మధువున్ గ్రోలు సీతాకోకకు పెట్టలేదుప్రకృతి అప్రూవల్ ప్రాసెస్ మరి ఈ బ్లాగ్ మధువున్ గ్రోలు 'కో' కామెంటర్ల కేలపెట్టిరి అయ్యవారు అప్రూవల్ ప్రాసెస్ ?చీర్స్జిలేబి.
చిలుకవు నీవేనా విరి చిలుకగ నాతేనె గ్రోలి చిలికెద వందాల్ చిలికెడు రంగులతో వచ్చిలు కదలక నుండరాదె సీతా కోకా !
దీక్ష తోడ తపము చేసి దివ్య తనువుగాంచె పూర్వపు దురవస్థ కరగిపోవచెలగు చుండె సీతా కోక చిలుక యగుచుపూవు పూవులలో మధువులను గొనుచు
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి !భూమ్మీద అవతరించిన మన్మథుడేనేమో సీతాకోక చిలుక !మధువును త్రాగే సమయంలో మన్మథలీల కూడా (చెట్లకు)జరుపుతాయి !తద్వారా వృక్షములనూతద్వారా ప్రాణులకూ ప్రాణభిక్ష తద్వారా సృష్టి నశించ కుండా కాపాడుతుంటాయి !(తేనెటీగలూ,సీతాకోకచిలుకలూ అంతరించిన 5 సంవత్సరములకుభూమ్మీద ప్రాణులన్నీ అంతరిస్తాయని ఎక్కడో చదివాను)01)_______________________________మధువును గ్రోలెడి చిలుకలుమదినే యవి దోచుకొనును - మహ చందముతో !మధువును గ్రోలెడి తరుణముమదనునికే మారు రూపు - మధుపంబవనిన్ !_______________________________
కొత్తరూపును కీటకమ్మది కోరివచ్చిన నేమి? యీతిత్తి తోలును వీడి చేరుము దేవదేవుని సన్నిధిన్.మత్తు వీడుము, జన్మ మృత్యువు- మాయమర్మమె కాదొకో!చిత్తమందున భక్తినిల్పుచు సేవజేయుచు నుండుమా!
కీట కంబుల యందున మేటి యైనకీ ట కంబు సీ తాకోక కీట కంబుచిలుక జాతికి వచ్చును , జిందు లేయుఅంద మందున సాటిది యెందు లేదు .
మధుపము ప్రీతిగ కులుకుచు మధువును గ్రోలంగ వచ్చె మకర ధ్వజుడై !సుధ లొలుకు విరుల సుందరి ముదముగ నందించె మధువు పులకాంకితయై !
సీతాకోకచిలుక చిత్రాన్ని చూచి స్పందించి మంచి పద్యాలను వ్రాసిన కవిమిత్రులు...గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,పండిత నేమాని వారికి, వసంత కిశోర్ గారికి, లక్ష్మీదేవి గారికి, సుబ్బారావు గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, అభినందనలు, ధన్యవాదాలు.
సీతా కోక చిలుకలైనీ తెఱగున గుడి బడులన నింతులగు పడన్!చైతన్యమదె నొసగెనానేతన్నలు రంగు రంగు నేతలు నేయన్!
సీత కరుణ రసమ్మును చిలుక, చిలుక!సీత కట్టిన కోకయె సేల నీకుఅమ్మ నామము మరువక యమరె నేమొనీదు నామమందున జూచి నిన్ను పలుక.
పాప కార్యమెల్ల వల్మీక మందునశుద్ధి కాంబడి యట పరిశుద్ధు డైన వాడు బోయ వాడు వాల్మీకి యయ్యెనేరామ గాథ వ్రాసె రమ్య ముగను.అటులె పురుగు రూపునొదలి యమరి యున్నగూటి నుండి బయటపడ కొట్టుకొనుచు వచ్చి నావు నీవెగురుచున్ స్వచ్చ మగుచుబాల వృద్ధుల నానంద పరచుటకును
సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. *తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ, మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండిమధువున్ గ్రోలు సీతాకోకకు పెట్టలేదు
ప్రకృతి అప్రూవల్ ప్రాసెస్ మరి ఈ బ్లాగ్
మధువున్ గ్రోలు 'కో' కామెంటర్ల కేల
పెట్టిరి అయ్యవారు అప్రూవల్ ప్రాసెస్ ?
చీర్స్
జిలేబి.
చిలుకవు నీవేనా విరి
రిప్లయితొలగించండిచిలుకగ నాతేనె గ్రోలి చిలికెద వందాల్
చిలికెడు రంగులతో వ
చ్చిలు కదలక నుండరాదె సీతా కోకా !
దీక్ష తోడ తపము చేసి దివ్య తనువు
రిప్లయితొలగించండిగాంచె పూర్వపు దురవస్థ కరగిపోవ
చెలగు చుండె సీతా కోక చిలుక యగుచు
పూవు పూవులలో మధువులను గొనుచు
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
భూమ్మీద అవతరించిన మన్మథుడేనేమో సీతాకోక చిలుక !
మధువును త్రాగే సమయంలో మన్మథలీల కూడా (చెట్లకు)జరుపుతాయి !
తద్వారా వృక్షములనూ
తద్వారా ప్రాణులకూ ప్రాణభిక్ష
తద్వారా సృష్టి నశించ కుండా కాపాడుతుంటాయి !
(తేనెటీగలూ,సీతాకోకచిలుకలూ అంతరించిన 5 సంవత్సరములకు
భూమ్మీద ప్రాణులన్నీ అంతరిస్తాయని ఎక్కడో చదివాను)
01)
_______________________________
మధువును గ్రోలెడి చిలుకలు
మదినే యవి దోచుకొనును - మహ చందముతో !
మధువును గ్రోలెడి తరుణము
మదనునికే మారు రూపు - మధుపంబవనిన్ !
_______________________________
కొత్తరూపును కీటకమ్మది కోరివచ్చిన నేమి? యీ
రిప్లయితొలగించండితిత్తి తోలును వీడి చేరుము దేవదేవుని సన్నిధిన్.
మత్తు వీడుము, జన్మ మృత్యువు- మాయమర్మమె కాదొకో!
చిత్తమందున భక్తినిల్పుచు సేవజేయుచు నుండుమా!
కీట కంబుల యందున మేటి యైన
రిప్లయితొలగించండికీ ట కంబు సీ తాకోక కీట కంబు
చిలుక జాతికి వచ్చును , జిందు లేయు
అంద మందున సాటిది యెందు లేదు .
మధుపము ప్రీతిగ కులుకుచు
రిప్లయితొలగించండిమధువును గ్రోలంగ వచ్చె మకర ధ్వజుడై !
సుధ లొలుకు విరుల సుందరి
ముదముగ నందించె మధువు పులకాంకితయై !
సీతాకోకచిలుక చిత్రాన్ని చూచి స్పందించి మంచి పద్యాలను వ్రాసిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
వసంత కిశోర్ గారికి,
లక్ష్మీదేవి గారికి,
సుబ్బారావు గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
సీతా కోక చిలుకలై
రిప్లయితొలగించండినీ తెఱగున గుడి బడులన నింతులగు పడన్!
చైతన్యమదె నొసగెనా
నేతన్నలు రంగు రంగు నేతలు నేయన్!
సీత కరుణ రసమ్మును చిలుక, చిలుక!
రిప్లయితొలగించండిసీత కట్టిన కోకయె సేల నీకు
అమ్మ నామము మరువక యమరె నేమొ
నీదు నామమందున జూచి నిన్ను పలుక.
పాప కార్యమెల్ల వల్మీక మందున
రిప్లయితొలగించండిశుద్ధి కాంబడి యట పరిశుద్ధు డైన
వాడు బోయ వాడు వాల్మీకి యయ్యెనే
రామ గాథ వ్రాసె రమ్య ముగను.
అటులె పురుగు రూపునొదలి యమరి యున్న
గూటి నుండి బయటపడ కొట్టుకొనుచు
వచ్చి నావు నీవెగురుచున్ స్వచ్చ మగుచు
బాల వృద్ధుల నానంద పరచుటకును
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.