31, డిసెంబర్ 2012, సోమవారం

సమస్యా పూరణం - 923 (శివనామము చేదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదములు.

19 కామెంట్‌లు:

  1. భవరోగము బాగుందని
    లవలేశము మందు వలదు లంపటమందే
    జవ సత్వము కలదనగా
    శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్.

    రిప్లయితొలగించండి
  2. ప్రవచించి యొక్క మూర్ఖుడు
    శివ నామము చేదు నరుల జిహ్వల కెపుడున్
    భువి ననుచు వైర భక్తుడు
    శివ! శివ! నీ పాదసీమ జేరెను కాదే

    రిప్లయితొలగించండి
  3. శివ శివ యని స్మరియించిన
    శివముల్ కలిగించు శివుడు చెంతనె యుండన్
    భవ జాడ్య మంటు కతమున
    శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ మిస్సన్న గారికి
    ప్రణామం!

    అమోఘమైన భక్తిభావన తొణికిసలాడుతున్న మీ పద్యంలోని కవితాత్మకత అభినందనీయంగా అలరారుతున్నది. దైవదత్తమైన ప్రతిభ, "శంకరాభరణం"లో అభ్యాసం మిమ్మల్ని భగవత్కవిగా ఉన్నతోన్నతకక్ష్యలకు అధిరోహింపజేస్తుండటం ఆనందావహంగా ఉన్నది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  5. చవులూరు మిఠాయిలు తొలి,
    జవరాలి పెదవుల తీపి చక్కెరలాపై,
    నవసానదశ కలుగకను
    శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్.

    రిప్లయితొలగించండి
  6. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, డిసెంబర్ 31, 2012 11:53:00 AM

    తవభవ నాశన మంత్రము
    భువిననృత వాక్యములను పూజ్యులు పలుకన్
    శివ తత్త్వమెరిగి కొలువుము
    శివ నామము, చేదు నరుల జిహ్వల, కెపుడున్

    రిప్లయితొలగించండి
  7. భవసాగరతారకమగు
    శివనామము "చేదు నరుల జిహ్వల కెపుడున్
    శ్రవణకఠోరం" బనియెడు
    ప్రవచనములు కల్లగాదె భావనకైనన్.

    రిప్లయితొలగించండి
  8. చెవి కింపగు మధురంబౌ
    శివనామమె భక్తుని మది జేయును మధురం
    శివ తత్వంబును మరచిన
    శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్

    రిప్లయితొలగించండి
  9. భవమును దాటించు వరము
    శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్
    చవి చూడకనున్న;నుమా
    ధవు జపమది జేర్చు మోక్షధామము కడకున్.

    రిప్లయితొలగించండి
  10. శివనామం బతిమధురము
    స్తవములలో కీర్తనల భజన ముఖ్యములన్
    శివ శివ! లేకుండినచో
    శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్

    రిప్లయితొలగించండి




  11. జవరాలి మోవి నానుచు
    భవబంధముల దగులుకొను పాపాత్ములకున్
    చివరి ఘడియలవరకు గన
    శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్.

    రిప్లయితొలగించండి
  12. ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    ఏల్చూరి వారి ప్రశంస లందిన మిస్సన్న గారికి,
    రామకృష్ణ గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    కమనీయం గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    ఏల్చూరి మురళీధరరావు గారూ,
    మిస్సన్న గారిని ప్రశంసిస్తూ ప్రోత్సహించినందుకు ధన్యవాదములు.
    *
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    రెండవ పాదంలో గణదోషం. ‘భువి ననృత’ అన్నప్పుడు ‘న’ లఘువే. ‘భువిని యనృత’ అంటే సరి!
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ‘మధురం’ అని ముప్రత్యయం లేకుండా ప్రయోగించారు. ‘చేయు మధిరిమన్’ అందామా?

    రిప్లయితొలగించండి
  13. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, డిసెంబర్ 31, 2012 9:41:00 PM

    మాష్టారికి నమస్సులు. ముందుగ మీరు వ(సూ)చించినటులే తలచి, “భువిన్+అనృత= భువిననృత అని యగునేమోనని, పదమధ్యస్తము గాన గురువుగా భ్రమపడితిని. మీ సవరణకు ధన్యవాదములు. సవరణ తరువాత

    తవభవ నాశన మంత్రము
    భువిని యనృత వాక్యములను పూజ్యులు పలుకన్
    శివ తత్త్వమెరిగి కొలువుము
    శివ నామము, చేదు నరుల జిహ్వల, కెపుడున్

    రిప్లయితొలగించండి
  14. నవనాగరికత మోజూలు
    నవధులు దాటగ పరమతపడుగులఁ నడవన్!
    భవహరమగు పంచాక్షరి
    శివనాము చేదు నరుల జిహ్వలకెపుడున1

    రిప్లయితొలగించండి
  15. గురువుగారూ ధన్యవాదాలు.
    డా. ఏల్చూరి మురళీధరరావుగారూ! కృతజ్ఞతాభి వందనములండీ. ఏమిటో నన్ను మునగ చెట్టు నెక్కిస్తూన్నారనిపిస్తోంది.
    నేమాని పండితార్యులూ, మీరు, గురువుగారూ, విష్ణునందనులు మొదలైన మీరందరూ చందన వృక్షాలైతే శంకరాభరణ వనంలో మీ ప్రక్కనున్న మామూలు మొక్కను.
    అంటిన కాస్త సువాసన. అంతే.
    మీ అందరి ఆశీస్సులూ, గురువుగారన్నట్లు మీ అందరి ప్రోత్సాహం ఉండాలి.
    మిత్రులందరి తోడూ ఉండాలి.

    రిప్లయితొలగించండి
  16. భవహరణము దగ జేయుచు
    చెవులకు నింపును గలిగించి చివరకు ముక్తిన్
    జవమున నిడు;నే సరణిన్
    శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్?

    రిప్లయితొలగించండి
  17. శివుడన భక్తియు లేకయె
    వివిధపు సినిమాలు జూడ విచ్చల విడిగా
    శివరాత్రి జాగరణమున;
    శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్

    రిప్లయితొలగించండి
  18. శివరాత్రి జాగరణమున
    నవలీలగ గోడ దూకి హడలుచు మదినిన్
    జవరాండ్రను జేరు తడవు
    శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్

    రిప్లయితొలగించండి