు, పద్యం కుదిరితే భావం తృప్తిగా ఉండదు. నాకూ అలాగే జరుగుతూ ఉంటుంది. సరస్వతీ దేవి లీలగా అనుకొంటూ ఉంటాను. కంగారు పడకండి. ప్రయత్నం మానకండి. త్వరలోనే తప్పక మునుపటి లాగే చక్కటి పద్యాలు వ్రాయగలరు.

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులకు, మాటవచ్చింది గాబట్టి నాకు కూడా అదే వరుస. భావమూ భాషా సమన్వయం. అందుకే అనుకొంటూ ఉంటాను. నన్నయాదులు, పోతనలాంటి మహానుభావులు యెంత తపస్సు చేస్తే ఆ మహాపద్య కావ్యాలు వెలువడ్డాయి. విశ్వనాధ వారు ఒక సభలో అన్నారు - శ్రీ రామాయణ కల్పవృక్షము వెలువడటానికి ముప్ఫై ఏళ్ళు పట్టిందిరా అని. అప్పట్లో ఆ మాటకు అర్థం తెలియలేదు. ఇప్పుడుతెలిసిందని అనుకొంటున్నాను.
    మనసు సరిగా లేకపోతే పద్యం పలకదేమో. ప్రయత్నిస్తే దైవానుగ్రహం తప్పక లభిస్తుంది.

    రిప్లయితొలగించండి
  14. సూతుడు జెప్పెడి కధలను
    కోతలు గావంచు వినగ కోరిక లెల్లన్ !
    రాతలు మారెను నేడిటు
    రాతికి మన్మధుడు పుట్టి రతి పెండ్లా డెన్ ! !

    రిప్లయితొలగించండి
  15. మాడుగుల అనిల్ కుమార్ఆదివారం, డిసెంబర్ 16, 2012 6:04:00 AM


    పూతనఁ జంపిన వాడై
    పూతాత్ముండయిన పరమ పూజ్యుడు కృష్ణుం
    డాతనికి , దుష్ట దైత్యా
    రాతికి మన్మథుడు బుట్టి రతి బెండ్లాడెన్ ll

    రిప్లయితొలగించండి
  16. కోతకు పల్లవ మడిదము
    వ్రేతకు దగు నించు విల్లు విరులే శరముల్
    హేతికి నెదురై(నీఱై), చైద్యా
    రాతికి మన్మథుడు పుట్టి రతిఁ బెండ్లాడెన్ !

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని వారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘శత రతి పతులు’...?
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘నేత + అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘ప్రేతాధిప వి/ఖ్యాతుడు...’ అందాం.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. నారదు డింద్రునకు వార్త తెలిపినట్లుగా మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
    కాకుంటే భావమే కొద్దిగా తికమక పెడుతున్నది.
    *
    మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
    వాణీ కటాక్ష ప్రాప్తిరస్తు! సుకవితా లేఖన ప్రావీణ్యతా ప్రాప్తిరస్తు!
    *
    రామకృష్ణ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    వైవిధ్యంగా చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    అవధాని మాడుగుల అనిల్ కుమార్ గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీరు బ్లాగులో పద్యం వ్రాయడం సంతోషాన్ని కలిగించింది.
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. మాస్టారు గారూ ! ధన్యవాదములు. అది రతీ పతులు అని రావాలి...సవరణ తో..

    (ప్రీతి శతరతీ పతులౌ)

    ప్రీతిగ శత పూబాణుల
    భాతిని వెలుగొందు హరికి పావన హృదిలో
    ఖ్యాతిని పొందెనుగ మురా
    రాతికి మన్మథుఁడు పుట్టి రతిఁ బెండ్లాడెన్.

    రిప్లయితొలగించండి
  19. కవి పుంగవులందరికీ, మా గురువు గారికి నమస్సులు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి