2, ఫిబ్రవరి 2013, శనివారం

పద్య రచన – 240

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. శిష్ట సంరక్షణము దుష్ట శిక్షణమ్ము
    ధర్మపాలనమున జగత్పతికి ముఖ్య
    మైన చక్రరాజాయుధమా! నమోస్తు
    శ్రీ సుదర్శనమా! సమాశ్రిత హితైషి!

    భక్త బృందమునకు కర్ణపర్వ మనగ
    అరి జనమ్ముల కమిత భయంకరముగ
    విష్ణుతత్త్వంబు జగతి వ్యాపింపజేయు
    పాంచజన్యమ! నీ కిదే ప్రణతి శతము

    హరికి శీర్షముపైని రత్నాభరణము
    గా మహోత్తమ పదమున క్రాలుచుండు
    ధన్యుడవు కిరీటమ్మ! రత్నముల రాశి!
    అంజలి ఘటింతు నీకు సమాదరమున

    రిప్లయితొలగించండి
  2. శంఖ మకుటము లలిగెనా చక్రము యును
    మమ్ముజూడరు నీవున్న మనుజు లనుచు
    దర్శనంబును చేయించ దయను నీవు
    వేంకటేశుడ నిటనుంచి వెడలినావ.

    రిప్లయితొలగించండి
  3. శంఖ చక్రము గాంచిన చాలు ననుచు
    అంత రంగము నందుండి యాద రించ
    కనులు మిరుమిట్లు గొలుపగ కాన లేని
    వెలుగు విరజిమ్ము చుండిన విభు డవయ్య

    రిప్లయితొలగించండి
  4. సుబ్రహ్మణ్య శాస్త్రిశనివారం, ఫిబ్రవరి 02, 2013 11:38:00 AM

    స్థిర తేజః పరిపూర్ణమై శుభదమై దేదీప్యమానమ్మునై
    వర కోటీరము శంఖ చక్రయుతమై స్వర్ణప్రభా స్నిగ్ధమై
    నిరతానందకరమ్ముగా వెలుగులీనెన్ నేత్రపర్వమ్ముగా
    తరమే దీని మహత్వమున్ దెలుప సాధ్యంబౌనె యా ధాతకున్ ?

    రిప్లయితొలగించండి
  5. శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారూ!
    శుభాభినందనలు.

    మీ పద్యములో కొన్ని మార్పులు సూచించున్నాను:

    2వ పాదమును ఇలా సవరించండి:
    వర కోటీర రథాంగ శంఖ యుతమై ........

    4వ పాదములో తరమే అనినా సాధ్యంబౌనె అనినా ఒకటే అర్థము. కాస్త పరిశీలించండి.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. వజ్ర వైడూర్య ఖచితమౌ బందురమ్ము
    మరియు శంఖచక్ర యుగ మమరు తిరుపతి
    వేంకటాచ లాధిపునకు ; వెల్గు లొసగు
    భక్తకోటికి కన్నుల పండు గగుచు

    రిప్లయితొలగించండి
  7. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, ఫిబ్రవరి 02, 2013 9:35:00 PM

    పద్మనాభుని వజ్రనాభమిడు భీతి
    శంఖనాదము వినినంత శత్రువదరు
    సత్యమార్గము వీడక సంచరింపు
    మనుచు బోధ సేయుచునుండె వినుడు వినుడు
    తత్కిరీట ప్రభలు భక్త తతుల గాచు




    రిప్లయితొలగించండి
  8. శ్రీనివాసుని రత్నకిరీటాన్ని చూసి స్పందించి మనోహరమైన పద్యలను రచించిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. ఆభరణమ్ములు గదిలో
    శోభిడునే? కోట్ల ధనము క్షుద్బాదితులౌ
    యీభూ జనులన్ కావగ
    రాబందులపాలుగాక రక్షించరయా!

    రిప్లయితొలగించండి