పూజ్యశ్రీ పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గురుదేవులకు
జన్మదిన ముహుర్ముహురావృత్త్యాకాంక్షా పురస్సరముగా
సమర్పించు
సర్వానంద సర్వాభ్యుదయ
సర్వశుభాకాంక్షలు
శ్లో.
శ్రీ నేమాని శుభాన్వవాయకలశీసింధో స్సుధాదీధితేః
నానాకావ్యవిచక్షణస్య సుమన
స్త్రైలిఙ్గభాషాకవేః
స్వీయోత్కృష్టకృతిప్రభూతయశసః
శ్రీపాదయోః సన్నిధౌ
నన్దోక్తిర్మమ
పణ్డితాఙ్కవిదుషో భూయాత్సదేయం ముదే.
గీ. ఆంధ్రపద్యవిద్య
కవధానభారతి
కంకితమ్మొసంగి యఖిలశక్తి
గ్రంథరచన సేయు కవిరాజచంద్రుని
జన్మదినము నాఁడు
సన్నుతింతు.
గీ. శంకరుఁడు శంకరార్యుల “శంకరాభ
రణ” ముఖమ్మున వేద్యమార్గమ్ము
మాకుఁ
జూపు నభిరూపు శుభరూపుఁ
జూచి ప్రోచుఁ
జిరముఁ బండిత నేమాని
గురువరేణ్య!
గీ. అమృతవాహిని మీ కవిత్వము; నితాంత
భక్తిపూర్ణము; లోకపావనము మనము;
మీ దయాంభోధి నోలాడి నాదు జన్మ
ధన్యతను గాంచె, చరితార్థతముఁడ నైతి.
సీ. ముగ్ధమన్మథకాంతి
మోహినీతనుకాంతి
మోహినీతనుకాంతి మోహనముగఁ
బద్మకేసరజటా పద్మరాగచ్ఛాయ
పద్మరాగచ్ఛాయఁ బాయఁజేయ
నీలాళి నీలాబ్జ నీలకంధరశోభ
నీలకంధరశోభఁ
దూలఁ బోలఁ
గాళిమ గజచర్మ
కల్పితాంబరదీప్తి
కల్పితాంబరదీప్తిఁ
గడకుఁ జిమ్మ
గీ. విశ్వవిభుఁ డోము మిమ్ముఁ
గవిత్వ తత్త్వ
సత్త్వసుమహత్త్వనిత్యత్వసంపదలను
గేహినీపుత్త్రపౌత్త్రాభిగీయమాన
శాంతిసుఖసర్వవృద్ధుల
సంతతమ్ము.
విధేయుఁడు,
ఏల్చూరి మురళీధరరావు