10, ఫిబ్రవరి 2013, ఆదివారం

పద్య రచన – 248

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

37 కామెంట్‌లు:

 1. అట్టిట్టనకను పొట్టను
  పట్టించెద నట్టు పట్టు బట్టుఛు బాగా
  దట్టించ నుల్లి ముక్కలు
  కొట్టిన కొబ్బరి తొ ' చట్ని ' కోరుచు పెట్టన్.

  రిప్లయితొలగించండి
 2. శాస్త్రిగారూ, ఇప్పుడే దోశ, కొబ్బరి చట్నీ (ఉల్లిముక్కలు మినహా) లాగించి బ్లాగు తెరిచాను, మీ పద్యం చదివాను.

  రిప్లయితొలగించండి
 3. చంద్ర శేఖర్ గారూ ! 'అట్టులనా' ...అయినా పరవాలేదు. ఈ సారి ఉల్లి పాయలతో లాగించండి. అట్లేనా...

  రిప్లయితొలగించండి
 4. జగతిని ఖ్యాతిగడించిన
  మిగుల రుచికరమగు దోశ మేలగు; నెపుడే
  వెగటును కలిగింపనిదగు;
  తగురీతిగ నిచ్చి జనుల తనివిని గనుమా!

  రిప్లయితొలగించండి
 5. కరకర లాడెడు యట్టుకు
  మరిగే సాంబారు చట్ని మధురము గాదే!
  వరదై పొంగవె కవితలు!
  పరమేశ్వరుడైనపట్టు పట్టగ దిగడే?

  రిప్లయితొలగించండి
 6. హనుమచ్చాస్త్రి గారూ ఎట్టెట్టా!

  సహదేవుడుగారూ బలేబాగుంది!

  రిప్లయితొలగించండి


 7. మొన్న ఇడ్లీ సాంబారు చట్నీ
  ఇవ్వాళ దోసా,చట్నీ సాంబారు
  కంది వారి బ్లాగు టపా టి 'ఫన్' లో
  రేపు ఏమి జిలేబి వచ్చును ?

  జిలేబి.

  రిప్లయితొలగించండి
 8. @సహదేవుడు గారూ మీ అట్టూ సంబారూ కరకర లాడుతూ రుచికరంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 9. సహదేవుడు గారూ ! కరకర లాడే అట్టు సాంబారు కోసం శం కర సాంబ సదాశివుణ్ణే దింపుతున్నారు...బాగుంది.
  లక్ష్మి గారూ.. జగతిని ఖ్యాతి జెందినట్టు బాగుంది.
  మిస్సన్న గారూ ! అట్టట్టే...ధన్యవాదములు.
  జిలేబి గారూ ! జిలేబి ఇంతకుముందే వడ్డించారు..

  రిప్లయితొలగించండి
 10. ప్ర. ఒక జిలేబి ఉండగా, మరొక జిలేబినా!!!
  జ. బహుశా వారికి ఉదయాన్నె కారంజిలేబి కావాలేమో?

  రిప్లయితొలగించండి
 11. శంకరయ్య గారు వంటల బ్లాగు తెరిచిరని సాంబారము తో దోస లి యొగ్గితి నట్టు నొక పట్టు పట్టంగ.

  (సరదా కోసమే నని మనవి)

  రిప్లయితొలగించండి
 12. మిస్సన్న గారికి ధన్యవాదములు.
  మిత్రులు గోలి వారూ, తీర్థ ప్రసాదా లేవి పెట్టిన స్వాములు దిగిరావటానికే గదండీ!

  రిప్లయితొలగించండి
 13. మిత్రులు లక్కరాజుగారికి ధన్యవాదములు . బహుకాల దర్శనం

  రిప్లయితొలగించండి
 14. మీ అట్టూ రోస్టూ శాస్త్రి గారి కొబ్బరి చట్నీ రమ్మంటూ ఉంటే రాకుండా ఉంటానా !

  ఈ మధ్య చెప్పకుండా మీ ఊరు వచ్చి మళ్ళా ఇంటికి చేరాను.

  రిప్లయితొలగించండి
 15. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, ఫిబ్రవరి 10, 2013 12:47:00 PM

  మినుప పప్పును గట్టిహ మిగుల రుబ్బి
  అట్ల పెనమున పెనవేసి అల్ల ముల్లి
  ముక్కలందున నూనెను మూత డిచ్చి
  అటు నిటు త్రిప్పగ తయారు న్స్ట్టు గాదె

  లొట్ట లేయుచు నిష్టమై అట్టు తినగ
  నారి కేళపు నంజుడు నాల్క జేర
  మరియు సాంబారు రసమిచ్చు మధుర రుచిని
  గట్టి పట్టు పట్టగ సరిపట్టు నట్టు గదర.

  రిప్లయితొలగించండి
 16. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, ఫిబ్రవరి 10, 2013 1:03:00 PM

  టైపాటు సవరణానంతరం
  మినుప పప్పును గట్టిగ మిగుల రుబ్బి
  అట్ల పెనమున పెనవేసి అల్ల ముల్లి
  ముక్కలందున నూనెను మూత డిచ్చి
  అటు నిటు త్రిప్పగ తయారు నట్టు గాదె

  లొట్ట లేయుచు నిష్టమై అట్టు తినగ
  నారి కేళపు నంజుడు నాల్క జేర
  మరియు సాంబారు రసమిచ్చు మధుర రుచిని
  గట్టి పట్టు పట్టగ సరిపట్టు నట్టు గదర.

  రిప్లయితొలగించండి
 17. పళ్ళె మందున ముద్దుగ పఱచి రచట
  దోసె మఱియును సాంబారు తోటి గిన్నె
  పచ్చి కొబ్బరి తోడన పచ్చడి యును
  రండి పంచుకు తింద ము రామ లార !

  రిప్లయితొలగించండి
 18. అట్టు లుండెను పూర్వ మమ్మమ్మ నాడు
  పిదప వచ్చెను దోసెలు ప్రియము మీర
  నేడు పీజాలు విందయ్యె చూడు మయ్య
  వచ్చు నికపైని క్రొంగ్రొత్త వంటకములు

  రిప్లయితొలగించండి
 19. డా. ప్రభల రామలక్ష్మిఆదివారం, ఫిబ్రవరి 10, 2013 3:07:00 PM

  ఎక్కువ కాలిన పెనమున
  తక్కువగా పిండి పోసి తాటించంగా
  ఎక్కదె రుచి యాదోశకు
  మక్కువతో తినని నరుడు మహిలో గలడే !

  తెల్లవారుసరికి తినుటకు సిద్ధమౌ
  తల్లివోలె కడుపు తడిమి నింపు
  ఉల్లిదోశ చేయునుదరమునకు శాంతి
  ఉల్లిదోశ కేది ఉర్వి సాటి.

  రిప్లయితొలగించండి
 20. లక్కరాజుగారూ ఊరొచ్చే ముందు మెయిల్ పెట్టి వచ్చివుంటే శుభ్రంగా కలుసుకుండే వాళ్లము కదండీ.నేను శాస్త్రగారు గుంటూరులో ఓ సారి అలాగే కలుసుకున్నాం. ఈ సారి మాత్రం అలా చేయరుకదా!

  రిప్లయితొలగించండి

 21. శంకరుని వంట ల లో పులుసు
  బులుసు వారిని కూడా లాగు
  కొని వచ్చినదంటే, కంది వారి
  టి ఫన్ ఈ మారు అదురహో నే!


  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి
 22. డా. ప్రభల రామలక్ష్మిఆదివారం, ఫిబ్రవరి 10, 2013 5:23:00 PM

  ఎక్కువ కాలిన పెనమున
  తక్కువగా పిండి పోసి తాటించంగా
  ఎక్కదె రుచి యాదోశకు
  మక్కువతో ఆరగించు మహిలో మనుజుల్!

  రిప్లయితొలగించండి
 23. నిద్ర కళ్ళను రాయలేక తెల్ల వారేసరికి విందుల ఘుమ ఘుమలు

  రోజున కొక పలహారము
  భోజనముల విందు మనకు భోక్తవ్య ములున్ !
  తాజాగా దొరకు నిచట
  మాజాలు దోసెలు జిలేబి మధువులు మెండౌ !

  రిప్లయితొలగించండి
 24. చిల్లుల దెల్లని నురుగుల
  గల్లోలము బోలి యుండు, గడలిని సుధయే
  పెల్లుబుకె నాశ దోసల
  నుల్లము రంజిల్లు గనగ నోహో! దోసా !!

  రిప్లయితొలగించండి
 25. " జగతిని ఖ్యాతి గడించిన " లక్ష్మీదేవి గారూ ! లెస్స బల్కితిరి! మేము న్యూయార్కు నగరము సందర్శించి నప్పుడు మా పిల్లలు ' నాన్నా !' ఈవేళ నీకో ' సంభ్రమ ' మని పాతాళ మార్గము లోంచి ప్రయాణము చేయించి ఒక ' దోస గుడిసె ' కు తీసుకొని వెళ్ళారు. అక్కడ మేమే భారతీయులము, తెల్లవారు,నల్ల వారు,యూదులు,మెక్సికన్లు, వీరు వారనక ఐక్యరాజ్యసమితి లాగ అందఱూ వరుస కట్టారు . అది నడుపుతున్నది శ్రీ లంక తమిళ తంబి. కాందిశీకుడు, కష్టజీవే గాని కాంచనమునకు లోటు లేదు.ఎడతెరిపి లేకుండా అలా పోస్తూనే ఉన్నాడు దోసెలు. మేమంతా అలా తింటూనే ఉన్నాము !

  రిప్లయితొలగించండి
 26. రకరకములుగా మన దోసెలపై మనసు దోచే పద్యములు చెప్పిన మిత్రులందరికీ అభినందనలు.

  దోసెల తీరులు యెన్నో
  మాసాలా , ఉల్లి , రవ్వ, మరి యెమ్మెల్యే
  మూసిన పెసరట్టుప్మా
  వేసిన ప్లైన్ మినప తినగ వేరుచులందున్.

  రిప్లయితొలగించండి
 27. శ్రీ గోలి హనుమచ్చాస్త్రి గారూ ! శంకరాభరణము లోనికి మీ 'శంకర విలాస్ ' ను గొనిదెచ్చినందులకు ధన్యవాదములు !

  గుట్టుయె లేకను నిక్కట
  నట్టుల బోయంగ గోలి హనుమచ్ఛాస్త్రీ !
  ఎట్టుల గాదన గలమీ
  పట్టున లాగింతు మయ్య పది,పది దోసెల్ !!

  రిప్లయితొలగించండి
 28. వావ్! నిద్రలేచి చూస్తే (మీకన్నా పన్నెండు గంటలు లేటుగా లేస్తాం)ఎందరో దోశ పండితులు.

  మినుప పప్పును గట్టిహ మిగుల రుబ్బి
  అట్ల పెనమున పెనవేసి అల్ల ముల్లి

  ఎక్కువ కాలిన పెనమున
  తక్కువగా పిండి పోసి తాటించంగా

  కరకర లాడెడు యట్టుకు
  మరిగే సాంబారు చట్ని మధురము గాదే!

  అట్టు లుండెను పూర్వ మమ్మమ్మ నాడు
  పిదప వచ్చెను దోసెలు ప్రియము మీర

  పళ్ళె మందున ముద్దుగ పఱచి రచట
  దోసె మఱియును సాంబారు తోటి గిన్నె
  పచ్చి కొబ్బరి తోడన పచ్చడి యును
  రండి పంచుకు తింద ము రామ లార !

  అలా ఆహ్వానిస్తుంటే వాటిని ఆస్వాదించకుండా ఉంటామా!

  పండిత మిత్రులకి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 29. దోసెలు పలు రకముల
  నాశగ తిను చుందు రిచట నంజుకు చట్నీ ! !
  దేశము మారిన నిరతము
  వాసితముగ వెలయు చుండు వాడల యందున్ !

  రిప్లయితొలగించండి
 30. ఘుమ ఘుమ లాడుచుండె నిట గుమ్ముగ కమ్మని దోసె వారెవా
  గమకము హెచ్చె జిహ్వకిక గమ్మున ముంచుక పుల్సు లోన నే
  నమిలెద పచ్చడిన్ రసన నచ్చిన రీతిని నంజుకొంచు నౌ
  తమరిక కట్టిబెట్టి నస తాళుడు కొంచెము నన్ను వీడుడీ.

  రిప్లయితొలగించండి
 31. మూర్తి గారూ ! మా శంకర్ విలాస్ దోసెలు నచ్చినందులకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 32. అల్పాహారంగా తీసుకొనవలసిన దానిని గురించి అనల్ప పద్యాలు వ్రాయడమే కాక చతురోక్తులతో వ్యాఖ్యలు వ్రాస్తూ పరస్పరం అభినందించుకుంటూ (నాకు శ్రమ తగ్గిస్తూ) ఒక ఆత్మీయ వాతావరణాన్ని సృష్టిస్తున్న మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
  చక్కని పద్యాలను రచించిన కవులు....
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  సహదేవుడు గారికి,
  మిస్సన్న గారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
  సుబ్బారావు గారికి,
  పండిత నేమాని వారికి,
  డా. ప్రభల రామలక్ష్మి గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
  అభినందనలు....
  *
  ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలు వ్రాసిన....
  చంద్రశేఖర్ గారికి,
  బులుసు సుబ్రహ్మణ్యం గారికి,
  లక్కరాజు వారికి,
  అజ్ఞాత గారికి,
  ధన్యవాదాలు.
  *
  జిలేబీ గారూ,
  ఇటీవలనే జలేబీల చిత్రం, వాటిపై మిత్రుల పద్యమాధుర్యం చవిచూడడం అయిపోయింది... తేదీ గుర్తు లేదు... వెనక్కి వెళ్ళి వెదకాలి...

  రిప్లయితొలగించండి
 33. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  దోశ సాటి మరేమిటి ?

  01)
  _______________________________

  దోర దోరగ వేగిన - దోశ గనిన
  తోయములు జాలు వారునే - తొలుత నోట
  తొందరించును కోరికే - దోశ తినగ
  దోశ ,పచ్చడి , సాంబారు - తోడ మెసవ
  దోశ సాటి మరేమిటి ? - దోశయేను !
  _______________________________

  రిప్లయితొలగించండి
 34. వసంత కిశోర్ గారూ,
  దోశపై దోషంలేని పద్యం వ్రాసారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 35. శంకరార్యు వంటసాల సమస్యలు
  చవులుమీరుచుండె జక్కనైన
  చట్ని,వెన్నదోసె ,సాంబారులో ముంచి ,
  యారగింప రండు,హాయిమీర.

  రిప్లయితొలగించండి