24, డిసెంబర్ 2012, సోమవారం

సమస్యా పూరణం - 916 (వేళ్ళు పైభాగమున)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వేళ్ళు పైభాగమున నుండు వృక్షమునకు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

12 కామెంట్‌లు:

  1. శాఖలందున జీవులు సరిగ బ్రతుక
    ప్రకృతి వృక్షమ్ము నేగూడి పైననుండి
    మూల పురుషుడు పోషించు ముజ్జగముల
    వేళ్ళు పైభాగమున నుండు వృక్షమునకు.

    రిప్లయితొలగించండి
  2. వేళ్ళు పై భాగమున నుండు వృక్షమునకు
    కొమ్మలుండును క్రిందుగ నెమ్మి గనుడు
    జగతి సంసారమనెడు నశ్వత్థవృక్ష
    మునకు వేదము లాకులై తనరుచుండు

    రిప్లయితొలగించండి
  3. బుద్ధి మంతుని రీతిగ నొద్ది కనుచు
    జటలు విర బోసి నటులుండు వటము కనగ
    ఊడలను దించు క్రిందకు నూయ లూగ
    వేళ్ళు పైభాగమున నుండు వృక్షము నకు

    రిప్లయితొలగించండి
  4. ప్రకృతి మానవులకిడిన వరము చెట్లు,
    నేలలోనుండి వాటిని నిలవరించు
    వేళ్ళు, పై భాగముననుండు వృక్షములకు
    మోదమును గూర్చు దళములు పూలు పండ్లు

    రిప్లయితొలగించండి
  5. వేళ్ళు పైభాగమున నుండు వృక్షమునకు
    శాఖలు దిగువ నుండును సరసిజాక్ష !
    పర్ణములు నాల్గు శ్రుతులుగా పరిఢవిల్లు
    ఎఱుగు నెవ్వడు దీనినే నెఱుగువాడు

    రిప్లయితొలగించండి
  6. మిత్రులారా!
    ఈ నాటి సమస్యకు పరిష్కారము భగవద్గీత 15వ అధ్యాయము 1వ శ్లోకములో నున్నది.

    శ్లో: ఊర్ధ్వ మూల మధశ్శాఖ
    మశ్వత్థం ప్రాహు రవ్యయం
    ఛందాంసి యస్య పర్ణాని
    యస్తం వేద స వేదవిత్

    తాత్పర్యము:
    వేళ్ళు పైభాగమున, కొమ్మలు క్రిందికి గల ఒక నాశనములేని రావి చెట్టు గలదు. దానికి వేదములే ఆకులుగా నుండును. దానిని ఎవ్వడు తెలిసికొనుచున్నాడో వాడు వేదమును తెలిసిన వాడు అగుచున్నాడు. (సర్వమును తెలిసిన వాడు అగుచున్నాడు). అది సంసారమను మహావృక్షము.

    శ్రీ నాగరాజు రవీందర్ గారు ఈ భావమును సూచించుచు పూరణ గావించినారు. వారికి అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. మానవ శరీర మన్నది మ్రాకనుకొన
    వేళ్ళు పైభాగమున నుండు వృక్షమునకు
    శిరసహస్రార దళముళీ చెట్టు వేళ్ళు
    శాఖలా నాళములు విశ్వశక్తి పార!

    రిప్లయితొలగించండి
  8. నీరు యందగ సారము నింపు క్రింది
    వేళ్ళు; పైభాగమున నుండు వృక్షమునకు
    పర్ణములు గాలి బీల్చెడు పనినిఁ జేయు.
    కలిసి మెలిసి యున్నయెడల కలదు సుఖము.

    రిప్లయితొలగించండి
  9. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, డిసెంబర్ 24, 2012 7:48:00 PM

    జలక మాడగ గోపికల్ జమున చేర
    చీర లెత్తుక పోయిన శౌరి కాలి
    వేళ్ళు పై భాగమున నుండు వృక్షమునకు
    గొల్ల భామలందరు జేరి గోలచేసె.

    రిప్లయితొలగించండి
  10. భగవద్గీతలోని పురుషోత్తమప్రాప్తి యోగం ప్రథమశ్లోకం ఆధారమైన ఈ సమస్యను సమర్థంగా పూరించిన కవిమిత్రులు...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    సహదేవుడు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    ఈరోజు మిత్రుల పూరణలలో ఒకటి రెండు దోషాలున్నా అవి పెద్దగా పట్టించుకోదగినవి కావు.

    రిప్లయితొలగించండి