6, ఫిబ్రవరి 2013, బుధవారం

దత్తపది - 30 (తల)

కవిమిత్రులారా,
"తల" శబ్దాన్ని శిరస్సు అనే అర్థంలో కాకుండా
నాలుగు పాదాలలో ప్రయోగిస్తూ
మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.

23 కామెంట్‌లు:

 1. దుర్యోధనుడు శ్రీ కృష్ణునితో....

  తలపున పాండవులకు భూ
  తలమును సుంతైన ననీయ తథ్యము లేదే
  తలచితి యుద్ధము నే కూ
  తలనే చాలించి కృష్ణ తరలుము చాలున్.
  రిప్లయితొలగించండి
 2. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, ఫిబ్రవరి 06, 2013 8:23:00 AM

  శాస్త్రీజీ.చాల బాగుంది. మహాత్ముల హితోక్తులు దుష్టులకు కూతలుగానే ఉంటాయి.సందర్భోచిత పదం ప్రయోగించారు.అద్భుతం.అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. తలమే యీ మయసభ విం
  తల దెల్పగ మిగుల నద్భుతమ్ములు కద భూ
  తలమున తలమానికమని
  తలచుట తోడనె యసూయ దనరె మనమునన్

  రిప్లయితొలగించండి
 4. విద్యుత్కోత వలన ఆలస్యమయినది.


  తలపుల సుభద్ర నిండగ
  తలచుచు నుండెను కిరీటి, దరిజేరగ కో
  తల గోసెను, బావను గని
  తలకింపక మారువేష ధారిగ నిలిచెన్.

  బావను= బలరాముని, తలకింపక = చలింపక

  రిప్లయితొలగించండి
 5. తలచియు పాండవ బలమును
  తలమే మఱి వారి యెదుట తలపగ మనకున్
  తలపుల యందును నైనను
  తలపగ నిక వారి నిలను దరమే నీ కున్ ?

  రిప్లయితొలగించండి
 6. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, ఫిబ్రవరి 06, 2013 10:45:00 AM

  తలపక హితములొకపరి తారతమ్య
  తలపుల తగవు లాడుచు తనరుచు నిరు
  తలముల బలాబలంబులన్ తలచుకొనుచు
  తలపడిరికురుపాండవ తనయులంత.

  రిప్లయితొలగించండి
 7. శ్రీ తోపెల్ల వారి పద్యములో "తారతమ్య తగవులు" అనే సమాసము సాధువు కాదు. అందుచేత మొదటి పాదమును ఇలాగ మార్చుదాము:
  తలపక హితమ్ము లతివిరోధమ్ము చెలగు ....
  స్వస్తి

  రిప్లయితొలగించండి 8. భూతలమ్మున నిట్టి యద్భుతము కలదె?
  అతల వితల సుతలముల నైనగాని
  విభ్రమము గలిగించె నీ వింత గేహ
  మిద్ది దైవికమె మనుజనిర్మితముకాదు.

  (మయసభలో దుర్యోధనుని స్వగతం.)

  రిప్లయితొలగించండి
 9. కురుక్షేత్రమున అర్జునునికి కృష్ణుడి గీతా బోధ:

  తలపున విలాప మాపుము
  కొలతల తరుణమ్ము గాదు కొట్టెడు వేళన్!
  తలచిన నను మాయ తొలఁగు
  తలపడుటే నీకు నిపుడు ధర్మము విజయా!/నరుడా!

  రిప్లయితొలగించండి
 10. విదుర వచనము :

  తలపులనైన పాండవులు తప్పరు సత్యము ధర్మ మార్గమున్
  తలపులనైన వారలకు తప్పగు కీడును సేయ నీచమౌ
  తలపుల కర్ణుడాదులును తప్పుడు బోధలు చేయ దుష్టమౌ
  తలపుల నీ కుమారుడదె తప్పెను ధర్మము కౌరవేశ్వరా!

  రిప్లయితొలగించండి
 11. తలపోయక మంచిచెడుల
  తలకొని దుశ్శాసనుండు ద్రౌపది నీడ్చెన్
  తలసూపె కౌరవ క్షయము
  తలడిల్లిరి పాండుసుతులు దారను గనుచున్.

  రిప్లయితొలగించండి
 12. తలచగ వ్యాసుడు మదిలో
  తలపోసి భారత కధను తలమున్కలు గా !
  తమిగొని తలచుచు తాల్మిని
  తలకొని రచియించె ధరకు తలమానికమై !

  రిప్లయితొలగించండి
 13. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, ఫిబ్రవరి 06, 2013 8:55:00 PM

  రాజేశ్వరి అక్కయ్యగారూ! 3 పాదం ప్రాస తప్పింది.చూడమనవి.

  రిప్లయితొలగించండి
 14. డా ప్రభల రామలక్ష్మిబుధవారం, ఫిబ్రవరి 06, 2013 11:10:00 PM

  తలచని ఇడుములు పెక్కులు
  తలకొనుచుండంగ ద్రుపదతనయ తలంచెన్|
  తలపడవలయును తధ్యము
  తలమే కురువంశ కుటిలతనమును తలపన్||

  రిప్లయితొలగించండి
 15. అతల వితల సుతలము తలాతలమున
  నెందు డాఁగుబో నాతని నింక విడువ
  నిక్కము తొడలు తెగఁ జీల్చి నెత్తురు కడు
  పార త్రావెద నే పాండవాగ్రజేయ!
  మనవి: సాధారణంగా నాలుగు పాదాలలో ఉండాల్సిన అన్ని తలలు మొదటి పాదంలోనే పెట్టాను.

  రిప్లయితొలగించండి
 16. అవును కదా ! తలతో తల పనిచేయ లేదు . సోదరులు తోపెల్ల వారికి ధన్య వాదములు ఇప్పుడు మళ్ళీ తల

  తలచగ వ్యాసుడు మదిలో
  తలపోసి భారత కధను తలమున్కలు గా !
  తలవంచక తలచి తాల్మిని
  తలకొని రచియించి ధరకు తలమానిక మై !

  రిప్లయితొలగించండి

 17. హే కృష్ణా అని తలపోసి తనువు మరవంగ
  పాంచాలి అయ్యె శరణాగత లావణ్య మూర్తిగ
  అనితలమున భీముడు ప్రతినపూర్తి గావించె
  అవతల అయ్యవారి టపా కంచికి మన మింటికి !


  జిలేబి.

  రిప్లయితొలగించండి
 18. అరణ్యవాసములో ధర్మ రాజుతో భీముడు పలికిన మాటలు:-

  తాతల ప్రాతల కూతలను బలికి
  ********చేతలకు దిగవు శీతలముగ
  కురు కాంతల నుదిటి కుంకుమ దాతలా
  ********వెతలను బొందుచు విధి యనెదవు
  భూతలమంతకు నేతలమని నిక్కు
  ********భ్రాతల కుశలమె ప్రీతి యనుచు
  అడవి లతల మధ్య గుడిలోని శిల వోలె
  ********తలపేమి పలకవు ధర్మ రాజ!

  అవతల జరుగు రణరంగమందునెదిరి
  భీతిఁ జెందు నర్జున వింటి మ్రోతలకును
  భీముని పిడికిలి గనిన ప్రేతలగును
  బెమ్మ వ్రాతల తీరుకు బెదిరి పోవు!!

  రిప్లయితొలగించండి
 19. ఈనాటి దత్తపదిని సమర్థంగా ప్రశంసనీయంగా పూరించిన కవిమిత్రులు...
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  పండిత నేమాని వారికి,
  లక్ష్మీదేవి గారికి,
  సుబ్బారావు గారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
  కమనీయంగారికి,
  సహదేవుడు గారికి,
  మిస్సన్న గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  డా ప్రభల రామలక్ష్మి గారికి,
  చంద్రశేఖర్ గారికి,
  జిగురు సత్యనారాయణ గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 20. 'తల ' యుండవలయు నందున
  'తలకానిది ' యుండవలయు తగినట్లనగా
  తలగాని తలల తమ రా
  తలలోనే జూపిన ' కవి 'తలకే జయహో!

  రిప్లయితొలగించండి
 21. గురువు గారికి ధన్యవాదములు .గురుదేవులకు, శ్రీ నేమాని పండితవర్యులకు పాదాబివందనములతో
  దుర్యోధనుడు శ్రీ కృష్ణునితో
  ========*========
  తాతల కాలపు నీతులు
  శీతల మగు కృష్ణ |నేడు చెలువము జాలున్
  దూతలను బంప దగునే ?
  భూతలమున సేవకులకు భోగము లేలన్ ?


  రిప్లయితొలగించండి