14, ఫిబ్రవరి 2013, గురువారం

పద్య రచన – 252

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

 1. పుత్తడి బొమ్మయో యనెడు ముద్దులగుమ్మ వధూలలామయై
  యత్తరి నొప్పుచుండె నచలాత్మజ నర్చన జేసి, బుట్టలో
  నెత్తుక పెండ్లి పీట కడ కిమ్ముగ జేర్చుచు మామలామెను
  వ్వెత్తున బొంగుచుండి రట నిమ్ముగ గూర్చుచు నాశిషమ్ములన్

  రిప్లయితొలగించండి
 2. బుట్టలో నీవు ఈ రోజు సిగ్గుల మొగ్గ
  మరో రోజు నీవు "ఆడ" పిల్లవవుతవమ్మా
  నీవు ఎక్కడ వున్నా మా మనస్సు నీతోనే
  నీ మనస్సులొ మాకు చోటుంచమ్మా!

  రిప్లయితొలగించండి
 3. అమ్మకు పూజలు సల్పిన
  అమ్మాయిని బుట్టనుంచి యానందముతో
  అమ్మమ్మ తనయులప్పుడు
  నిమ్మళముగ మోయుచుండె నిజ వరు కడకున్.

  రిప్లయితొలగించండి
 4. @Pandita Nemani గారూ వారెవ్వ! ఏమి వర్ణించారండీ.

  "పుత్తడి బొమ్మయో యనెడు ముద్దులగుమ్మ వధూలలామయై
  యత్తరి నొప్పుచుండె నచలాత్మజ నర్చన జేసి, బుట్టలో

  రిప్లయితొలగించండి
 5. ముద్దుల మేన కోడలిని, పూజ్యులు పెద్దలు మెచ్చునట్లుగా
  పెద్దలు మేనమామలిట పెండ్లికుమార్తెగ నుంచి బుట్టలో
  నొద్దికతోడ పట్టి, వరుఁడుండిన వేదిక చేర్చి, యామెకున్
  సుద్దులు చెప్పి పీఠమున శోభిలఁ జేసిరి బాధ్యతాధృతిన్.

  రిప్లయితొలగించండి
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  మేనకోడలి వివాహ సమయములో

  01)
  _______________________________

  అమ్మాయి వివాహ సమయం
  బమ్మాయిని మేన మామ - లానందముతో
  నమ్మాయి గంప నిడుకొని
  అమ్మో యనకుండ మోయు - నవ్విధి గనుడీ !
  _______________________________

  రిప్లయితొలగించండి
 7. అయ్యా! శ్రీ లక్కరాజు వారూ!
  శుభాశీస్సులు.

  మిత్రు లందరి పూరణలు చాలా బాగుగ నున్నవి. అందరికి అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ రవికుమార్ గారి భావము చాల బాగుగనున్నది. ఆ భావమునకు ఒక చిన్న పద్యరూపము:

  నేడొక సిగ్గుల మొగ్గవు
  వేడుకగా "ఆడ పిల్ల" వీ వికపై నీ
  వేడ నలరు చున్నను మము
  గూడ నిలువనిమ్ము నీదు గుండియలోనన్

  రిప్లయితొలగించండి
 9. ఎల్లరు చూడగన్ వధువు నెత్తుచు గంపన మేనమామలున్
  మెల్లన బోవుచున్ గదిసి మెచ్చుచు నందఱు మేలమాడగన్
  అల్లన మ్రోసి రా వరుని యంకకు కోడలు సిగ్గు లొల్కగన్
  ఉల్లము పొంగె తండ్రికిని యుంచిరి యామెను పెళ్లి పీటలన్

  రిప్లయితొలగించండి
 10. పెండ్లి కూతురు నెత్తుకు బెండ్లి దరికి
  వచ్చు చుండిరి మామలు వడి వడిగను
  మూర్త మగు చుండె గాబోలు మోము లందు
  సంత సంబులు గనుపించె సర్వు లందు

  రిప్లయితొలగించండి
 11. శ్రీపంచమి వసంతపంచమి లలితాపంచమి అని నానా రీతులలో తెలియబడే పర్వదినము సందర్భముగా మన బ్లాగు మిత్రులందరికి శుభాకాంక్షలు.

  సరస్వతీ మాతృ కృపా కటాక్షము అందరి యెడల ప్రసరించాలి అనీ మనమందరము సౌభ్రాత్రముతో సౌజన్యముతో సదభిప్రాయములతో ఒక కుటుంబ సభ్యులుగ మెలగాలి అనే నా ఆకాంక్ష. అందరూ దీనిని మన్నించుతారని ఆశించుచున్నాను.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి


 12. బుట్ట తో వచ్చెను బంగరు ముద్దుగుమ్మ
  మా అయ్యరు వారు ఆహా ఓహో అనిరి
  తెలియక పోయె,తానె ఆ బుట్టలో పడు నని,
  కాదా మరి ఇది జిలేబీ చమత్కారముల్!

  జిలేబి.

  రిప్లయితొలగించండి
 13. మేన మామ లైన మీ యమ్మ తమ్ములు
  గంపలోన బెట్టి కన్య నిన్ను
  పెళ్లి కూతుఁ జేసి వేదిక మీదకు
  చేర్తు రమ్మ నీకు శ్రేయు లగుచు

  రిప్లయితొలగించండి
 14. మేన మామ లైన మీ యమ్మ తమ్ములు
  గంపలోన బెట్టి కన్య నిన్ను
  పెళ్లి కూతుఁ జేసి వేదిక మీదకు
  చేర్తు రమ్మ నీకు శ్రేయు లగుచు

  రిప్లయితొలగించండి
 15. మేన మామ లైన మీ యమ్మ తమ్ములు
  గంపలోన బెట్టి కన్య నిన్ను
  పెళ్లి కూతుఁ జేసి వేదిక మీదకు
  చేర్తు రమ్మ నీకు శ్రేయు లగుచు

  రిప్లయితొలగించండి
 16. మేన మామ లైన మీ యమ్మ తమ్ములు
  గంపలోన బెట్టి కన్య నిన్ను
  పెళ్లి కూతుఁ జేసి వేదిక మీదకు
  చేర్తు రమ్మ నీకు శ్రేయు లగుచు

  రిప్లయితొలగించండి
 17. మేన మామ లైన మీ యమ్మ తమ్ములు
  గంపలోన బెట్టి కన్య నిన్ను
  పెళ్లి కూతుఁ జేసి వేదిక మీదకు
  చేర్తు రమ్మ నీకు శ్రేయు లగుచు

  రిప్లయితొలగించండి
 18. బుట్టను గూరుచుండినది ముగ్ధ వధూమణి సిగ్గుమొగ్గయై
  గట్టిగ పట్టుకొండచట గాంచుడు మామలు! యూపిరిన్ బిగన్
  బట్టుక చూచెడిన్ వరుడు పట్టగ లేక మనస్సు ప్రక్కకున్
  దట్టిన చాపు మాటునను తప్పని బ్రహ్మ వచింప నవ్వుచున్.

  రిప్లయితొలగించండి
 19. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ.గురువారం, ఫిబ్రవరి 14, 2013 9:17:00 PM

  పెండ్లిపీటల మీదను పెండ్లికొడుకు
  వలచి వేచి యున్నాడుట వధువు కొరకు
  గౌరిపూజను చేయగ ఘనముగాను
  మేనమామలు మోయగ మీన నేత్రి
  బుట్టలో వచ్చె వరునుని బుట్ట బెట్ట.

  రిప్లయితొలగించండి
 20. కెంపులు పూసెను వధువుకు
  చెంపలపై, మామలేమొ చేతుల నెత్తెన్
  గంపను, కుదురుగ కూర్చొనె
  సొంపుగ వరు జేర, మిగుల సోయగ మొప్పన్.

  రిప్లయితొలగించండి
 21. డా. ప్రభల రామలక్ష్మిగురువారం, ఫిబ్రవరి 14, 2013 10:17:00 PM

  "తండులమ్ముల నుంచిరి తక్కువగను
  పట్టుపుట్టము కట్టిరి భారమనక
  ఎత్తుకొనిరండు మామయ్యలెందరైన
  వేగముగ రండి లగ్గపు వేళయాయె".

  రిప్లయితొలగించండి
 22. @మిస్సన్న గారు -- వావ్.

  బుట్టను గూరుచుండినది ముగ్ధ వధూమణి సిగ్గుమొగ్గయై

  రిప్లయితొలగించండి 23. కనులకు కాటుక,కంఠాన కాంచన
  హారముల్ మిగుల సోయగము నింప,
  హొంబట్టు వస్త్రమ్ము హొయలు మీరగదాల్చి,
  చెక్కిలి చేర్చుక్క చెలువు మీర
  గౌరీవ్రతము నిష్ఠ గావించి మ్రొక్కిడి
  పెద్దల దీవనల్ పెంపుమీర
  పరిణయకళ మోము పండువెన్నెల గాయ
  ముద్దార నొడలును ముడుచుకొనగ

  మేనమామలు గంపలో మెల్లగాను
  పెండ్లికూతురు నందుంచి పేర్మితోడ
  వేదికకు దెచ్చుచున్నారు వేడ్కమీర
  తెలుగునాట వివాహంపు జిలుగులివియె.

  రిప్లయితొలగించండి