21, డిసెంబర్ 2012, శుక్రవారం

సమస్యా పూరణం - 913 (ఓరుగల్లులోన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఓరుగల్లులోన నుండరాదు.

17 కామెంట్‌లు:

  1. నాడు వైరు లిట్టు లాడెడు వారలు
    కాక తీయ రాజు పీక కోయు
    బ్రతికి యున్న చాలు బలుసాకు తిందము
    ఓరుగల్లులోన నుండరాదు.

    రిప్లయితొలగించండి
  2. ఓరుగల్లు లోన నుండరా దవినీతి
    యక్రమమ్ము లచట నభవు గరుణ
    శాంతి సౌఖ్యములును సౌభాగ్యములతోడ
    నలరుచుందు రెపుడు నఖిల జనులు

    రిప్లయితొలగించండి
  3. కళలు కంబములను కనిపించుగా వేయి
    హోరు మనును తెనుగు పౌరుషమ్ము
    కనగ వినగ లేని కఠినాత్ములెవ్వరు
    ఓరుగల్లులోన నుండరాదు.

    రిప్లయితొలగించండి
  4. మతము మతము మధ్య మమతాను రాగము
    మృగ్య మగుట వలన మోడు బారె
    నేక శిల పు నగర హిందువు ల మనము
    ఓరు గల్లు లోన నుండ రాదు .

    రిప్లయితొలగించండి

  5. కలెగల్లు లో న ఉండ రాదు,
    తాటిగల్లు లో న ఉండ రాదు,
    తిరుగల్లు లో న ఉండ రాదు,
    ఓరు, గల్లు లో న ఉండ రాదు

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. కాకతీయరాజ్య ఘనతను దెలియని
    తెలుగువాడ! చరిత తెలుసుకొమ్ము.
    కాని యెడల నీవు కదలిపొమ్మిటనుండి.
    ఓరుగల్లులోన నుండరాదు.

    రిప్లయితొలగించండి
  7. ఓరుగల్లులోన నుండ రాదని పల్కు
    కుజను లెవరు లేరు కూర్మి తోడ
    నుండవచ్చు నిచట నిండైన మనసుతో
    సజ్జనులగువారు శాంతిపరులు .

    రిప్లయితొలగించండి
  8. ఓరుగల్లులోన నుండ రాదని పల్కు
    కుజను లెవరు లేరు కూర్మి తోడ
    నుండవచ్చు నిచట నిండైన మనసుతో
    సజ్జనులగువారు శాంతి ప్రియులు .

    రిప్లయితొలగించండి
  9. గురువు గారు,
    మీరు చెప్పిన 1969 సంఘటన ఆధారంగా:

    వేరు పడగఁగోరి విద్యార్ధులెందరో
    ఆంధ్ర పండితుండననునయించి
    పంపిరొక్కరైలుబండిలోననియె:"మీ
    రోరుగల్లులోన నుండరాదు".

    [ఆంధ్ర - ఆ అధ్యాపకుడు తెలుగు చెప్పేవారు అన్న సూచనే కానీ - ప్రాంత సూచన కాదు]

    రిప్లయితొలగించండి
  10. ఓరు గల్లు విడచి పోరు సల్పెడి వారు
    ఓరు గల్లు లోన నుండ రాదు
    నేల విడచి సాము నేరీతి చేయగ
    ధాత్రి కన్న బిడ్డ ధన్య చరిత

    రిప్లయితొలగించండి
  11. వీర నారి పుట్టి పెరిగిన దీ గడ్డ!
    ఓరుగల్లులోన నుండరాదు
    ఉవిదల కెపు డాత్మ న్యూనతా భావమ్ము;
    కార్యమందు చేతగాని తనము!

    ( ఓరుగంటి ఆడపడుచయిన మా ఆవిడ ధైర్య సాహసాలను కాంచి ఎన్నో మార్లు ఉబ్బి తబ్బిబ్బయిన స్ఫూర్తితో )

    రిప్లయితొలగించండి
  12. ఈనాటి సమస్యకు మంచి పూరణల నిచ్చిన కవిమిత్రులు....
    మిస్సన్న గారికి,
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    రామకృష్ణ గారికి
    రాజేశ్వరి అక్కయ్య గారికి
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    జిలేబి గారూ,
    మీ భావం అవగతం కాలేదు.
    *
    రామకృష్ణ గారూ,
    మీరు గుర్తుకు తెచ్చిన సంఘటన బాధాకరం. సందర్భోచితంగా ప్రస్తావించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    మీ శ్రీమతి మా ఓరుగల్లు ఆడపడుచు అని తెలిసి సంతోషిస్తున్నాను.
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, డిసెంబర్ 21, 2012 10:34:00 PM

    తనయు తోడ పూని తండ్రి పలికెనట
    నోరుగల్లు లోన నుండరా ! దు
    గుణమ గునుగ నీదు గుణరాశి యంతయు
    కావ్య శిల్ప నాట్య కళలు తెలియ.

    రిప్లయితొలగించండి
  15. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, డిసెంబర్ 21, 2012 11:22:00 PM

    భవ్య దివ్య నవ్య భావ జాలంబులు
    ఓరుగల్లు లోన నుండ, రాదు
    విద్యలందు విశ్వవిద్యాలయాలలో
    విఘ్నమెన్నడైన వినుము బాల!

    రిప్లయితొలగించండి
  16. సిరులు పండు నట్లు చెరువుల ద్రవ్వించి
    శిల్ప కళల గుడుల నిల్పి కట్ట
    కాక తీయ వంశ ఘనత మరచు వారు
    యోరుగల్లు లోన నుండ రాదు

    రిప్లయితొలగించండి