7, ఫిబ్రవరి 2013, గురువారం

పద్య రచన – 245

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. సూర్యుడు మంత్రపు బద్ధుడు
    ఆర్యా! నన్నొదలమనిన నా కుంతి కటన్
    వీర్యపు పుత్రుని యొసగెను
    కార్యము లెవ్విధియు విధికి కావలెనో !హా!

    రిప్లయితొలగించండి
  2. ముని యొసంగిన మంత్రము ముప్పు దెచ్చె
    కుంతి రవి తేజమును గని కోర్కె మీర
    మంత్రమును పరీక్షింపగ మదిని నెంచి
    తలచ నతడు తత్ క్షణమున తనయు నొసగె

    రిప్లయితొలగించండి
  3. చిన్న సవరణ తో...

    సూర్యుడు మంత్రపు బద్ధుడు
    ఆర్యా! నన్ వదలమనిన నా కుంతి కటన్
    వీర్యపు పుత్రుని యొసగెను
    కార్యము లెవ్విధిని విధికి కావలెనొ కదా !

    రిప్లయితొలగించండి
  4. వరమును బొంది జవ్వనియు భాస్కరు పుత్రుని బొందె, నేటి్ కే
    నరునికి నింద జేయకను నాలుక యూరక నుండ బోదికన్
    వరమది శాపమై వనిత బాలుని వీడుట గాక, నక్కటా!
    తరములు దాటినన్ విడని తప్పయి, నిందను మోయుచున్నదే!

    రిప్లయితొలగించండి
  5. మౌని దూ ర్వాసు వరమును మనన జేసి
    సూ ర్య భగవాను బిలువంగ సోము డంత
    కుంతి కిచ్చెను కర్ణుని , కొడుకు గాను
    పెళ్లి కానట్టి పిల్లకు ప్రియము తోడ .

    రిప్లయితొలగించండి
  6. మౌని దూ ర్వాసు వరమును మనన జేసి
    సూ ర్య భగవాను బిలువంగ సోము డంత
    కుంతి కిచ్చెను కర్ణుని , కొడుకు గాను
    పెళ్లి కానట్టి పిల్లకు ప్రియము తోడ .

    రిప్లయితొలగించండి
  7. కుంతి దుర్వాసు వరమున కోర రవిని
    దివ్య తేజోమయుని రూప తీక్షణమున
    పుట్టనంత సద్యో గర్భమున సుతుండు!
    కవచ కుండల సహితుండు కర్ణు డతడె!

    రిప్లయితొలగించండి
  8. మూడో పాదాన టైపాటు సవరణ:
    'పుట్టెనంత సద్యోగర్భమున సుతుండు'

    రిప్లయితొలగించండి
  9. తంత్ర మెరుగక పఠియించె మంత్ర మహిమ
    ఆది దేవుడు వరమిచ్చె మోద మలర
    కుంతి పొందెను కొమరుని వింత గాను
    దైవ ఘటనల నెంచగ నెవరి తరము ?

    రిప్లయితొలగించండి
  10. బాల్య చాపల్యమున కుంతి భాను జూచి
    మంత్ర పఠనమ్ము జేసెను మాలి వేడి
    యర్కు డల్లదె దిగివచ్చె నామె యెదుట
    పండు వెన్నెల గాసెను పట్టపగలు.

    మ్రాన్పడె మిత్రుండెదురుగ
    కన్పడగా కుంతి యపుడు కలవరమై తా
    పాన్పున దిగ్గున లేచెను
    తన్పగ నా కన్య నంత తపనుడు పలికెన్.

    తరుణీ! వచ్చితి నీకిడ
    వరపుత్రుని స్వీకరింపు బాలుని యనుచున్
    కరముల నుంచగ బిడ్డను
    పరితాపము తోడ కుంతి పలికెను రవితో.

    అయ్యో !భాస్కర! న్యాయమె
    చెయ్యగ నే చిన్న తప్పు చినతన వాంఛన్
    చయ్యన బిడ్డ నిడన్ మా
    యయ్యకు నాకునపకీర్తి యౌ గాదె కటా.

    ముని వాక్కు లగునె యనృతము
    చనియెను నీ కన్యతనము సడలదనుచునా
    యిను డగ్ని కాల్చ కుండునె
    తను దాకిన తెలియదనుచు ధరణిని వింటే.

    రిప్లయితొలగించండి
  11. సేకరణ : సాహిత్యాభిమానిగురువారం, ఫిబ్రవరి 07, 2013 9:24:00 PM

    అ మ్మంత్రముఁ దనదగు హృద
    యమ్మున నక్కన్య నిలిపి యాదిత్యున క
    ర్ఘ్య మ్మెత్తి నాకు నిమ్ము ప్రి
    యమ్మున నీ యట్టి పుత్త్రు నంబుజమిత్త్రా.

    అని కేలు మొగిచి నిలిచిన
    వనజాయతనేత్ర కడకు వచ్చెను గగనం
    బున నుండి కమలమిత్త్రుఁడు
    తన తీవ్రకరత్వ ముడిగి తరుణ ద్యుతితోన్.

    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    'బద్ధుం డార్యా...... పుత్రుని నొసగెను' అని సవరించండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు.
    వీడుట గాక యక్కటా.... అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    దుర్వాసుడే... దూర్వాసుడు కాదు. కుంతికి కొడుకు నిచ్చింది సోముడు (చంద్రుడు) కాదు కదా...
    సూర్య భగవాను బిలువంగ స్యోను డంత..... అందాం.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    చివరి పాదంలో యతి తప్పింది.
    దైవ ఘటనల నెంచగ తర మెవరికి ? ..... అందాం.
    *
    మిస్సన్న గారూ,
    కుంతీ భాస్కర సంవాదము అనదగిన మీ ఖండకృతి మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    సాహిత్యాభిమాని గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. శంకరార్యా ! ధన్యవాదములు.
    మీ సూచనతో...

    సూర్యుడు మంత్రపు బధ్ధుం
    డార్యా! నన్ వదలమనిన నా కుంతి కటన్
    వీర్యపు పుత్రుని నొసగెను
    కార్యము లెవ్విధిని విధికి కావలెనొ కదా !

    రిప్లయితొలగించండి




  14. అయ్యో మంత్రజపమ్మున
    నయ్యాదిత్యుని బిలువగ నతడు రయమునన్
    దొయ్యలి కుంతికి వరముగ
    నెయ్యమ్మున దా గొమరుని నిచ్చెన్ దయతో.

    నాటినుండి యపరిణీత నేటి వరకు
    గర్భవతి యైన యపవాదు దుర్భరమ్ము
    సంఘ నిందకు బాల్పడు సంఘటనల
    గన్య జీవితమెంతయు గష్టతరము.

    రిప్లయితొలగించండి
  15. కమనీయం గారూ,
    మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి