30, డిసెంబర్ 2012, ఆదివారం

సమస్యా పూరణం - 922 (ఎవఁడో యెవ్వఁడొ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తా నెవ్వాఁడొకో యెవ్వఁడో.

28 కామెంట్‌లు:

  1. వివిధ ప్రాంత నివాసు లాదరముతో విచ్చేయగా పర్వ వై
    భవముల్ తిర్పతిలో ప్రపంచ సభలన్ పాల్గొన్న వేవేలలో
    వి వి ఐ పీ లకు గాక యన్యుల గతుల్ పేర్కొందుమా బాపురే
    యెవడో యెవ్వడొ యెవ్వడో యెవడొ తా నెవ్వాడొకో యెవ్వడో

    రిప్లయితొలగించండి
  2. పూజ్య గురువులు శ్రీ పండితుల వారి పద్యం అద్భుతం .

    రిప్లయితొలగించండి
  3. తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగుమహాసభలు నిన్నటితో ముగిసినాయి. హంగు ఆర్భాటాలతో అవధాని శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్ గారి ఆద్వర్యములో కార్యక్రమాలన్నీ రసవత్తరంగానే జరిగినాయి. కానీ కొందరు తమకు అవకాశము రాలేదనే నెపముతో వేదికపైకి వచ్చిన సంధర్భములు కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పిన పద్యము........

    వివిధప్రాంతపుపాండితీగరిమనుత్ప్రేక్షించి సద్భావనా
    కవనంబుల్వెలయింపఁబూనిరికదా కళ్యాణమై తిర్పతిన్
    వివరంబేదియులేకవేదికలపై వేంచేయుచున్నట్టివా
    డెవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తానెవ్వాఁడొకో యెవ్వఁడో.

    రిప్లయితొలగించండి
  4. నేమాని పండితార్యా మీ పూరణ రాజేశ్వరి గారన్నట్లు
    సత్యదర్పణం.
    సంపత్కుమార్ శాస్త్రి మీ పూరణ సందర్భోచితమై అలరారుతోంది.

    రిప్లయితొలగించండి
  5. ఎవడీ గాంధి యిదేమి వేష మహహా యీ సత్య సంకల్ప మీ
    పవలున్ రేయిని దీక్షలేమిటి మనోవాక్కాయ కర్మంబులన్
    భవితన్ మార్చెడు భాగ్యరేఖ యని సంభావించు టేమీ జనం-
    బెవడో యెవ్వడొ యెవ్వడో యెవడొ తా నెవ్వాడొకో యెవ్వడో.

    రిప్లయితొలగించండి
  6. ఒక జవరాలి మనోగతం..

    నవలానాయకుడెవ్వడో? యెపుడొ యేనాడో చెలీ దర్శన
    మ్మవు? సేవించెడు భాగ్యమెన్నడది? నా మ్రొక్కుల్ ఫలింపంగ నన్,
    జవరాలన్ మురిపించు నాథుడెవడో? చక్కన్నివాడెవ్వడో,
    ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తా నెవ్వాఁడొకో యెవ్వఁడో.

    రిప్లయితొలగించండి
  7. సవరణతో..

    ఒక జవరాలి మనోగతం..

    నవలానాయకుడెవ్వడో? యెపుడొ యేనాడో చెలీ దర్శన
    మ్ము? విశేషమ్మగు భాగ్యమెన్నడది? నా మ్రొక్కుల్ ఫలింపంగ నన్,
    జవరాలన్ మురిపించు నాథుడెవడో? చక్కన్నివాడెవ్వడో,
    ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తా నెవ్వాఁడొకో యెవ్వఁడో.


    రిప్లయితొలగించండి
  8. ఎవడీ సృష్టికి మూలమౌ జగతి తానెవ్వాని యందుండునో
    ఎవడీ సృష్టి లయమ్మొనర్చునొ గదా యెవ్వాడు విశ్వాత్ముడో
    ఎవడాదిన్ నడుమన్ తుదిన్ కలుగడో యెవ్వాడు భూతేశుడో
    ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తా నెవ్వాఁడొకో యెవ్వఁడో!

    రిప్లయితొలగించండి
  9. MISSANNA GARI PADYAM ADBHUTAMGA UNDI. VISHNU TATVANNI PRRASPHUTAMGA DRUSYAMPA CHESTOMDI.

    రిప్లయితొలగించండి
  10. అజ్ఞాత గారూ ధన్యవాదాలు. క్షమించాలి.
    నేను పోతనగారి ఎవ్వనిచే జనించు పద్యాన్ని కాపీ కొట్టేను.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ మిస్సన్న గారి స్ఫూర్తితో:

    ఎవడీ బాలుడు? వేద శాస్త్రనిధి, వాగీశుండొ, పద్మాక్షుడో,
    శివుడో? యీ బలి యజ్ఞవాటికకు వచ్చెన్ మారు వేషమ్ములో
    భువిపై నింతటి ప్రాజ్ఞుడెవ్వడని సభ్యుల్ పల్కి రావేళలో
    నెవడో యెవ్వడొ యెవ్వడో యెవడో తా నెవ్వాడొకో యెవ్వడో

    రిప్లయితొలగించండి
  12. భవబంధంబు విచిత్రమైన దకటా! భాగ్యంబులున్, పుత్రులున్,
    నవలాసంగము, బంధుమోహము, సదా నాదన్నభావంబు లీ
    భువిపై దేహికి ప్రాణముండువరకే పోకాడినన్నిల్పువా
    డెవడో యెవ్వడొ యెవ్వడో యెవడొ తానెవ్వాడొకో యెవ్వడో

    రిప్లయితొలగించండి
  13. యువతన్ మాదక ద్రవ్య బానిసల,భావోద్రేకులన్ జేయగన్
    భవితన్ దల్చక నుగ్రవాదమను నభ్యాసమ్ముఁజేగొట్టగన్
    భువినీ దుర్గతి బాపి భారతికి ధర్మోపాయమున్ జూపు వా
    డెవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తానెవ్వాఁడొకో యెవ్వఁడో!

    రిప్లయితొలగించండి
  14. నేమని పండితార్యుని ప్రోత్సాహంతో:

    ఎవడీ కోతి యిదేమి రూప మహహా యీ ధైర్య మీ విక్రమం
    బవనిన్ గల్గునె మూర్ఖ వానరులకున్ భంజింపగా నా యశో-
    కవనిన్ గూల్చగ రాక్షసాళి నొకడే కానోపు నా విష్ణువే
    ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తా నెవ్వాఁడొకో యెవ్వఁడో

    రిప్లయితొలగించండి
  15. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, డిసెంబర్ 30, 2012 2:29:00 PM

    జవజాశ్వంబట నశ్వమేధ క్రతువున్ చక్కంగ భూషాకృతిన్
    భువినాద్యంతము పర్యటింప విడువన్ భూపాలకోద్దండులే
    వివిధోపాయములెన్ని, దీనినిలువంబెట్టన్ ధరన్ సాహసుం
    డెవడో యెవ్వడొ యెవ్వడో యెవడొ తానెవ్వాడొకో యెవ్వడో.

    రిప్లయితొలగించండి
  16. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, డిసెంబర్ 30, 2012 2:31:00 PM

    ముద్రారాక్షసానికి క్షమించాలి.
    జవనాశ్వంబట నశ్వమేధ క్రతువున్ చక్కంగ భూషాకృతిన్
    భువినాద్యంతము పర్యటింప విడువన్ భూపాలకోద్దండులే
    వివిధోపాయములెన్ని, దీనినిలువంబెట్టన్ ధరన్ సాహసుం
    డెవడో యెవ్వడొ యెవ్వడో యెవడొ తానెవ్వాడొకో యెవ్వడో.

    రిప్లయితొలగించండి
  17. ఎవడో యెవ్వడొ యెవ్వడో యెవడొ తానెవ్వాడొకో యెవ్వడీ
    కవితా కల్పక దివ్య వాటికలలో కళ్యాణ భావాలతో
    వివిధ ప్రక్రియలన్ వెలార్చునని భావింపంగ శ్రీ శంకరున్
    భువి వెల్గొందెడు శంకరాభరణ వాగ్భూషన్ ప్రశంసించెదన్

    రిప్లయితొలగించండి
  18. కవనం బల్లెడి కావ్య కంఠ మునులన్ గాంచన్ ముదం బొందగా
    దవనిన్ గాంచిన బంధముల్ తనయులున్ తండ్రైన దారైన చొ
    భవ బంధమ్ములు నాది నేననుచు సంభంధంబు సౌఖ్యం బహో
    ఎవడో యెవ్వడొ యెవ్వడో యెవడొ తానెవ్వాడొకో యెవ్వడో !

    తమ్ముడూ ! పెద్ద పెద్ద ఏనుగులూ పెద్ద పులులూ ఇస్తే నా అల్పత్వానికి ఎన్ని తప్పులో ?

    రిప్లయితొలగించండి
  19. వెన్నదొంగ గురించి గోపికల ముచ్చట్లు...

    నవనీతంబును దొంగిలించె నెవడో నాయింట నాదుత్తలే
    యవలీలంగని దించినార దెవరో యాయుట్టి పై నుండగా
    నెవడో మూతికి వెన్న బూసె నిదురన్ యెవడేమి ? నూ చూచితే !
    ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తానెవ్వాఁడొకో యెవ్వఁడో!

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    శుభాశీస్సులు.
    మీ పద్యము 3వ పాదము సరిజేయాలి. నిదురన్ + యెవడే అనే చోట యడాగమము రాదు. ఆ పాదమును ఇలా మార్చుదాము:
    ఎవడో మూతికి బూసె నా నిదురలో నీవెన్నలన్ జూచితే?
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  21. అక్కయ్య గారి భావపు స్ఫూర్తితో....

    పవిధాటిన్ తెగు పత్రముల్ పగిది నీ ప్రాణమ్ము కాయమ్ము,దా
    లవలేశమ్మును ప్రీతి లేనటుల చేలమ్మంచు వీడంగనే,
    భవబంధమ్ములు వీడ; బిడ్డలెవరో? ప్రాణేశ్వరుండెవ్వడో?
    ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తా నెవ్వాఁడొకో యెవ్వఁడో.

    రిప్లయితొలగించండి
  22. ఎవడోలోపల నుండు దా బయలు నుండే వ్యాపితుండై స్వయం
    భువనా లన్నియు జొచ్చి నిల్పు గద వైభోగమ్ము కీర్తించెదన్
    శివుడో మాధవుడో చతుర్ముఖుడొ సాక్షీభూతుడై వెల్గుచున్
    యెవడో యెవ్వడొ యెవ్వడో యెవడొ తా నెవ్వాడొకో యెవ్వడో

    రిప్లయితొలగించండి
  23. చక్కని సవరణ జూపిన శ్రీ నేమాని గారికి ధన్యవాదములు. సవరణ తో...

    వెన్నదొంగ గురించి గోపికల ముచ్చట్లు...

    నవనీతంబును దొంగిలించె నెవడో నాయింట నాదుత్తలే
    యవలీలంగని దించినార దెవరో యాయుట్టి పై నుండగా
    నెవడో మూతికి బూసె నా నిదురలో నీవెన్నలన్ జూచితే?
    ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తానెవ్వాఁడొకో యెవ్వఁడో!

    రిప్లయితొలగించండి
  24. ఒకరితో ఒకరు పోటీ పడి వ్రాసినట్లుగా అద్భుతమైన పూరణలు అందించిన కవిమిత్రులు.....
    పండిత నేమాని వారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    మిస్సన్న గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారిక,
    సహదేవుడు గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  25. భువనంబందున తేలుచున్ కడకుతా భూగర్భమున్ జొచ్చెనో...
    భవనమ్మంతట కూలగా కడకుతా బైరాగియై పారెనో...
    జవనంబెక్కుచు నోడగా కడకుతా జందెమ్మునున్ వీడెనో...
    ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తా నెవ్వాఁడొకో యెవ్వఁడో?

    రిప్లయితొలగించండి