1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 954 (తురకలు సంధ్య వార్తురట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తురకలు సంధ్య వార్తురట తోయములన్‌ గొనితెమ్ము జానకీ!
(ఇది ప్రసిద్ధమైన సమస్య. గతంలో పెక్కు అవధానాలలో ఇవ్వబడింది)
ఈ సమస్యను సూచించిన శ్రీరామచంద్రుడు గారికి ధన్యవాదములు.

14 కామెంట్‌లు:

  1. గురు వొకరుండు శిష్యులకు గుప్తముగా నిడె సంజ్ఞ లందులో
    తు.ర.క. లటంచు వర్ణములతో జను మువ్వురు విప్ర బాలకుల్
    వరహృదయాన వచ్చిరదె వారల నొప్పుగ నాదరించు మా
    తురకలు సంధ్య వార్తురట తోయములన్ గొనితెమ్ము జానకీ!

    రిప్లయితొలగించండి
  2. గురుకులమందు వేదముల గుర్వులు జెప్పినయట్లు నేర్చిరే
    చురుకుగ పుత్ర రత్నములు చూడగ నింటికి వచ్చినారు యా
    తురతను వచ్చె మిత్రులట తొందర బెట్టుచునుండె వైశ్యులున్
    తురకలు, సంధ్య వార్తురట తోయములన్ గొనితెమ్ము జానకీ!

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    నవాబుల సంస్థానంలో పనిజేసే మేనమామ, వారి మిత్రులూ
    కలసి యింటికి వచ్చినప్పుడు ఒక గేస్తు :

    01)
    _________________________________________

    తురకలు మంచి మిత్రులట - దూరపు యాత్రను చేయు దారిలో
    తురగము మీద వచ్చిరదె - దొడ్డగు మామయు ; వారి మిత్రులౌ
    తురకలు ; సంధ్య వార్తురట - తోయములన్ గొని తెమ్ము జానకీ
    తురితము రమ్ము, వీరిపుడు - దూరపు యాత్రకు , పోయి రావలెన్ !
    _________________________________________
    తురితము = శీఘ్రము
    దొడ్డగు = గొప్పవారు(గౌరవనీయులు )
    *****

    రిప్లయితొలగించండి
  4. అయ్యా! శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ! శుభాశీస్సులు.
    నిన్నటి మీ పూరణలో "ఖర్మ" అని వాడేరు. సంస్కృత శబ్దము "కర్మ" తెలుగులో కర్మము అని వాడుట వ్యాకరణ సమ్మతము. ఖర్మ అనే ప్రయోగము సాధువు కాదు. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. అయ్యా,

    ఇవ్వాళ్టి సమస్యా పూరణం, అభ్యంతర కర మైన రాతల క్రింద సెక్షన్ నూట నలభై నాలుగు మీ బలాగు కి సంధించ వచ్చని నా సదభిప్రాయం.

    మీ అభిప్రాయాన్ని చెప్పండి.


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  6. ఈనాటి సమస్యకు ఇప్పటివరకు మూడూ పూరణలే వచ్చాయి. ఆ మూడూ వైవిధ్యంగా దేనికదే ఉత్తమంగా ఉన్నవి. పూరణలు పంపిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    వసంత కిశోర్ గారికి,
    అభినందనలు, ధన్యవాదములు...
    *
    అమ్మా జిలేబీ,
    ఈ సమస్య నా స్వకపోల కల్పితం కాదు. చాలా ప్రసిద్ధమూ, గతంలో ఎన్నో అవధానలలో పృచ్చ చేయబడిందే అని మనవి చేసాను కూడా...
    అయినా నా మీద చర్య తీసుకోవాలంటే సెక్షన్ 144 కంటే నామీద ఓ ఫత్వా జారీ చేయించండి. ఓ పనైపోతుంది.

    రిప్లయితొలగించండి
  7. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, ఫిబ్రవరి 01, 2013 10:20:00 PM

    గురువులు నేర్ప వేదమునకుంఠిత దీక్షను పూర్తి జేయగన్
    సరగున పాదుషాకడను శాస్త్రపు పండితుడవ్వ నొక్కనా
    డు, రయమునేగ పంపనొకడోలిని, తొందర జేయ సేవకుల్
    తురకలు, సంధ్యవార్తురట తోయములన్ గొని తెమ్ము జానకి !

    రిప్లయితొలగించండి
  8. గురువులు స్నాన మాడ చనె కోరుచు యానది మార్గ మందునన్
    పరుగున పూజ చేతునని పామరు డొచ్చెను పాప మెంచకన్
    వెఱువక నీసడించె నట వేలుపు లొక్కటె బేధ మేటికిన్
    గురువులు శాంతి నొంది యనె కోరిక మీరగ దైవ మంచు నీ
    తురకలు సంధ్య వార్తు రట తోయములన్ గొని తెమ్ము జానకీ

    రిప్లయితొలగించండి
  9. కాల వశమున వాల్మీకి నందు కలిగిన మార్పులు గని
    ముని వాటిక యున్న పక్షి రాజములు అచ్చెరువొందే
    సాధు క్రియల్ కార్యముల్ మేలుగాదే , జిక్కు
    తురకలు సంధ్య వార్తురట తోయములన్‌ గొనితెమ్ము జానకీ!

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  10. మరకయొ మానితమ్మొ యది మహ్మదు బోధల ప్రేరణమ్ముతో
    వెరువక గూలగొట్టి మన వేల్పుల వాటిక లందు బీరమున్
    బరమును నిల్పినారు నల ప్రార్ధన దోడుగ బశ్చిమాశమున్
    దురకలు సంధ్య వార్తురట ! తోయములన్ గొనితెమ్ము జానకీ !

    సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగఛ్ఛతి ! శ్రీ కేశవం ప్రతిగఛ్ఛతి !

    రిప్లయితొలగించండి
  11. సరగున వచ్చినారు మన సంతతి మిత్రులఁ గూడి సంధ్యలో
    మరువక సంధ్యలందున నమాజులఁ జేయుదురంట మిత్రులౌ
    తురకలు, సంధ్యవార్తురట తోయములన్ గొనితెమ్ము జానకీ
    తరుణము మీరకుండగనె! ధన్యుల మీగతి పుత్రులుండగన్!

    రిప్లయితొలగించండి
  12. మరువగలేని రీతినిల మందల మూకల నోళ్ళుమూయుచున్
    కరచుచు భాజపా జనుల కన్నులు మూయుచు వోట్లకోసమై
    వరుసగ జంద్యమూనుచును వాసిగ రాహులు గాంధి వోలెడిన్
    తురకలు సంధ్య వార్తురట తోయములన్‌ గొనితెమ్ము జానకీ!

    రిప్లయితొలగించండి